BigTV English

CM Chandrababu: ఎన్టీఆర్ భవన్‌కు ఏపీ సీఎం చంద్రబాబు.. టీడీపీ శ్రేణుల ఘనస్వాగతం

CM Chandrababu: ఎన్టీఆర్ భవన్‌కు ఏపీ సీఎం చంద్రబాబు.. టీడీపీ శ్రేణుల ఘనస్వాగతం

CM Chandrababu: ఏపీ సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి సారి ఆయన మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌లో అడుగుపెట్టారు. దీంతో టీడీపీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం ఫలికారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు, నేతలు ఎన్టీఆర్ భవన్ వద్దకు రావడంతో పరిసర ప్రాంతాల వద్ద సందడి నెలకొంది. జై చంద్రబాబు, చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి అంటూ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పలువురు నేతలు సీఎంకు పూల బొకేతో స్వాగతం పలికారు.


ఇక నుంచి తరుచూ చంద్రబాబు పార్టీ కార్యాలయానికి వెళ్లనున్నట్లు సమాచారం. భవిష్యత్తులో సీఎం పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లనున్నారని తెలుస్తోంది. జిల్లాలోని పార్టీ కార్యాలయాలను సైతం సందర్శించాలని మంత్రులు, నేతలను ఇదివరకే సీఎం చంద్రబాబు ఆదేశించారు.

Also Read: తెలంగాణలో ఏపీ మాజీ సీఎం జగన్‌కు బిగ్ షాక్.. లోటస్ పాండ్ నివాసంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత


నాకు ప్రజలకు మధ్య అడ్డుగోడలు ఉండటానికి వీల్లేదు.. ప్రజల సమస్యలు, వినతుల స్వీకరణకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తామని చంద్రబాబు అన్నారు. సచివాలయంలో వినతుల స్వీకరణ ఎలా చేయాలి అనే అంశంపై ఆలోచిస్తున్నామని తెలిపారు. సమస్యల పరిష్కారానికి నిర్దిష్ట సమయం ఉండేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అంతే కాకుండా సచివాలయానికి రాకపోకల కోసం రవాణా, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. పోలవరం సందర్శనతోనే తన క్షేత్ర స్థాయి పర్యటన ప్రారంభం అవుతుందని తెలిపారు. అసెంబ్లీ సమావేశాల తేదీలు త్వరలోనే నిర్ణయిస్తామని చెప్పారు.

Tags

Related News

Fishermen Vs Police: హై టెన్షన్.. అనకాపల్లి హైవే క్లోజ్! మత్స్యకారులు Vs పోలీసులు

Nara Lokesh: హైదరాబాద్ అభివృద్ధికి 30 ఏళ్లు పట్టింది.. విశాఖకు పదేళ్లు చాలు: లోకేష్

Anantapur: దారుణం.. ఇంటి ముందు క్రికెట్ ఆడొద్దన్నందుకు.. మహిళపై కానిస్టేబుల్ దంపతులు దాడి

YSRCP vs TDP: బొత్స ‘అంతం’ మాటలు.. జగన్ ప్లాన్‌లో భాగమేనా?

Nara Lokesh: విశాఖలో తొలి ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్‌కు నారా లోకేష్ శంకుస్థాపన

AP Govt: ఏపీలో నకిలీ మద్యానికి చెక్.. కొత్తగా యాప్ తీసుకురానున్న ప్రభుత్వం, అదెలా సాధ్యం

Vijayawada Singapore Flight: విజయవాడ-సింగపూర్ మధ్య ఇండిగో కొత్త విమాన సర్వీస్.. ఎప్పటి నుంచంటే?

Lulu Mall: లులూ మాల్‌పై పవన్ ఫైర్.. సీఎం చంద్రబాబు స్పందన ఇదే, ఇక లేనట్లేనా?

Big Stories

×