Hari Hara Veera Mallu: ఈరోజుల్లో చాలావరకు సినిమాలు ముందుగా చెప్పిన తేదీకి విడుదల అవ్వడం లేదు. కచ్చితంగా ఒకట్రెండు సార్లు వాయిదా పడిన తర్వాతే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. కానీ ఇప్పటివరకు అసలు సినీ చరిత్రలోనే లేని విధంగా ఒక సినిమా ఏకంగా 11 సార్లు పోస్ట్‌పోన్ అయ్యి కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. అదే పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘హరి హర వీరమల్లు’. పవన్ సినిమాల్లో యాక్టివ్‌గా ఉన్న సమయంలో ఈ కథను ఓకే చేసి షూటింగ్ ప్రారంభించారు. పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్.. ఒకటి కాదు రెండు భాగాలుగా విడుదల కానుందని మేకర్స్ ముందే ప్రకటించారు. ఇప్పటికీ ‘హరి హర వీరమల్లు’ షూటింగ్ పూర్తి కాకపోయినా దీని సీక్వెల్‌పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటికొచ్చింది.
సీక్వెల్‌పై ఫోకస్
‘హరి హర వీరమల్లు’ పార్ట్ 1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ అనే ట్యాగ్‌లైన్‌తో ప్రేక్షకుల ముందుకు రావాలి. కానీ ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి దీని ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యే లోపు రాజకీయాల్లో బిజీ అయ్యారు. అయినా కొంతకాలం పాటు దీని షూటింగ్‌లో పాల్గొని కొంతవరకు షూటింగ్‌ను పూర్తిచేశారు. అయినా ఇంకా చాలావరకు షూటింగ్ పెండింగ్‌లోనే ఉంది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు తీసుకోవడంతో తను నటించాల్సిన సినిమాలు అన్నీ అయోమయంలో పడ్డాయి. ముఖ్యంగా ‘హరి హర వీరమల్లు’ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసిన తర్వాత కూడా పలుమార్లు పోస్ట్‌పోన్ అయ్యింది. ఇంతలోనే దీని సీక్వెల్‌పై ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చేసింది.
షూటింగ్ ముగిసింది
‘హరి హర వీరమల్లు’కు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేస్తున్న టీమ్ ద్వారా దీని సీక్వెల్ గురించి ఒక ఆసక్తికర విషయం బయటపడింది. ఈ సినిమా సీక్వెల్‌కు సంబంధించిన ఔట్‌డోర్ షూటింగ్ ముంబాయ్‌లో ముగిసిందని తెలుస్తోంది. చాలామంది ప్రేక్షకులు ఈ అప్డేట్ చూసి షాకవుతున్నారు. ఫస్ట్ పార్ట్ షూటింగ్ పూర్తి కాలేదు, సినిమా ప్రేక్షకుల ముందుకు రాలేదు, ఇప్పటికీ దీని రిలీజ్ డేట్‌పై సందేహాలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో దీని సీక్వెల్ షూటింగ్ పూర్తి కావడమేంటి అంటూ పవన్ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ బిజీ ఉండడం వల్ల ‘హరి హర వీరమల్లు’ను ఒకటే పార్ట్‌తో ఆపేస్తారేమో అని చాలామంది భావించారు. కానీ అలా జరగడం లేదని ఈ అప్డేట్‌తో క్లారిటీ వచ్చేసింది.
Also Read: పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య వివాదం మొదలయ్యింది ఇక్కడే
ఇది పూర్తి చేయండి
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటిస్తున్న ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) రెండు పార్ట్స్‌గా విడుదల అవ్వడం మంచి విషయమే కానీ సీక్వెల్ గురించి పక్కన పెట్టి ముందు పార్ట్ 1పై ఫోకస్ చేస్తే బాగుంటుందని ప్రేక్షకులు సలహా ఇస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ 11 సార్లు పోస్ట్‌పోన్ అయ్యింది. మరొక్క సారి పోస్ట్‌పోన్ అయినా కూడా చాలావరకు ప్రేక్షకుల్లో ఈ మూవీపై ఇంట్రెస్ట్ పోతుందని ఇండస్ట్రీ నిపుణులు భావిస్తున్నారు. మొత్తానికి మే చివర్లో ఈ మూవీ రిలీజ్ అవుతుందని మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఆ డేట్‌కు కూడా ‘హరి హర వీరమల్లు’ వస్తుందని ఫ్యాన్స్ సైతం నమ్మడం లేదు.