E-Paper
Advertisement

Sunny leone: సన్నీలియోన్ కి హైదరాబాద్ పోలీసులు చుక్కలు.. అసలేమైందంటే..?

Sunny leone: సన్నీలియోన్ కి హైదరాబాద్ పోలీసులు చుక్కలు.. అసలేమైందంటే..?
Advertisement

Sunny leone: ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ సన్నీలియోన్ (Sunny Leone) ఒకప్పుడు శృంగార తారగా ఒక వెలుగు వెలిగి, ఆ బ్యాక్ గ్రౌండ్ నుంచి బయటకు వచ్చి ఇప్పుడు బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కేవలం హిందీ సినిమాలు మాత్రమే చేస్తున్న ఈమె టాలీవుడ్ నుంచి అవకాశాలు రావడంతో ఇక్కడ కూడా అడపాదడపా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇకపోతే సన్నీలియోన్ కి దేశవ్యాప్తంగా మంచి పాపులారిటీ ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈమెను నేరుగా కలవడానికి అభిమానులు ఎంతగానో ఆసక్తి చూపిస్తారు. అయితే అలాంటి సమయంలో సడన్ గా హైదరాబాద్ పోలీసులు సన్నీలియోన్ కి షాక్ ఇస్తూ అభిమానులకు నిరాశ మిగిల్చారు. మరి అసలేమైందో ఇప్పుడు చూద్దాం.

సన్నీలియోన్ ప్రదర్శనను క్యాన్సిల్ చేసిన హైదరాబాద్ పోలీసులు..

Advertisement

అసలు విషయంలోకి వెళితే.. హైదరాబాదులో ఉన్న ఒక పబ్ లో సన్నీలియోన్ స్పెషల్ ఈవెంట్ ఒకటి ప్లాన్ చేయడం జరిగింది. ఆ ఈవెంట్ కి సన్నీ లియోన్ ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి ఉండగా.. ఆ ఈవెంట్ కాస్త ఇప్పుడు క్యాన్సిల్ అయినట్లు సమాచారం. హైదరాబాదులో జరగాల్సిన ఈవెంట్ కి హైదరాబాద్ పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో ఆమెను చూసి వెళ్దామని వచ్చిన అభిమానులు అందరూ కూడా తీవ్ర నిరాశలో మునిగిపోయారు. అంతేకాదు పెద్ద ఎత్తున ఇల్యూషన్ పబ్ కి ఆమె అభిమానులు కదిలి వచ్చారు. అయితే పబ్ బయట పోలీసులు భారీ సంఖ్యలో మోహరించి, అనుమతి లేదని చెప్పి అక్కడికి వస్తున్న అభిమానులను వెనక్కి పంపించేశారు. దీంతో సన్నీలియోన్ ను చూడాలనుకున్న అభిమానులు ఆమెను చూడలేక నిరాశలో మునిగిపోయారు.

నిరాశలో ఫ్యాన్స్..

Advertisement

ఇకపోతే పలువురు డీజేలను తీసుకొచ్చి ఇలా స్పెషల్ ఈవెంట్స్ నిర్వహిస్తూ ఉంటారు అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈసారి కాస్త భిన్నంగా ట్రై చేయాలని ప్రయత్నించిన పబ్ యాజమాన్యం మాత్రం ఇప్పుడు చిక్కుల్లో పడే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఏది ఏమైనా చాలా రోజుల వరకు సన్నీలియోన్ తెలుగులో ప్రేక్షకులను అలరించలేదు. ఇప్పుడు నేరుగా కలవడానికి వెళ్దామని అనుకున్న అభిమానులకు తీవ్ర నిరాశ మిగిలింది అని చెప్పవచ్చు. మరి దీనిపై సన్నీలియోన్ ఏదైనా ఒక వీడియో విడుదల చేయాలని కూడా ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.

సన్నీలియోన్ కెరియర్..

సన్నీలియోన్ విషయానికి వస్తే.. ఈమె గత బ్యాక్ గ్రౌండ్ ను కాస్త పక్కన పెడితే.. కెనడియన్ అమెరికన్ అయిన ఈమె మోడల్ గా తన కెరీర్ ను మొదలుపెట్టింది. ఇక 2005లో ఎమ్ టీవీ ఇండియాలో ఎమ్ టీవీ వీడియో మ్యూజిక్ అవార్డ్స్ కోసం రెడ్ కార్పెట్ పై నడిచి రిపోర్టర్ గా పనిచేసింది. ఇక 2011లో ఇండియన్ రియాల్టీ టెలివిజన్ సిరీస్ బిగ్ బాస్ లో కూడా పాల్గొనింది. ఇక 2012లో పూజా భట్ నటించిన ఎరోటిక్ థ్రిల్లర్ జిస్మ్ 2 లో బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత జాక్ పాట్ ,రాగిణి ఎంఎంఎస్ 2, ఏక్ పహాని లీల వంటి చిత్రాలతో అందరి దృష్టిని ఆకర్షించింది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×