BSNL : నూతన సంవత్సరం 2025 సందర్భంగా, దేశీయ ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం దిగ్గజం BSNL అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశ పెట్టింది. రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా వంటి ప్రైవేట్ కంపెనీలు తమ రీఛార్జ్ ధరలను పెంచడంతో లక్షలాది మంది వినియోగదారులు BSNL వైపు మొగ్గు చూపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బీఎస్ఎన్ఎల్ తమ సబ్‌స్క్రైబర్ సంఖ్య పెంచుకునే దిశగా సరికొత్త ప్లాన్‌లను తీసుకొస్తోంది. దీంతో బెస్ట్ అన్లిమిటెడ్ రీఛార్జ్ ప్లాన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ప్రముఖ టెలికామ్ సంస్థ బిఎస్ఎన్ఎల్ ధరలను పెంచకపోవడమే కాకుండా చౌకైన ప్లాన్‌లను కూడా ప్రవేశపెడుతోంది. రీసెంట్‌గానే 60 రోజుల పాటు 120 GB డేటాను అందించే చౌకైన ప్లాన్‌ను కూడా ఇంట్రడ్యూస్ చేసింది. అలా ఇప్పుడు తాజాగా మరో కొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ కొత్త ప్లాన్ ఆఫర్లో బీఎస్ఎన్ఎల్… ప్రతి రోజు 2 జీబీ డేటా, అన్లిమిటెడ్ కాల్స్, ఎస్ఎమ్ఎస్, ఇతర బెనిఫిట్స్‌ను 150 రోజుల వ్యాలిడిటీతో తక్కువ ధరకే అందిస్తోంది.
ప్లాన్ వివరాలు ఇవే –
ఈ కొత్త న్యూ ఇయర్ ప్లాన్ ధర రూ.397. 5 నెలల వ్యాలిడీతో అంటే దాదాపు 150 రోజుల గడువుతో ఇది వచ్చింది. అన్ని టెలికామ్ ఆపరేటర్స్‌లో ఇదే అత్యంత చౌక ప్లాన్ అని చెప్పొచ్చు. రూ.397లతో రిఛార్జ్ చేస్తే వినియోగదారులకు కొన్ని కీ బెనిఫిట్స్ వస్తాయి. మొదటి 30 రోజులు ఏ నెట్‌వర్క్‌కు అయినా అన్లిమిటెడ్ కాలింగ్ ఉంటుంది. అంటే దీంతో కస్టమర్లు అన్‌లిమిటెడ్‌గా కాల్స్ చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఎక్కడి వెళ్లినా ఫ్రీ రోమింగ్ ఉంటుంది. రోమింగ్ ఛార్జెస్ అస్సలు ఉండవు.
ప్రతి రోజూ 2 జీబీ హై స్పీడ్ డేటా అందుబాటులో ఉంటుంది. మొదటి 30 రోజుల పాటు మొత్తంగా 60 జీబీ డేటా వరకు ఫ్రీ డేటాగా లభిస్తుంది. అలానే మొదటి 30 రోజుల పాటు ప్రతి రోజు 100 SMSలు ఫ్రీగా పంపించుకోవచ్చు. ఇక 30 రోజులు పూర్తవ్వగానే, రిఛార్జ్ చేసిన కస్టమర్లకు ఈ ప్లాన్ వ్యాలిడిటీ అలానే ఉంటుంది. కానీ ఇతర ఫెసిలిటీస్ వినియోగించుకోవాలంటే ఛార్జ్ చేయాలి. అడిషనల్ యాడ్ ఆన్ ప్లాన్ దీనికి యాడ్ చేయబడుతుంది.
న్యూ ఇయర్ సందర్భంగా 5G నెట్‌వర్క్ –
మరోవైపు BSNL తన 4G నెట్‌వర్క్‌ను మరింత విస్తరించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఇప్పటికే 60,000కు పైగా 4G టవర్లు ఉన్నాయి. ఇంకా ఈ కొత్త సంవత్సం సందర్భంగా త్వరలోనే 5G సేవలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే లక్షలాది మంది తమ సిమ్ కార్డులను ప్రైవేట్ కంపెనీల నుంచి బీఎస్‌ఎన్‌ఎల్‌కు పోర్ట్ చేసిన సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్టుగానే BSNL తమ 5జీ సర్వీస్ లాంఛ్ డేట్‌ను కూడా ఈ నెలే ప్రకటించనుంది. తద్వారా తమ యూజర్స్‌కు కంప్లీట్ నెట్‌వర్క్, హై స్పీడ్ డేటాను దేశవ్యాప్తంగా అందించనుంది.
ఇక ఇతర టెలికాం సంస్థలన్నీ తమ రీఛార్జ్ ఆఫర్స్ విపరీతంగా పెంచేయడంతో బిఎస్ఎన్ఎల్ తక్కువ ధరలకే బెస్ట్ ప్లాన్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. దేశవ్యాప్తంగా తమ సేవలను మరింత విస్తరించే ప్రయత్నం మెుదలు పెట్టింది. మరి చూడాలి త్వరలో ఇంకెన్ని ఆఫర్స్ తీసుకొస్తుందో!
ALSO READ : Poco C75 vs Lava Yuva 2 vs Infinix Hot 50 : వీటిలో రూ.10వేలలోపు బెస్ట్ 5G మెుబైల్ ఏదంటే!