BigTV English

Suneetha Singer: ఇప్పుడు నీకు ముద్దు పెట్టలేం కదా? ప్రవస్తిపై సింగర్ సునీత ఫైర్

Suneetha Singer: ఇప్పుడు నీకు ముద్దు పెట్టలేం కదా? ప్రవస్తిపై సింగర్ సునీత ఫైర్

Suneetha Singer:నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే సింగర్ ప్రవస్తి, పాడుతా తీయగా, ఈటీవీ, సునీత, జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ ఇవే తెగ వైరల్ గా మారుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ‘పాడుతా తీయగా’ ప్రోగ్రాంలో రికమండేషన్ ఉన్నవారికి విలువ ఉంటుంది, తనను తప్పు లేకుండానే ఎలిమినేట్ చేశారని, ముఖ్యంగా బొడ్డు కిందకు చీర కట్టి ఎక్స్పోజ్ చేయమని బలవంతం పెట్టేవారు అంటూ తన బాధను వెళ్ళబుచ్చుకుంది. దీంతో వందల కొద్ది వీడియోలు, భిన్నవిభిన్నమైన థంబ్ నెయిల్స్ పెట్టి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే సింగర్ ప్రవస్తి మాట్లాడిన మాటలకు కొంతమంది సపోర్ట్ చేస్తుంటే.. మరికొంతమంది మాత్రం ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు.


ప్రవస్తి మాటలకు స్పందించిన సునీత.. వీడియో వైరల్

కష్టపడి పైకొచ్చి ఇంత స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్న ఆస్కార్ గ్రహీత ఎంఎం కీరవాణి , స్టార్ సింగర్ సునీతలపై ఈమె చేసిన కామెంట్లకు ప్రతి ఒక్కరు విరుచుకుపడుతున్నారు. వార్తలు దావణంలా పాకిపోతున్న వేళ ఇంస్టాగ్రామ్ ద్వారా సింగర్ సునీత స్పందించింది. “అందరికీ నమస్కారం.. నిన్నటి నుంచి ఒకటే వైరల్ అవుతోంది.. పాడుతా తీయగా, సింగర్ ప్రవస్తి, పాడుతా తీయగా జడ్జెస్, జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ అంటూ రకరకాల వార్తల వైరల్ అయ్యాయి. అమ్మాయి చాలా యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేసింది. తను ఎక్స్పోజ్ చేద్దాం అనుకున్నాను అని చెప్పింది కాబట్టి నేను ఈ పదం వాడాల్సి వచ్చింది. డైరెక్ట్ గా సునీత అని మాట్లాడింది కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. ప్రవస్తి.. నిన్ను బాలు గారు , జానకి గారు, చిత్రమ్మ అందరూ ఒళ్లో కూర్చోబెట్టుకున్నట్టుగానే.. నేను కూడా ఒళ్ళో కూర్చోబెట్టుకొని ముద్దు చేశానమ్మ. ఇప్పుడు నీకు 19 సంవత్సరాలు కదా.. అలాగే ఒళ్లో కూర్చోబెట్టుకొని ముద్దు చేస్తే బాగోదు కదా. చిన్నప్పుడు చాలా బాగా పాడావు అనే దానికంటే చాలా ముద్దుగా పాడావు అని అనే వాళ్ళం. అది నీకు గుర్తుందో లేదో. ముద్దుగా ఉండే దానివి.. ముద్దుగానే పాడేదానివి.. చిన్నప్పుడు పాడినట్టు 19 ఏళ్ళ తర్వాత కూడా అదే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ పాడింటే సంతోషించే వాళ్లలో మొట్టమొదటి వ్యక్తిని నేనే అవుతాను. ఎందుకంటే మా ప్రవస్థి , మా శ్రీ లలిత, మా ప్రణతి , మా గాయత్రి అని అందరితో చెప్పుకునే పిచ్చివాళ్ళం మేము.


ఆ ప్రాసెస్ నీకు తెలియదా అంటూ ప్రవస్తీపై మండిపడ్డ సునీత..

ఎందుకంటే ఎవరు పాడితే ఆ పాటలలో కరిగిపోయి కన్నీటి పర్యంతమైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అవి నువ్వు చూడలేదేమో. అలాంటి ప్రవస్తి ఈరోజు ఇంత పెద్దది అయిపోయి.. రోడ్డుమీదకి వెళ్లి ఇంత మందితో మాట్లాడి తన బాధను వెళ్లగక్కుకొని మా గురించి చర్చించే స్థాయికి ఎదిగిందంటే కొంచెం అసంతృప్తిగా కూడా ఉంది. నువ్వు పాడుతా తీయగా లోనే కాదు ఎన్నో సింగింగ్ కాంపిటీషన్ షోలలో పాల్గొన్నావు కదా.. ప్రాసెస్ ఏంటనేది తెలియదా..? కొన్ని పాటలను మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలని ప్రాసెస్ ఉంటుంది అది నీకు తెలియదా.. ఆడియన్స్ కి చెప్తే అన్ని విషయాలు చెప్పు.. సగం చెప్పి సగం బ్లేమ్ చేయకు అంటూ సునీత మండిపడింది. ప్రస్తుతం సునీత షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.

?utm_source=ig_web_copy_link

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×