Big Stories

Rohit Sharma Stunning Catch: రోహిత్ శర్మ సూపర్ క్యాచ్.. పోప్ కథ ఇలా ముగిసింది!

Rohit Sharma Stunning Catch in Ind Vs Eng 2nd Test: విశాఖపట్నంలో జరుగుతున్న 2వ టెస్టులో ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ స్లిప్ లో అద్భుతమైన క్యాచ్ పట్టాడు. ఈ క్యాచ్‌తో తొలి టెస్ట్ హీరో ఓలీ పోప్ ను పెవిలియన్ కు పంపాడు. అశ్విన్ స్టంప్‌ కు చాలా దగ్గరగా వేసిన బంతిని పోప్ అటాకింగ్ ఆడే ప్రయత్నం చేశాడు. షాట్‌ను కట్ చేయాలనుకున్నాడు. కానీ ఆ బంతి బ్యాట్ ఎడ్జ్ తగిలి స్లిప్ లోకి వేగంగా వెళ్లింది. బంతి వేగంగా భుజం ఎత్తులో రోహిత్ ఎడమ వైపుకు వెళ్లింది. హిట్‌ మ్యాన్ ఆ బంతిని అంతే వేగంతో పట్టేశాడు. దీంతో అశ్విన్ ఆనందానికి అవధులు లేవు.

- Advertisement -

రోహిత్ ఈ క్యాచ్ పట్టుకునేందుకు సెకను లోపే సమయం ఉందని కామెంటేటర్ దినేష్ కార్తీక్ వెల్లడించాడు. కేవలం 0.45 సెకన్లలో బంతి రోహిత్‌ అందుకున్నాడని తెలిపాడు.
రోహిత్‌ను ప్రపంచంలోని అత్యుత్తమ స్లిప్ ఫీల్డర్లలో ఒకడిగా పేర్కొనవచ్చని అన్నాడు.

- Advertisement -

ఇంగ్లాండ్ 4వ రోజు ఉదయం బాజ్‌బాల్‌ వ్యూహంలో ఆడే ప్రయత్నం చేసింది. ఆ జట్టు బ్యాటర్‌లో కొందరు ఓవర్-ఎటాకింగ్ మోడ్‌లోకి వెళ్లి తమ వికెట్లను కోల్పోయారు. ఓపెనర్ జాక్ క్రాలే ఒక్కడే అర్థసెంచరీతో రాణించాడు. అతను తన బలమైన ఫ్రంట్ ఫుట్ గేమ్ ద్వారా స్పిన్నర్లపై దాడి చేశాడు.ఈ ఆటతీరుతోనే పరుగులు రాబట్టాడు. బౌండరీలు బాదాడు. అతడు అవుట్ తర్వాత ఇంగ్లాండ్ బ్యాటర్లు ఎవరూ పెద్దగా పోరాటం చేయలేకపోతున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News