BigTV English

Teja Sajja: రణవీర్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్న తేజ.. పోస్ట్ వైరల్..!

Teja Sajja: రణవీర్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్న తేజ.. పోస్ట్ వైరల్..!

Teja Sajja.. ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలుపెట్టి ఆ తరువాత హీరోగా మారి ప్రేక్షకులను అలరిస్తున్నారు తేజ సజ్జ (Teja Sajja). సమంత (Samantha)లేడీ ఓరియంటెడ్ గా వచ్చిన చిత్రం ఓ బేబీ (Oh baby). ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీకి నటుడిగా పరిచయమైన తేజ సజ్జ, ఆ తర్వాత ‘జాంబిరెడ్డి’ సినిమాలో కూడా నటించి ఆకట్టుకున్నారు. ఈ సినిమా తర్వాత ఏకంగా పాన్ ఇండియా సినిమా చేసి పాన్ ఇండియా స్టార్ అయిపోయారు తేజ సజ్జ. ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ(Prashanth Varma) డైరెక్షన్లో ‘హనుమాన్’ అనే సినిమా చేసి, ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu)సినిమాకే పోటీగా నిలిచారు. ఇకపోతే చిన్న సినిమాగా వచ్చి రూ.100 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసి రికార్డు సృష్టించింది ఈ సినిమా.


తేజసజ్జపై రన్వీర్ సింగ్ ప్రశంసలు..

ఈ సినిమాలో తేజ నటనపై పలువురు విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. అలాగే బాలీవుడ్ హీరో రన్వీర్ సింగ్ (Ranveer Singh)కూడా ప్రశంసలు కురిపించడం ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే ఎంతోమంది తనను ప్రశంసించినా.. తనకు మాత్రం రన్వీర్ సింగ్ ప్రశంస చాలా ప్రత్యేకమైనదని తెలిపారు తేజసజ్జ. అంతే కాదు తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్ ద్వారా ఒక సుదీర్ఘ పోస్ట్ కూడా పంచుకున్నారు. మరి అందులో ఏముందో ఇప్పుడు చూద్దాం.


ఆ ప్రశంస హృదయంలో నుంచి వచ్చింది..

తేజ సజ్జ తన పోస్టులో.. “2024 సంవత్సరం చివరికి వచ్చింది. ఈ ఏడాది నేను అందుకున్న గొప్ప ప్రశంస గురించి చెప్పమని చాలామంది నన్ను అడిగారు. అందులో నిజాయితీగా చెప్పాలి అంటే రన్వీర్ సింగ్ ప్రశంస నన్ను ఒక్కసారిగా కదిలించింది. అది ఎంతో వ్యక్తిగతంగా అనిపించింది. అందుకే ఇన్ని రోజులు ఎవరికి చెప్పకుండా మనసులోనే దాచుకున్నాను. హనుమాన్ సినిమాలో ఆయన నా వర్క్ గురించి మాట్లాడిన విధానం నన్ను మరింతగా ఆకట్టుకుంది. నాపై ఎంతో ప్రేమ చూపించారు. చిన్న విషయాలను కూడా ఆయన గమనించి ప్రోత్సహించారు అంటే ఆయన నాపై ఎలాంటి దృష్టి పెట్టారో అర్థం చేసుకోవచ్చు. అందుకే అది కేవలం ప్రశంస మాత్రమే కాదు.. స్వచ్ఛమైన ప్రోత్సాహం కూడా.. ఆయన చెప్పిన ప్రతి మాట కూడా ఆయన హృదయం నుంచి వచ్చినదే.. ఇక ఈ ఏడాది నేను అందుకున్న గొప్ప ప్రశంస అదే” అంటూ తేజా సజ్జ తన ఎక్స్ లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం తన కెరీర్ ను మరింత ప్రత్యేకం చేసినందుకు రన్వీర్ కి కూడా ధన్యవాదాలు తెలిపారు తేజ సజ్జ.

తేజ సజ్జ సినిమాలు..

ప్రస్తుతం తేజ ‘మిరాయ్’ లో నటిస్తున్నారు. దీని గురించి ఆయన మాట్లాడుతూ.. “మిరాయ్ కోసం ఎంతో కష్టపడుతున్నాము. వినూత్నమైన కంటెంట్ తో ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ గా సిద్ధం చేస్తున్నాము. తప్పకుండా ఈ సినిమా చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతారు” అంటూ తేజ తెలిపారు. ప్రస్తుతం తేజ చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×