BigTV English

Thandel Movie : ఈ నాలుగు పాస్ అయితేనే మూవీ హిట్టా …?

Thandel Movie : ఈ నాలుగు పాస్ అయితేనే మూవీ హిట్టా …?

Thandel Movie : టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగ చైతన్య, మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ సాయిపల్లవి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ తండేల్.. ఈ మూవీ ఇవాళ భారీ అంచనాలతో పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ మూవీ థియేటర్లలో సక్సెస్ అవ్వాలంటే ఈ నాలుగు పరీక్షలు పాస్ అవ్వాలని సోషల్ మీడియాలో ఓ వార్త షికారు చేస్తుంది. తండేల్ మూవీ పాస్ అవ్వాల్సిన ఆ నాలుగు అతి ముఖ్యమైన పరీక్షలు ఏంటో చూద్దాం…


*. నాగచైతన్య ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న బ్లాక్ బస్టర్ ఇవ్వడం. థాంక్ యు, కస్టడీలతో పాటు క్యామియో చేసిన బాలీవుడ్ డెబ్యూ లాల్ సింగ్ చద్దా దారుణంగా పోయాయి. నా సామిరంగా హిట్ తర్వాత అక్కినేని ఫ్యాన్స్ కి ఏడాది గ్యాప్ వచ్చేసింది. ఇప్పుడు ఫ్యాన్స్ ఊపు కలిగించాలి అంటే మాత్రం ఈ మూవీ ఖచ్చితంగా హిట్ అవ్వాల్సిందే. చైతూకు కూడా ఇది లైఫ్ అండ్ డెత్ సమస్య.. చాలా కాలం తర్వాత ఈ మూవీ హిట్ అవుతుందేమో చూడాలి..

*. గీతా ఆర్ట్స్ బ్యానర్ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం. మీడియం రేంజ్ హీరో మీద అల్లు అరవింద్ ఇంత బడ్జెట్ ఖర్చు పెట్టడం అరుదు. కానీ సబ్జెక్టు మీద నమ్మకంతో ముందు వెనుకా ఆలోచించకుండా ఒప్పుకున్నారు. ఆయన నమ్మకం ఏంటో ప్రమోషన్ కార్యక్రమాల్లో చూసాము.. అది ఎలా ఉంటుందో చూడాలి..


*. కార్తికేయ 2 మూవీతో పాన్ ఇండియా లెవల్ లో హిట్ ను సొంతం చేసుకున్న డైరెక్టర్ ఈ మూవీ పై భారీ అంచనాలు పెట్టుకున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీని ప్రేక్షకులకు అందించాబోతున్నాడు. అతని నమ్మకం ఎలా ఉంటుందో అని అక్కినేని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.

*. ఇక చివరగా దేవిశ్రీ ప్రసాద్ కు ఈ సక్సెస్ చాలా కీలకం. పుష్ప 2 బోలెడు కిక్ ఇచ్చినా దాని బీజీఎమ్ లో ఇతరులు భాగం కావడం పట్ల తనలో కొంత అసంతృప్తి ఉంది.. ఈ మూవీకి ఇప్పటికి మ్యూజిక్ ప్లస్ గా నిలిచింది.. మరి ఈ మూవీతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంటాడేమో చూడాలి..

ఈ మూవీకి సాయి పల్లవి పెర్ఫార్మన్స్ ఓ రేంజు లో ఉంది. అమరన్ లో తన ఫ్యాక్టర్ ఎంత బాగా పని చేసిందో చూశాం. కాకపోతే ఇక్కడ నటన, డాన్స్ పరంగా చైతూ తో పోటాపోటీ సవాళ్లు ఎదురు కావడం ఒకరకంగా ఆమెలోని నటికి ఛాలెంజ్ విసిరినట్టే. ఇక మూవీ ఆమెకు ఎలాంటి టాక్ ను అందిస్తుందొ చూడాలి.. నాగ చైతన్య ఈ మూవీ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. బంగార్రాజు మూవీ తర్వాత ఈ మూవీ హిట్ అవుతుందని నమ్ముతున్నారు. తండేల్ రిజల్ట్ పైనే నాగ చైతన్య మూవీల ఛాన్స్ ఆధారపడి ఉంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ తో మూవీ పై అంచనాలు భారీగా పెరిగాయి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×