BigTV English

Odela 2 – Tamannaah Bhatia: బోనమెత్తిన మిల్కి బ్యూటీ.. 800 మంది ఆర్టిస్టులతో ‘ఓదెల 2’ క్లైమాక్స్ షూటింగ్..!

Odela 2 – Tamannaah Bhatia: బోనమెత్తిన మిల్కి బ్యూటీ.. 800 మంది ఆర్టిస్టులతో ‘ఓదెల 2’ క్లైమాక్స్ షూటింగ్..!

Tamannaah Bhatia – Odela 2: తమన్నా భాటియా.. మిల్కీ బ్యూటీగా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. మూడు పదుల వయసులోనూ గ్లామర్‌లో ఏ మాత్రం తగ్గకుండా మెయింటైన్ చేస్తుంది. వయసుపెరుగుతున్న కొద్దీ ఆమె అందం మరింత ఎక్కువవుతోంది. సినీ ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్ల నుంచి స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్న అత్యంత తక్కువ మంది నటీమణులలో తమన్నా ఒకరు. టాలీవుడ్‌లో సీనియర్, యంగ్ స్టార్ హీరోల సరసన చేసి క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది.


ముఖ్యంగా ఆమె అందం, డ్యాన్స్‌కు ప్రత్యేక ఫ్యాన్స్ ఉన్నారు. అయితే టాలీవుడ్‌లో గత కొంత కాలం నుంచి సినిమా ఆఫర్లు రాకపోవడంతో బాలీవుడ్‌కి చెక్కేసింది. అక్కడ పలు సినిమాలు చేసి గుర్తింపు సంపాదించుకుంది. అక్కడ సినిమాలు చేస్తున్న క్రమంలో బాలీవుడ్ నటుడితో ప్రేమలో పడిపోయింది. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ‌తో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు వార్తలు జోరుగా సాగాయి. ఇప్పటికీ వారిద్దరి గురించి తరచూ వార్తలు వస్తూనే ఉంటాయి.

ఇకపోతే బాలీవుడ్‌లో పలు సినిమాలు చేస్తూ క్రేజ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ మళ్లీ టాలీవుడ్‌లోకి వచ్చింది. ఇందులో భాగంగానే ఓ కొత్త సినిమా చేస్తుంది. తనకు మంచి హిట్లు అందించిన దర్శకుడు సంపత్ నంది డైరెక్షన్‌లో ‘ఓదెల 2’ మూవీ చేస్తుంది. గతంలో వచ్చిన ‘ఓదెల రైల్వేస్టేషన్’ మూవీకి ఇది సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. ఈ సీక్వెల్ మూవీలో తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తుంది. దైవం, భూతం అనే కాన్సెప్టుతో రూపొందుతున్నట్లు తెలుస్తోంది.


Also Read: ‘ఓదెల 2’.. శివ శక్తి అవతారమెత్తిన తమన్నా.. ఇంట్రడ్యూసింగ్ వీడియో రిలీజ్

ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై ఎనలేని అంచనాలు క్రియేట్ చేశాయి. అంతేకాకుడా ఇటీవల తమన్నాకు సమంధించిన ఓ చిన్ని వీడియో కూడా రిలీజ్ చేసి బజ్ పెంచేశారు. ఇక ఇప్పుడు మరో అప్డేట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం హైదరాబాద్ బోనాల సందడి కొనసాగుతుంది. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని మేకర్స్ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. అందులో చీర కట్టుకుని, తమన్నా భాటియా తలపై బోనం మోస్తూ పోస్టర్‌లో కనిపిస్తోంది. ఆమె వెనుక చాలా మందిని గమనించవచ్చు. అయితే యాదృచ్ఛికంగా బోనాల సంబరాలు జరుగుతున్నప్పుడు బోనాల ఎపిసోడ్‌ను మేకర్స్ క్యాన్ చేస్తున్నారు.

దీంతోపాటు ఈ మూవీ షూటింగ్‌కు సంబంధించి మరో న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఈ హై బడ్జెట్ బహుభాషా చిత్రం హైదరాబాద్‌లోని ఆర్‌ఎఫ్‌సిలోని ఓదెల మల్లన్న టెంపుల్ సెట్‌లో క్లైమాక్స్ షూటింగ్‌ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఆలయాన్ని అధిక బడ్జెట్‌తో నిర్మించినట్లు సమాచారం. ఈ షెడ్యూల్‌లో మొత్తం 800 మంది జూనియర్ ఆర్టిస్టులతో పాటు తమన్నా, ఇతర నటీనటులు కూడా షూటింగ్‌లో పాల్గొంటున్నట్లు ఇండస్ట్రీ టాక్. దీని బట్టి చూస్తే సినిమా ఏ రేంజ్‌లో తెరకెక్కుతుందో అర్థం చేసుకోవచ్చు.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×