BigTV English

Surekha Konidela: హీరోయిన్ తో బలవంతంగా అలాంటి పని చేయించిన సురేఖ.. కట్ చేస్తే..!

Surekha Konidela: హీరోయిన్ తో బలవంతంగా అలాంటి పని చేయించిన సురేఖ.. కట్ చేస్తే..!

చిరంజీవి (Chiranjeevi)భార్య సురేఖ(Surekha) ఒక గొప్ప ఇల్లాలుగా ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకుంది. చిరంజీవి భార్యగా ఈమెకు ఇండస్ట్రీలో ఎంతమంచి గుర్తింపు ఉందో చెప్పనక్కర్లేదు. ఎలాంటి వివాదాలకు తావు ఇవ్వకుండా, ఎలాంటి గొడవలు లేకుండా మెగా ఫ్యామిలీ అంతా బాగా కలిసి ఉంది అంటే దానికి కారణం సురేఖ అనే చెప్పుకోవాలి. సురేఖ పవన్ కళ్యాణ్(Pawan Kalyan), నాగబాబు(Nagababu) లను సొంత కొడుకు ల్లాగే చూసుకుంది. ఒక్క సురేఖ కారణంగానే మెగా ఫ్యామిలీ లో ఎలాంటి గొడవలు ఇప్పటివరకు రాలేదు అంటూ మెగా బ్రదర్ నాగబాబు ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. అంతేకాదు చిరు అన్నయ్య ఒక మాట అన్నా కూడా వదినే అన్నయ్యకు సర్ది చెబుతుంది. సురేఖ లాంటి వదిన ఏ ఇంట్లో ఉన్నా కూడా ఆ ఇల్లు ఎప్పటికీ అన్యోన్యంగా ఉంటుంది అంటూ నాగబాబు ఓ ఇంటర్వ్యూలో తెలిపిన సంగతి మనకు తెలిసిందే. అయితే అలాంటి సురేఖ ఓ హీరోయిన్ ని పొట్టి డ్రెస్ వేసుకోమని తెగ టార్చర్ చేసిందట. మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు..? ఎందుకు సురేఖ ఆ హీరోయిన్ ని బలవంత పెట్టి మరీ వెస్ట్రన్ డ్రెస్ వేయించింది? అనేది ఇప్పుడు చూద్దాం..


రాశీ చేత బలవంతంగా వెస్ట్రన్ డ్రెస్ వేయించిన సురేఖ..

అల్లు రామలింగయ్య(Allu Ramalingaiah) కూతురుగా, చిరంజీవి భార్యగా సురేఖకు ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది.అయితే అలాంటి సురేఖ పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీకి హీరోగా రావడానికి ఎంతో కృషి చేసిన సంగతి మనకు తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఇప్పటికే చాలాసార్లు మా వదిన వల్లే నేను సినిమాల్లోకి వచ్చానని చెప్పుకొచ్చారు. అలా పవన్ కళ్యాణ్ సినీ ఎంట్రీ వెనుక సురేఖ హస్తం ఉంది.అయితే అలాంటి సురేఖ తన మరిది పవన్ కళ్యాణ్ కోసం ఓ హీరోయిన్ ని వెస్ట్రన్ డ్రెస్ వేసుకోమని తెగ టార్చర్ చేసిందట. ఇక ఆ హీరోయిన్ ఎవరో కాదు ..అందాల తార రాశీ (Rasi).. ఒకప్పటి సీనియర్ నటి రాశీ.. ప్రస్తుతం బొద్దుగా తయారైంది. కానీ ఒకప్పుడు ఈ ముద్దుగుమ్మ అందానికి ఎంతో మంది ఫిదా అయ్యారు. అయితే పవన్ కళ్యాణ్ , రాశీ కాంబోలో ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్ వహించిన ‘గోకులంలో సీత’ సినిమా వచ్చింది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ని ఫిక్స్ చేయడం కోసం తెర వెనుక పెద్ద కథ నడిచిందట.ఎందుకంటే ఈ సినిమాకి హీరోయిన్ గా రాశిని సెట్ చేసింది ఎవరో కాదు చిరంజీవి భార్య సురేఖనే.అవును మీరు వినేది నిజమే. సురేఖ వల్లే రాశీకి పవన్ కళ్యాణ్ తో నటించే అవకాశం వచ్చింది. అయితే ఓ సినిమాలో రాశీ నటనను చూసి ఫిదా అయిన సురేఖ ఈ అమ్మాయి మన పవన్ సినిమాలో ఎలా ఉంటుంది అని చిరంజీవిని అడిగిందట.


ఫైనల్ గా పవన్ కళ్యాణ్ మూవీలో అవకాశం..

దానికి చిరంజీవి కూడా బాగుంటుంది అని చెప్పడంతో ఓసారి పని మీద ముంబైకి వెళ్లిన సమయంలో డైరెక్టర్ రవి రాజా పినిశెట్టికి ఈ విషయం చెప్పగా.. వెంటనే డైరెక్టర్, రాశీ నాన్న ఫోన్ నెంబర్ చిరంజీవికి ఇచ్చారట. అయితే రాశీ చీర కట్టుకున్న ఫోటోలో చాలా అందంగా ఉంటుంది. కానీ వెస్ట్రన్ డ్రెస్ లో ఎలా ఉంటుందో చూడాలని అనుకున్నా సురేఖ వెంటనే రాశీ ఇంటికి చిరంజీవి మేనేజర్ ద్వారా కాల్ చేసి చిరంజీవి రమ్మన్నారు అని కబురు పంపించిందట.దాంతో చిరంజీవి నన్నెందుకు రమ్మన్నారు. ఆయన సినిమాలో ఏదైనా ఆఫర్ ఇస్తారా? అని సంతోష పడిపోయి వెంటనే రాశీ చిరంజీవి ఇంటికి వెళ్లిందట. ఇక అక్కడికి వెళ్ళాక సురేఖనే ఫోన్ చేయించిందనే విషయం తెలుసుకొని ఎందుకు రమ్మన్నారు అండి అని అడగగా.. మీరు చీరలో చాలా బాగున్నారు.. కానీ వెస్ట్రన్ డ్రెస్ లో ఎలా ఉంటారో ఒకసారి చూడాలి అని చెప్పిందట. కానీ వెస్ట్రన్ డ్రెస్ వేసుకోవడానికి రాశి ముందుగా ఒప్పుకోలేదట. సురేఖ మాత్రం సినిమాలో ఛాన్స్ ఉంది దానికోసం ఈ టెస్ట్ షూట్ అని చెప్పడంతోనే బలవంతంగానే రాశీ వెస్ట్రన్ డ్రెస్ వేసుకొని ఫోటోషూట్ కి సహకరించిందట. ఆ సమయంలో సురేఖ బలవంతం వల్లే రాశీ వెస్ట్రన్ డ్రెస్ వేసుకోవడానికి ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త విన్న చాలా మంది నెటిజన్లు హోమ్లీ హీరోయిన్ ని వెస్ట్రన్ డ్రెస్ వేయించడానికి చిరంజీవి , సురేఖలు అలా ప్లాన్ చేశారా అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక చివరికి వెస్ట్రన్ డ్రెస్ లో ఆమె చాలా అందంగా కనిపించడంతో ఆమెనే పవన్ కళ్యాణ్ సినిమాలో హీరోయిన్గా పెట్టినట్లు సమాచారం.

Related News

Rakesh Poojary: ‘కాంతారా-1’లో కడుపుబ్బా నవ్వించిన.. ఈ నటుడు ఎలా చనిపోయాడో తెలుసా? కన్నీళ్లు ఆగవు!

Janu lyri- Deelip Devagan: జాను లిరితో బ్రేకప్.. దిలీప్ రియాక్షన్ ఇదే.. సెలబ్రిటీలం కాబట్టే అంటూ!

Siva jyothi: ఘనంగా శివ జ్యోతి సీమంతపు వేడుకలు.. ఫోటోలు వైరల్!

Manchu Manoj: భార్యపై మనసులోని భావాలు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ 

Tollywood: భార్య వేధింపులు తాళలేక ప్రముఖ నటుడు ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో వైరల్!

Kissik Talks Promo : మహేష్ విట్టా లవ్ స్టోరిలో ఇన్ని ట్విస్టులా..ఆ ఒక్క కోరిక తీరలేదు..

Ritu Chaudhary : చెప్పు రీతు నువ్వు నన్ను మోసం చేయలేదా? రీతుకి కళ్యాణ్ తో బంధం తెగిపోయిందా?

Bigg boss emmanuel : నా బాధ మీకు తెలియదు, రోజు దుప్పటి కప్పుకుని ఏడుస్తాను

Big Stories

×