E-Paper
Advertisement

Chiranjeevi: కళ్యాణ్ బాబుకు వదినమ్మ బహుమతి.. వీడియో షేర్ చేసిన చిరు

Chiranjeevi: కళ్యాణ్ బాబుకు వదినమ్మ బహుమతి.. వీడియో షేర్ చేసిన చిరు
Advertisement

Chiranjeevi: మెగా బ్రదర్స్ గురించి, వారి మధ్య ఉండే బాండింగ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముగ్గురు అన్నదమ్ములు త్రిమూర్తులుగా ఎప్పుడు కలిసే ఉంటారు. ముఖ్యంగా చిరు- కళ్యాణ్ మధ్య బంధం ఎంతో చూడముచ్చటగా ఉంటుంది. తమ్ముడిలా కాకుండా పెద్ద కొడుకులా పవన్ ను చూసుకుంటారు చిరు దంపతులు.

ఇక పవన్ సైతం కన్నతల్లితో సమానంగా వదినమ్మను చూసుకుంటారు. ఎన్నికల్లో గెలిచి వచ్చాక.. అన్న వదినల ఆశీస్సులను అందుకొని ఆ ప్రేమను చూపించారు. పవన్ గెలుపు ఎవరికి ఎంత ఆనందాన్ని ఇచ్చిందో తెలియదు కానీ, చిరుకు మాత్రం ఆకాశమే హద్దు లేనంత ఆనందాన్ని తీసుకొచ్చి పెట్టింది. తమ్ముడు గెలుపును తన గెలుపుగా భావించి చిరు.. తమ్ముడును ఆశీర్వదించాడు.

Advertisement

ఇక ఇప్పుడు పవన్ డిప్యూటీ సీఎంగా మారక అన్న వదినలను కలవడం జరిగింది. శాఖలను విభజించిన తరువాత పవన్ కు అన్నావదినలు.. ఆయనకు ఒక అద్భుతమైన బహుమతిని అందించారు. ఇందుకు సంబంధించిన వీడియోను కళ్యాణ్ బాబుకు వదినమ్మ బహుమతి అనే పేరుతో చిరు అభిమానులతో షేర్ చేసుకున్నాడు. ఒక పెన్నును సురేఖ.. పవన్ కు గిఫ్ట్ గా ఇచ్చింది.

స్పెషల్ గా డిజైన్ చేయించిన మోంట్ బ్లాంక్ పెన్నును ఆమె గిఫ్ట్ గా ఇచ్చింది. ఖరీదైన ఈ పెన్నును ఆమె పవన్ జేబులో పెట్టింది. ఇక ఆ పెన్నుతో పాటు తాను మొదట సంతకం పెట్టిన పది రూపాయల పెన్నును కూడా పవన్ జేబులో ఉంచుకోవడం విశేషం. ఇక అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చినందుకు పవన్.. అన్న వదినలకు థాంక్స్ చెప్పారు. తెలుగు ప్రజల ఆకాంక్షలను నిజం చేస్తావని ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ మీ అన్న వదిన అంటూ చిరు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×