BigTV English

Odela 2 – Tamannaah: ‘ఓదెల 2’.. శివ శక్తి అవతారమెత్తిన తమన్నా.. ఇంట్రడ్యూసింగ్ వీడియో రిలీజ్

Odela 2 – Tamannaah: ‘ఓదెల 2’.. శివ శక్తి అవతారమెత్తిన తమన్నా.. ఇంట్రడ్యూసింగ్ వీడియో రిలీజ్

Introducing Shiva Shakti – Odela 2: మిల్కీ బ్యూటీ తమన్నా మూడు పదుల వయసులోనూ గ్లామర్‌లో ఏ మాత్రం తగ్గడం లేదు. వయసు పెరుగుతున్న కొద్దీ ఆమె అందం మరింత పెరుగుతుంది. ఇక టాలీవుడ్‌లో స్టార్ హీరోల సరసన హీరోయిన్‌గా నటించి ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ముఖ్యంగా ఆమె అందం, యాక్టింగ్, డ్యాన్స్‌కు ప్రేక్షకులు ఫిదా కావాల్సిందే. అయితే టాలీవుడ్‌లో గత కొంత కాలం నుంచి సినిమా ఆఫర్లు కరువయ్యాయి. దీంతో బాలీవుడ్‌కి మకాం మార్చింది.


ఇక అక్కడ ఒకటి రెండు సినిమాలు హిట్ అయి మంచి పేరు సంపాదించుకుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో పడింది. ప్రస్తుతం ఈ జంట పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నారు. ఇక తమన్నా ఇప్పుడు బాలీవుడ్ నుంచి తిరిగి టాలీవుడ్‌కి రీ ఎంట్రీ ఇస్తుంది.

ఇందులో భాగంగానే ఇప్పుడు తనకు ఇదివరకు మంచి హిట్లు అందించిన డైరెక్టర్ సంపత్ నందితో ఓ మూవీ చేస్తుంది. ఆ మూవీ పేరే ‘ఓదెల 2’. దర్శకుడు సంపత్ నంది కరోనా టైంలో కొత్తగా ఆలోచించి డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ‘ఓదెల రైల్వేస్టేషన్’ పేరుతో ఓ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేశాడు. ఆ సమయంలో ఈ మూవీకి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది.


Also Read: క్రేజీ కాంబో.. తమన్నాతో సంపత్ నంది.. ఆ బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్

ఇందులో హెబ్బాపటేల్ ప్రధాన పాత్రలో నటించి అదరగొట్టేసింది. ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్‌ను దర్శకుడు సంపత్ నంది ‘ఓదెల 2’ పేరుతో తీసుకొచ్చాడు. ఈ మూవీ ఇటీవలే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సీక్వెల్‌లో తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఈ మూవీ దైవం, భూతం అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ సినీ ప్రియుల్లో ఆసక్తిని రేకెత్తించాయి. అయితే తాజాగా మరొక అప్డేట్‌ను మేకర్స్ అందించారు. ఇందులో భాగంగా ఇంట్రడ్యూసింగ్ శివ శక్తి అంటూ తమన్నా లుక్‌తో ఉన్న వీడియోను రిలీజ్ చేశారు. అందులో ముందుగా దేవుని సూక్తితో ఓ సాంగ్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఫుల్ మాస్ బీట్‌తో సినిమా షూటింగ్ సెట్స్‌లో తమన్నా కాస్ట్యూమ్‌ను చూపించారు.

ఆ తర్వాత శివ శక్తి పాత్రలో ఉన్న తమన్నా లుక్‌ను చూపిస్తూ సినిమాపై అంచనాలను పెంచేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఇంట్రడ్యూసింగ్ వీడియో ట్రెండింగ్ అవుతుంది. ఈ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×