E-Paper
Advertisement

Tamannaah : ఆ హీరోతో ప్రేమలో..! మిల్కీబ్యూటీ క్లారిటీ..

Tamannaah : ఆ హీరోతో ప్రేమలో..! మిల్కీబ్యూటీ క్లారిటీ..
Advertisement

Tamannaah: మిల్కీ బ్యూటీ తమన్నా ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్. ఇప్పటికీ ఆమె అందం తగ్గలేదు.. ఫ్యాన్స్ కు క్రేజ్ తగ్గలేదు. గ్లామర్ తోనే కాదు డ్యాన్స్‌లతోనూ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ప్రస్తుతం సౌత్ తోపాటు బాలీవుడ్ లో సినిమాలు చేస్తోంది. మరోవైపు వెబ్‌ సిరీస్‌లతో బిజీగా ఉంది. ఈ బొద్దుగుమ్మపై ఓ వార్త వైరల్ గా మారింది.

Advertisement

బాలీవుడ్ హీరో విజయ్ వర్మతో తమ్మూ రిలేషన్ లో ఉందని చాలాకాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయంపై తాజాగా తమన్నా క్లారిటీ ఇచ్చేసింది. విజయ్‌ వర్మ తనపై ఎంతో శ్రద్ధ చూపుతాడని పేర్కొంది. అతడితో ఉంటే సంతోషంగా ఉంటానని తెలిపింది. కేవలం సహనటుడని మాత్రమే కాదని అతనితో మంచి బంధం ఉందని స్పష్టం చేసింది.

తాను ఇప్పటి వరకు ఎంతోమంది హీరోలతో కలిసి నటించానని కానీ వాళ్లందరి కంటే విజయ్‌ ప్రత్యేకమైన వ్యక్తిగా తమన్నా పేర్కొంది. తనకు కష్టం వస్తే అతడు నాతోనే ఉంటాడనే నమ్మకం ఉందని తెలిపింది. సినీరంగంలో ఎదుగుతుంటే కిందకు లాగడానికి చాలామంది ప్రయత్నిస్తుంటారని అలాంటి వాళ్లనుంచి తనను విజయ్ రక్షిస్తాడని విశ్వాసం వ్యక్తం చేసింది.

Advertisement

తాను సృష్టించికున్న అందమైన ప్రపంచంలోకి విజయ్‌ వర్మ వచ్చాడని మిల్కీబ్యూటీ చెప్పింది. తమ మధ్య మంచి ఆర్గానిక్‌ బంధం ఉందిని వివరించింది. లస్ట్‌ స్టోరీస్‌-2 సెట్స్‌లోనే బంధం మొదలైనట్లు తెలిపింది. ఈ లవ్ బర్డ్స్ కు సోషల్ మీడియా నెటిజన్స్ కంగ్రాట్స్ చెబుతున్నారు.ఇక పెళ్లెప్పుడు అని కామెంట్లు పెడుతున్నారు. తమన్నా త్వరలోనే హైదరాబాదీ కోడలు కాబోతోందని అంటున్నారు. తమన్నా, విజయ్ వర్మ కలిసి నటించిన లస్ట్‌ స్టోరీస్-2 జూన్‌ 29 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్ కానుంది.

ఈ ఏడాది న్యూయర్ సమయంలో గోవాలో జరిగిన పార్టీలో ఈ జంట ముద్దు పెట్టుకుంటూ దిగిన ఫొటో అప్పట్లో వైరల్ గా మారింది. ఇద్దరి మధ్య ఏదో ఉందని టాక్ వచ్చింది. ఆ తర్వాత ఇండస్ట్రీలో జరిగిన చాలా ఈవెంట్స్ ఇద్దరు కలిసే కనిపించారు.దీంతో ఈ జంట ప్రేమలో ఉందని వార్తలు వచ్చాయి. తమన్నా ఇచ్చిన క్లారిటీతో డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోయాయి. మరి పెళ్లెప్పుడు..?

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×