BigTV English

Putin Daughter Paris: పారిస్‌లో పుతిన్ రహస్య కూతురు.. ఆమె తల్లి చాలా పవర్‌ఫుల్!

Putin Daughter Paris: పారిస్‌లో పుతిన్ రహస్య కూతురు.. ఆమె తల్లి చాలా పవర్‌ఫుల్!

Putin Daughter Paris| రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అక్రమం సంతానం, ఆయన కూతురు లుయిజా రుజోవా ఫ్రాన్స్ దేశంలోని పారిస్ నగరంలో జీవిస్తోందని బిబిసి మీడియా కథనం ప్రచురించింది. 21 ఏళ్ల లుయిజా రుజోవా తన వాస్తవిక గుర్తింపుని దాచి రహస్యంగా జీవిస్తోందని బిబిసికి చెందిన ఆండ్రే జఖారోవ్ కనుగొన్నారు.


సాధారణంగా రష్యా రాజకీయా నాయకుల కుమార్తెలు తమ పేరు చివర వ్లాదిమిరోవ్నా అని పేరు పెట్టుకుంటారు. కానీ లయిజా రుజోవా మాత్రం అలా చేయలేదు. పైగా ఆమెకు ఎలిజవేటా ఒలెగోవ్నా రుడ్నోవా అనే మరో పేరు కూడా ఉంది. ఒలెగోవ్నా అనే పదానికి ఒలెగ్ కుమార్తె అని అర్థం. రష్యాలో ఇంతకుముందు ఒలెగ్ రుడ్నోవ్ అనే రాజకుటుంబానికి చెందిన వ్యక్తి ఉండేవాడు. అతనికి పుతిన్‌తో చాలా సన్నిహిత సంబంధాలుండేవి. పుతిన్ కోసం ఒలెగ్ రుడ్నోవ్ ఒకప్పుడు లగ్జరీ రియల్ ఎస్టేట్ డీల్స్ కుదిర్చే వాడు. అయితే ఆయన 2015లో మరణించాడు. రుడ్నోవ్ అని ఇంటిపేరు పెట్టుకోవడంతో రుజోవా తన గుర్తింపుని బహిర్గతం కాకుండా జాగ్రత్త పడుతోందని మీడియా తెలిపింది.

Also Read:  3 నెలల్లో 35 లక్షలు సంపాదించిన పెళ్లికూతరు.. ఏజెన్సీతో కలిసి మోసం చేయడమే పని


రుజోవా తల్లి చాలా పవర్‌ఫుల్. ఆమె పేరు స్వెత్లానా క్రివోనోగిఖ్. ఒకప్పుడు పారిశుధ్య కార్మికురాలిగా పనిచేసిన స్వెత్లానా ఇప్పుడు వందల కోట్ల ఆస్తికి యజమాని. ఆమె ప్రస్తుతం యూరోప్ దేశాలైన మొనాకో, ఫిన్ ల్యాండ్ లలో నివసిస్తోంది. బ్రిటన్ వార్తా సంస్థ ది టెలీగ్రాఫ్ ప్రకారం.. స్వెత్లానా ఆస్తి విలువ 83 మిలియన్ పౌండ్లు (భారత కరెన్సీ లో దాదాపు రూ.900 కోట్లు).

రుజోవా తల్లి స్వెత్లానా ఆస్తుల గురించి పండోరా పేపర్స్ లీక్ లో వివరాలున్నాయి. మొనాకోలోని మాంటే కార్లో నగరంలో స్వెత్లానాకు విలువైన ఆస్తులు, ఒక పెద్ద భవనం, సముద్రం విలాసవంతమైన యాచ్ట్(నౌక). ఉన్నాయి. మొనాకోలోని బ్యాంక్ రోసియాలో బోర్డ్ సభ్యురాలు. ఈ బ్యాంకులో రష్యాకు చెందిన బడా వ్యాపారులు, రాజకీయ నాయకుల అకౌంట్లున్నాయి. వీటితోపాటు ఫిన్లాండ్ దేశంలో ఒక స్కీ రిసార్ట్‌కు ఆమె యజమాని. అన్నింటి కంటే ముఖ్యమైనది, ఆమె నేషనల్ మీడియా గ్రూప్ లో డైరెక్టర్. ఈ మీడియా గ్రూప్‌నకు రష్యాకు అనుకూలమైన వార్త సంస్థలున్నాయి.

2000 సంవత్సరంలో పుతిన్ రష్యా అధ్యక్ష పదవి చేపట్టిన తరువాత స్వెత్లానా ఆస్తులు భారీగా పెరిగాయని మీడియా రిపోర్ట్. ఇదంతా ఆమె పుతిన్ ప్రియురాలు కావడం వల్లే సాధ్యమైందని ప్రచారంలో ఉంది. రష్యాకు చెందిన ప్రొయెక్ట్ అనే స్వతంత్ర వార్తా సంస్థ స్వెత్లానా, పుతిన్ సంబంధం గురించి తొలిసారి బయటపెట్టింది. పుతిన్ సెయింట్ పీటర్స్ బర్గ్ నగరానికి మేయర్‌గా ఉన్న సమయంలోనే వీరిద్దరూ ప్రేమించుకున్నారని ప్రొయెక్ట్ తన కథనంలో ప్రచురించింది. అప్పటికే పుతిన్ కు భార్యగా లియుడ్మిలా ష్క్రెబ్నేవా ఉంది. పుతిన్‌కు తన భా్య లియుడ్మిలాతో ఇద్దరు కూతుర్లు కూడా ఉన్నారు.

ఇప్పుడు పారిస్ నగరంలో ఉన్న రుజోవా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేది. ఆమెకు డాన్స్ చేయడమంటే చాలా ఇష్టం. అయితే 2022లో ఉక్రెయిన్ యుద్ధం తరువాత రుజోవాకు ఎక్కువ మంది అవమానకరంగా ట్వీట్లు చేయడం, ఉక్రెయిన్ జెండా చూపిస్తూ ఆమెను ట్రోల్ చేయడం వల్ల చేసేవారు. ఆమె తన ప్రాణాలు కాపాడుకోవడానికి ఒక బంకర్ లో దాగి జీవిస్తోందని వీడియోలు పెట్టేవారు. ఈ వేధింపుల కారణంగా రుజోవా తన సోషల్ మీడియా అకౌంట్స్ అన్నీ డెలీట్ చేసింది.

రుజోవా నిజంగా పుతిన్ కూతురేనా? అని తెలుసుకోవాడానికి ఆమె బర్త్ సర్టిఫికేట్ చూస్తే.. అందులో ఆమె ఇంటిపేరు వ్లాదిమిరోవ్నా అని ఉంది. ఆమె ముఖ కవళికులు కూడా పుతిన్ తో పోలి ఉండడంతో ఆమెను ఒక విలేకరి తన తండ్రి పేరు చెప్పమని అడిగాడు. తాను పుతిన్ కూతురే కదా? అని ప్రశ్నించాడు. కానీ రుజోవా అదంతా అబద్ధమని చెప్పింది. ఇవన్నీ తప్పుడు ప్రచారాలన్ని తోసిపుచ్చింది. ఇటీవల బిబిసి జర్నలిస్ట్ ఆండ్రే జఖరోవ్ ఆమెను ఇంటర్వూ చేశాడు. ఆ ఇంటర్‌వ్యూలో రుజోవా మాట్లాడుతూ.. తన గురించి వార్తల్లో కథనాలు చూశానని.. అవి ఆసక్తికరంగా ఉన్నాయని, కానీ అవన్నీ నిజం కాదని చెప్పింది.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×