E-Paper
Advertisement

Suriya : వద్దు అంటున్నా… హైట్ తక్కువ అంటూ స్టేజ్‌పైనే సూర్య పరువు మొత్తం తీసేసిన బాలీవుడ్ స్టార్..

Suriya : వద్దు అంటున్నా… హైట్ తక్కువ అంటూ స్టేజ్‌పైనే సూర్య పరువు మొత్తం తీసేసిన బాలీవుడ్ స్టార్..
Advertisement

Suriya : తమిళ స్టార్ హీరో సూర్య నటించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘కంగువ’ (Kanguva). ఈ సినిమా ప్రమోషన్లలో సూర్య (Suriya) హైట్ పై బాబీ డియోల్ (Bobby Deol) చేసిన కామెంట్స్ పై ట్రోలింగ్ జరుగుతోంది.

సూర్య హీరోగా, మరో కోలీవుడ్ హీరో అజిత్ తో వీరం, విశ్వాసం, వేదాళం , వివేకం వంటి సినిమాలను తెరకెక్కించిన డైరెక్టర్ శివ దర్శకత్వంలో వస్తోన్న సినిమా ‘కంగువ’ (Kanguva). ఇందులో సూర్యతో పాటు నట్టి  నటరాజ్, బాలీవుడ్ స్టార్ బాబి డియోల్, హిందీ హీరోయిన్ దిశా పటాని తదితరులు నటించారు. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. చారిత్రక నేపథ్యం కలిగిన ఈ ఫాంటసీ మూవీని దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. నవంబర్ 14న ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో ఏకంగా 10 భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ పాన్ ఇండియా యాక్షన్ ఫాంటసీ మూవీ సూర్య కెరీర్ లో తమిళ చిత్ర పరిశ్రమలో కూడా అత్యంత భారీ బడ్జెట్ సినిమాల్లో ఒకటి. ఇక రోజు రోజుకూ ఈ సినిమా గురించి వస్తున్న వార్తలు సినిమాపై అంచనాలను అమాంతం పెంచేస్తున్నాయి.

Advertisement

గతవారం ముంబైలో సూర్య ‘కంగువ’ (Kanguva) ప్రమోషన్స్ ను షురూ చేశాడు. ఉత్తర భారత దేశంలో సూర్యతో సహా చిత్ర బృందమంతా ప్రమోషన్లతో బిజీ బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఓ ఇంటర్వ్యూలో సూర్య హైట్ గురించి బాబి డియోల్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సదరు ఇంటర్వ్యూలో బాబి మాట్లాడుతూ ‘సూర్య ఫిజికల్ అప్పియరెన్స్ గురించి మాట్లాడారు. అయితే అతను ఉన్నదానికంటే మరింత హైట్ అక్కర్లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన నెక్స్ట్ లెవెల్ హైట్ లో నిలబడ్డారు. ఎంతోమంది కంటే ఆయన చాలా మంచివారు. తన మంచితనం, గుణంతో ఎవ్వరూ అందుకోలేనంత ఎత్తులో ఉన్నారాయన. అలాగే పర్ఫామెన్స్ పరంగా మాట్లాడుకోవాల్సి వస్తే సినిమా చేస్తున్నప్పుడు పెద్ద గాయం అయినప్పటికీ ఆయన షూటింగ్ ని ఆపలేదు. మేము చాలా భయపడ్డాము ఆ గాయమైనప్పుడు. అయినప్పటికీ ఆయన షూటింగ్ ఆపకపోవడం చూస్తే సినిమా పట్ల ఆయనకున్న ప్యాషన్ ఏంటో అర్థం అవుతుంది. కాబట్టి ఆయన కచ్చితంగా టాల్ గాయ్ ” అంటూ సూర్య పై ప్రశంసల వర్షం కురిపించారు బాబి డియోల్. కానీ ఇంటర్వ్యూలో ఆయన చేసిన కామెంట్స్ ను నెగెటివ్ గా తీసుకున్నారు కొంతమంది.

ఫిజికల్ అప్పియరెన్స్ గురించి సూర్య ఎత్తు గురించి మాట్లాడలేదు. కానీ బాబి డియోల్ మాట్లాడిన విధానం తప్పుగా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే నిజానికి గతంలో ‘బాబీ డియోల్ ఫిజికాల్టీ ముందు నిలబడడానికి నా కాన్ఫిడెన్స్ ని, ధైర్యాన్ని కూడగట్టుకున్నాను. ఎందుకంటే ఇలాంటి వ్యక్తితో కంగువ (Kanguva) సినిమాలో నేను ఫైట్ చేయాల్సి ఉంటుంది’ అంటూ సూర్య స్వయంగా చెప్పుకొచ్చారు. ఇక ఇప్పుడు దానికి సింక్ చేస్తూ సన్ని డియోల్ “ఆయన చాలా కైండ్ వ్యక్తి. ఇప్పుడున్న దానికన్నా అయినా ఎక్కువ హైట్ ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన అందుకోలేనంత ఎత్తులో ఉన్నారు” అంటూ సూర్య పై ప్రశంసల వర్షం కురిపించారు. కానీ ఇది అర్థం కాని కొంతమంది నెటిజన్లు సూర్య హైట్ గురించి తప్పుగా మాట్లాడాడు అంటూ బాబీని తప్పుపడుతున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×