Sajjala Bhargava Reddy: వైసీపీ సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్ సజ్జల భార్గవ్‌రెడ్డికి కష్టాలు రెట్టింపు అయ్యాయా? ఆయన కోసం పోలీసులు వేట మొదలుపెట్టారా? లేటెస్ట్‌గా పులివెందులలో ఆయనపై నమోదైన కేసు ఏంటి? సజ్జల వ్యవహారంపై పార్టీలో జరుగు తున్న చర్చ ఏంటి? ఇలా రకరకాల ప్రశ్నలు పార్టీ నేతలు, అభిమానులు తలోవిధంగా చర్చించుకుంటున్నారు.
వైసీపీ బలం, బలహీనత సోషల్ మీడియా. అది లేకుంటే ఫ్యాన్ పార్టీ మనుగడ ఉండదన్నది కొందరి నేతల మాట. రీసెంట్‌గా జరుగుతున్న పరిణామాలే ఇందుకు ఉదాహరణ. కొద్దిరోజులుగా ఏపీలో సోషల్ సైకోలు రెచ్చిపోతున్నారు. ఏ ఒక్కర్నీ వదల్లేదు.
చివరకు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, హోంమంత్రి కుటుంబసభ్యులపై వల్గర్ పోస్టులు పెడుతున్నారు. దీనిపై ఇంటా బయటా దుమారం రేగడంతో కూటమి సర్కార్ అటువైపు ఫోకస్ చేసింది. సోషల్ సైకోలు రెచ్చిపోవడం వెనుక సజ్జల భార్గవ్‌రెడ్డి ఉన్నాడన్నది పోలీసుల అనుమానం. దీనిపై కూపీ లాగుతున్నారు.
లేటెస్ట్‌గా కడప జిల్లా పులివెందులలో సజ్జల భార్గవ్‌రెడ్డిపై ఎస్టీ-ఎస్సీ కేసు నమోదు అయ్యింది. సింహాద్రిపురం మండలానికి చెందిన హరి అనే దళిత వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనను కులం పేరుతో దూషించారంటూ బాధితుడు అందులో ప్రస్తావించాడు.
ALSO READ: వాళ్లంతా ప్రశ్నించే వాళ్లు.. అరెస్టులతో అడ్డుకోలేవు గుర్తుపెట్టుకో..
వర్రా రవీంద్రారెడ్డి, సజ్జల భార్గవ్‌రెడ్డి, అర్జున్ రెడ్డిల పేర్లను ప్రస్తావించాడు. బాధితుడి ఫిర్యాదుతో ఆ ముగ్గురిపై పులివెందుల పోలీసుస్టేషన్‌లో ఎస్టీ-ఎస్సీ కేసు నమోదు అయ్యింది. నాన్ బెయలబుల్ సెక్షన్ల కిందట కేసు రిజిస్టర్ చేశారు. దీంతో వీరిని ఎప్పుడైనా అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్దమయ్యారు.
మరోవైపు భార్గవ్‌రెడ్డి వ్యవహారంపై ఫ్యాన్ పార్టీలో చిన్నపాటి చర్చ మొదలైపోయింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వల్గర్ కామెంట్స్, పోస్టుల పెట్టడం వల్లే ప్రజలు తమను దూరంగా పెట్టారన్న గుసగుసలు ఆ పార్టీ వినబడుతున్నాయి. ముఖ్యనేతలు ఈ విషయాన్ని ఇప్పటికైనా తెలుసుకునే బెటరని అంటున్నారు. వీటి వల్ల పార్టీకి ఊహించని డ్యామేజ్ జరుగుతుందని అంటున్నారు.