BigTV English

Tollywood : 2025లో ఈ పాన్ ఇండియా స్టార్ల సినిమాలు కష్టం… అభిమానులకు నిరాశే

Tollywood : 2025లో ఈ పాన్ ఇండియా స్టార్ల సినిమాలు కష్టం… అభిమానులకు నిరాశే

Tollywood : 2024లో ప్రభాస్ (Prabhas), ఎన్టీఆర్ (Jr NTR), అల్లు అర్జున్ (Allu Arjun) హవా కనిపించింది. ఎన్ని సినిమాలు రిలీజ్ అయినప్పటికీ, ఈ ముగ్గురు స్టార్ హీరోల సినిమాలే పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ ని ఊపేశాయి. అయితే 2025లో మాత్రం సీనియర్ హీరోల నామస్మరణ జరగబోతోంది. ఈ సంక్రాంతి నుంచి మొదలు పెడితే ఇయర్ ఎండ్ వరకు సీనియర్ హీరోల సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి. అయితే కొంతమంది పాన్ ఇండియా స్టార్స్ మాత్రం 2025లో తెలుగు ప్రేక్షకులను పలకరించే ఛాన్స్ లేదు. అలా ఈ ఏడాది ముగ్గురు పాన్ ఇండియా స్టార్ల అభిమానులు, వాళ్ళను తెరపై మిస్ అవ్వడం ఖాయం.


2025లో ఏ హీరోల సినిమాలు రిలీజ్ కావట్లేదు అంటే… ఈ లిస్టులో మహేష్ బాబు (Mahesh Babu), అల్లు అర్జున్ (Allu Arjun) ఉన్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో ‘ఎస్ఎస్ఎంబీ 29’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూజా కార్యక్రమాలు రేపు జరగబోతున్నాయి. అయితే ఈ మూవీ షూటింగ్ పూర్తయి, రిలీజ్ కావాలంటే చాలా కాలం వెయిట్ చేయక తప్పదు. జక్కన్న సినిమా పర్ఫెక్ట్ గా రావడం కోసం ఏళ్ల తరబడి సినిమాలను ఎలా చెక్కుతారో ఇప్పటిదాకా చూశాం మనం.

ఆ తర్వాత చెప్పుకోవాల్సింది అల్లు అర్జున్ గురించి. ‘పుష్ప 2’ మూవీ తో రీసెంట్ గా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఐకాన్ స్టార్ నెక్స్ట్ మూవీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ నెక్స్ట్ మూవీ ఉండబోతుందని టాక్ నడుస్తోంది. కానీ ప్రస్తుతం నెలకొన్న వివాదాల కారణంగా అల్లు అర్జున్ కనీసం ‘పుష్ప 2’ సక్సెస్ ని కూడా ఎంజాయ్ చేయలేకపోయారు. మరి వెంటనే నెక్స్ట్ మూవీకి ఆయన సిద్ధమవుతారా? లేదంటే కాస్త గ్యాప్ తీసుకుంటారా అనేది చూడాలి. ఒకవేళ ఇప్పుడే ఆయన సినిమాను మొదలు పెట్టినా అది ఈ ఏడాది మాత్రం రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదు. కాబట్టి ఏడాది మహేష్ బాబు అభిమానులతో పాటు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి కూడా నిరాశ తప్పదు.


ఇక ఈ లిస్టులో ఉన్న మరో హీరో ఎన్టీఆర్. ఆయన డైరెక్ట్ గా ‘వార్ 2’ అనే హిందీ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది అనుకోండి. కానీ ఎన్టీఆర్ డైరెక్ట్ తెలుగు మూవీ మాత్రం ఈ ఏడాది లేకపోవడం గమనార్హం.

ఇక 2025లో సందడి చేయబోతున్న సీనియర్ హీరోలలో బాలకృష్ణ (Balakrishna), వెంకటేష్ (Venkatesh), చిరంజీవి (Chiranjeevi) ఉన్నారు. ‘డాకు మహారాజ్’, ‘అఖండ 2’ సినిమాలతో బాలయ్య ఫుల్ జోష్ లో ఉండబోతున్నారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో ఈ పొంగల్ కి వెంకీ మామ పలకరించబోతున్నారు. అలాగే చిరంజీవి ‘విశ్వంభర’తో, సూపర్ స్టార్ రజినీకాంత్ కూలీ’తో, కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’, ధనుష్ ‘కుబేర’ సినిమాలతో ప్రేక్షకులను పలరించనున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×