Pongal Movies..తెలుగు బాక్స్ ఆఫీస్ వద్ద సంక్రాంతి పోరు ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా సంక్రాంతి పండుగ కొంతమంది హీరోలకు సెంటిమెంట్ కూడా. అందుకే చాలామంది తమ సినిమాలను సంక్రాంతి బరిలోకి తీసుకురావాలని పోటీ పడుతూ ఉంటారు. అయితే ఈ సంక్రాంతి పోటీని తట్టుకోవాలి అంటే కథ , కంటెంట్ తో పాటు ప్రేక్షకులను మెప్పించే ప్రతి అంశం కూడా సినిమాలో ఉండాలి. అప్పుడే సంక్రాంతి బరిలో నిలబడే అవకాశం ఉంటుంది. లేకపోతే సంక్రాంతి బరిలో పండుగ పూట నిరాశ చవిచూడాల్సి ఉంటుంది.
సంక్రాంతి బరిలో నాలుగు సినిమాలు..
ఇదిలా ఉండగా.. ఇప్పటికే సంక్రాంతి పండుగ సందర్భంగా పలు సినిమాలు తేదీలను ఖరారు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఎవరు వస్తున్నారు అనే విషయం మాత్రం కన్ఫామ్ కాలేదు. అయితే తాము సంక్రాంతికి వస్తున్నాం అంటే.. తాము వస్తున్నామని పోటీగా సినిమాలను రిలీజ్ చేస్తున్నామంటూ ఊదరగొడుతున్నారు కానీ ఇప్పటివరకు ఫైనల్ చేయలేదు. మరోవైపు వచ్చే ఏడాది సంక్రాంతికి తీవ్ర పోటి ఏర్పడింది. ఇప్పటికే ‘గేమ్ ఛేంజర్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’, ‘మజాకా’, ‘డాకు మహారాజ్’ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. గత కొద్ది రోజులుగా ఈ సినిమాల విడుదల తేదీలపై కొంత చర్చ జరిగినా.. నేటితో ఈ సినిమాలో విడుదల లెక్క కాస్త తేలిపోయింది.
సినిమాల డేట్ లాక్..
ముందుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) – శంకర్ (Shankar ) కలయికల వస్తున్న ‘గేమ్ ఛేంజర్ ‘ సినిమా సంక్రాంతికి రాబోతోంది. అందులో ముందుగా జనవరి 10వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇక తర్వాత బాలకృష్ణ (Balakrishna )డైరెక్టర్ బాబి (Director bobby)దర్శకత్వంలో వస్తున్న ‘డాకు మహారాజ్’ (Daku Maharaj) సినిమా జనవరి 12వ తేదీన విడుదల కాబోతోంది. అలాగే వెంకటేష్ (Venkatesh) – అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్లో వస్తున్న ‘సంక్రాంతికి వస్తున్నాం'(Sankranthiki Vasthunnam) సినిమా జనవరి 14వ తేదీన విడుదల కాబోతోంది. ఇకపోతే ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో ‘ఎఫ్2’, ‘ఎఫ్3’ సినిమాలు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు మళ్లీ ఇదే కాంబినేషన్లో సినిమా అనడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అలాగే ఈ సినిమాకు పోటీగా సందీప్ కిషన్(Sandeep Kishan), త్రినాథ్ రావ్ (Thrinath Rao) కాంబినేషన్ లో వస్తున్న ‘మజాకా’ (Mazaka) సినిమా జనవరి 14వ తేదీన విడుదల కాబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఈ సినిమా సంక్రాంతి నుండి తప్పుకోవాలని చూస్తున్నట్లు సమాచారం.
టాక్ ఏది బాగుంటే ఆ సినిమాకే ఎక్కువ థియేటర్స్..
ఇకపోతే ఏ రోజు ఏ సినిమా విడుదల కాబోతోంది అనే లెక్క తేలడంతో థియేటర్స్ కేటాయింపు పై కూడా ఇప్పుడు ఫోకస్ చేయబోతున్నారు డిస్ట్రిబ్యూటర్స్ . మొదట గేమ్ ఛేంజర్ మొదటి రోజు విడుదల కాబోతోంది కాబట్టి థియేటర్స్ ఎక్కువ కేటాయించి ,ఆ తర్వాత బాలయ్య సినిమా ‘డాకు మహారాజ్ ‘రిలీజ్ రోజు థియేటర్లను సమానంగా కేటాయించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఏ సినిమాకైతే టాక్ బాగుటుందో.. ఆ సినిమాకి ఎక్కువ స్క్రీన్స్ ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారట. మొత్తానికైతే అన్ని సినిమాలు కూడా మంచి కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మరి ఏ సినిమా ఏ విధంగా ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి.