E-Paper
Advertisement

Delhi Ganesh : సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు ఢిల్లీ గణేష్ ఇక లేరు..

Delhi Ganesh : సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు ఢిల్లీ గణేష్ ఇక లేరు..
Advertisement

Delhi Ganesh : సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య ఒకరి తర్వాత మరొకరు అనారోగ్య సమస్యలతో చనిపోతున్నారు. ఈ నెలలో చాలా మంది మరణించారు. ఇప్పుడు మరో నటుడు మరణించారు. ప్రముఖ సీనియర్ నటుడు ఢిల్లీ గణేష్ కన్ను మూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య, అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆయన ఆదివారం అర్ధరాత్రి తన ఇంట్లోనే తుది శ్వాస విడిచారు. ఈయన సుమారు 400 కు పైగా సినిమాల్లో నటించి మెప్పించారు ఢిల్లీ గణేష్.. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.

ఢిల్లీ గణేష్ ఇండస్ట్రీలో స్టార్స్ గా కొనసాగుతున్న అందరి హీరోలతో కలిసి పనిచేసారు. వయసు పైబడటంతో అనేక రకాల అనారోగ్య సమస్యలు ఆయనను తరచుబాధించేవి.. ఇకపోతే గత కొద్ది రోజులుగా ఆయన అనారోగ్య సమస్యలకు చికిత్స తీసుకుంటున్నారు. ఇక గత రెండు రోజులుగా ఆయన ఆరోగ్యం సరిగ్గా లేక పోవడంతో ఆయన నిన్న అర్ధ రాత్రి కన్నుమూశారు. ఆయన మరణ వార్త విన్న తమిళ ఇండస్ట్రీలోకి ప్రముఖులు గణేష్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నారు.

Advertisement

ఆయన మరణవార్త విన్న ప్రముఖులు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు. ఇక నెటిజన్లు ఢిల్లీ గణేష్ మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నారు.. ఈయన భౌతిక కాయాన్ని తన సొంత నివాసంలోనే ఉంచారు. సినీ ప్రముఖులు, ప్రజల సందర్శనార్థం ఢిల్లీ గణేష్ భౌతిక కాయాన్ని ఇంట్లోనే ఉంచారు. సోమవారం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో సుమారు 400 కు పైగా సినిమాల్లో నటించారు. ఈయన విలన్ గా చేసిన పాత్రల కన్నా కమెడియన్ గా చేసిన పాత్రలే మంచి గుర్తింపును తెచ్చాయి. చివరి రోజుల వరకు ఆయన నటనకే జీవితాన్ని అంకితం చేశారు. ఇలాంటి లెజెండరి యాక్టర్ మళ్లీ పుట్టరు.. మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాము..

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×