BigTV English

Delhi High Court: సునీత కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు.. నిబంధనలు ఉల్లంఘించినందుకే..!

Delhi High Court: సునీత కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు.. నిబంధనలు ఉల్లంఘించినందుకే..!

Delhi High Court Issued Notices To Sunita Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీత కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. అరవింద్ కేజ్రీవాల్ పోలీస్ కస్టడీ సమయంలో మార్చి 28న రూస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచిన సమయంలో హాజరుపరిచినప్పుడు కోర్టు వీడియో కాన్ఫరెన్స్ నిబంధనలను ఉల్లంఘించినందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సునీతా కేజ్రీవాల్ సహా అన్ని పార్టీలకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.


ఈ కేసులో సునీతా కేజ్రీవాల్‌తో పాటు మరో ఐదుగురు వ్యక్తిగత ప్రతివాదులు పోస్ట్‌లను తీసివేయాలని హైకోర్టు ఆదేశించింది. ఆ రోజు రికార్డ్ చేసిన వీడియోకు సంబంధించి ఏవైనా ఇతర పోస్ట్‌లు లేదా రీపోస్ట్‌లను తీసివేయాలని సోషల్ మీడియా కంపెనీలను ఆదేశించింది.

న్యాయస్థానం ఎక్స్-పార్టీ మధ్యంతర ఉత్తర్వును జారీ చేసింది. జూలై 9న తదుపరి విచారణకు ఈ అంశాన్ని జాబితా చేసింది. న్యాయవాది వైభవ్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌పై శనివారం విచారణ జరిగింది.


Also Read: బీహార్ సీఎం నితీష్ కుమార్‌పై పీకే సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అరెస్ట్ అయిన తర్వాత మార్చి 28న అరవింద్ కేజ్రీవాల్‌ను ట్రయల్ కోర్టు ముందు హాజరుపరిచినప్పుడు, అతను స్వయంగా కోర్టును ఉద్దేశించి మాట్లాడాలని ఎంచుకున్నాడని, ఆ ప్రక్రియకు సంబంధించిన వీడియో రికార్డింగ్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని సింగ్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. కోర్టు ప్రొసీడింగ్స్, వీడియో కాన్ఫరెన్స్‌లు రికార్డు చేయడం.. వాటిని సోషల్ మీడియాలో పోస్టింగ్ చేయడం ఢిల్లీ హైకోర్టు రూల్స్, 2021 ప్రకారం నిషేదం.

ఆ వీడియోను సునీతా కేజ్రీవాల్‌తో పాటు మరికొందరు మళ్లీ పోస్ట్ చేశారని పిటిషనర్ ఆరోపించారు.

Related News

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Big Stories

×