BigTV English

Washington Sundar: “వాషింగ్టన్ సుందర్” అనే పేరు వెనుక సీక్రెట్‌ ఇదే !

Washington Sundar: “వాషింగ్టన్ సుందర్” అనే పేరు వెనుక సీక్రెట్‌ ఇదే !

 


Washington Sundar: టీమిండియా స్పిన్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ ( Washington Sundar) చరిత్రను సృష్టిస్తున్నాడు. న్యూజిలాండ్ తో పూణే వేదికగా గురువారం జరిగిన రెండో టెస్ట్ లో వాషింగ్టన్ సుందర్ ఏడు వికెట్లతో అద్భుతంగా రాణించాడు. అసాధారణ బౌలింగ్ ప్రదర్శనతో న్యూజిలాండ్ పతనాన్ని శాసించాడు. తొలి టెస్ట్ పరాజయం తర్వాత అనూహ్యంగా జట్టులోకి వచ్చిన వాషింగ్టన్ సుందర్ టీం మేనేజ్మెంట్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాడు. 45 నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టెస్ట్ ఫార్మాట్ లోకి రీఎంట్రీ ఇచ్చిన సుందర్ కెరీర్ లో మొదటిసారి ఐదు వికెట్లతో అద్భుతమైన ఘనతను అందుకున్నాడు.

Secret behind the name Washington Sundar

ఈ ప్రదర్శనతో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. పుణేలోని ఎంసీఏ స్టేడియంలో ఐదు వికెట్ల ఘనతను అందుకున్న తొలి భారత బౌలర్ గా చరిత్రలోకి ఎక్కాడు. మొత్తంగా చూసుకుంటే రెండో బౌలర్ గా వాషింగ్టన్ సుందర్ నిలిచాడు. సుందర్ ( Washington Sundar) కన్నా ముందు ఆస్ట్రేలియా ( Australia ) బౌలర్ స్టీఫెన్ ఓ కీప్…. మైదానంలో ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు.


Also Read: Glasgow Commonwealth Games 2026: కామ‌న్వెల్త్ క్రీడ‌ల్లో ఆ ఆటలు తొలగింపు..ఇండియాకు భారీ నష్టం !

ఈ మైదానంలో సుందర్ దే అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన కావడం గమనార్హం. సుందర్ పేరులో వాషింగ్టన్ అని ఎందుకు ఉంది అనేది చాలామందికి తెలియదు. ఓ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ పట్ల అభిమానంతో తన తండ్రి వాషింగ్టన్ సుందర్ ( Washington Sundar) అని పేరుని పెట్టుకున్నాడు.

Also Read: Washington Sundar: 7 వికెట్లతో దుమ్ములేపిన వాషింగ్టన్ సుందర్..కుప్పకూలిన న్యూజిలాండ్ !

సుందర్ తండ్రి మనీ సుందర్. ఒకప్పుడు రంజి ప్లేయర్ ఇతడు. ఆయన చాలా పేద కుటుంబంలో జన్మించాడు. ఈ క్రమంలో అతనికి క్రీడలు అంటే ఎక్కువ ఇష్టం ఉన్న పీడీ వాషింగ్టన్ అనే రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ మనీ సుందర్ కు ( Mani Sundar ) అతి చిన్న వయసులోనే క్రికెట్ ఆడేందుకు ఆర్థికంగా సహాయాన్ని చేశాడు. విద్యాభ్యాసానికి అతనికి సహకరించాడు. ఆ మాజీ అధికారిపై ప్రేమతో తన కుమారుడికి వాషింగ్టన్ అనే పేరుని చేర్చుకున్నాడు. కాగా, న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ కు అనూహ్యంగా ఎంపికైనటువంటి వాషింగ్టన్ సుందర్ తుది జట్టులోను చోటు దక్కించుకుని అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు.

Also Read: Pakistan vs England: 1350 రోజుల తర్వాత పాకిస్థాన్‌ విజయం..ఇద్దరే 20 వికెట్లు కూల్చారు !

45 నెలల తర్వాత మళ్లీ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న సుందర్ తొలి ఇన్నింగ్స్ లోనే తన స్పిన్ మాయాజాలంతో కివీస్ బ్యాటర్లకు చెమటలు పట్టించాడు. అయితే.. ఈ మ్యాచ్‌ లో 23.1 ఓవర్లు బౌలింగ్ చేసిన వాషింగ్‌ టన్‌ సుందర్ ( Washington Sundar) ఏకంగా ఏడు వికెట్లను పడగొట్టగలిగాడు. అలాగే.. వాషింగ్‌ టన్‌ సుందర్ ( Washington Sundar) తన స్పెల్ లో 59 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు మెయిడిన్లు చేయడం జరిగింది. సుందర్ దెబ్బకు న్యూజిలాండ్ 259 పరుగులకే ఆల్ అవుట్ అయింది. ఈ ఇన్నింగ్స్ లో అతడు ఏకంగా ఐదుగురు బాటర్లను క్లీన్ బౌల్డ్ చేశాడు.

Related News

IND Vs PAK : దుబాయ్ స్టేడియంలో పాకిస్థాన్ ఫ్యాన్ పై దాడి… రంగంలోకి పోలీసులు!

Fakhar Zaman catch : టీమిండియా తొండాట‌…ఐసీసీకి పాకిస్థాన్ ఫిర్యాదు

Abhishek Sharma: అభిషేక్ శ‌ర్మకు గ్రౌండ్ లోనే ప్ర‌పోజ్‌..ఫ్లయింగ్ కిస్సులు ఇచ్చి మ‌రీ !

IND VS PAK: మ‌రోసారి టీమిండియా వ‌ర్సెస్ పాక్ మ్యాచ్‌..చ‌చ్చిన పామును మ‌ళ్లీ చంప‌డ‌మే

AK-47 Celebration: ధోని చేస్తే క‌రెక్ట్‌.. మేం చేస్తే త‌ప్పా…!

Haris Rauf: రఫేల్ కూల్చేశామంటూ హ‌రీస్ ర‌ఫ్ సెలబ్రేషన్..ఆడుకున్న ఫ్యాన్స్‌

Ind Vs Pak: చ‌ల్ పోరా పో….షాహిన్ అఫ్రీదిని బండ బూతులు తిట్టిన అభిషేక్‌…సిక్స్ కొట్టి మ‌రీ

IND VS PAK: అభిషేక్‌ దుమ్ములేపాడు… సూప‌ర్ 4 లోనూ టీమిండియా విజ‌యం.. షేక్ హ్యాండ్ మళ్ళీ లేదు

Big Stories

×