BigTV English

Balayya :  బాలయ్య ఇలాంటి పనిచేస్తాడని అనుకోలేదు.. షాక్ అవుతున్న ఫ్యాన్స్..?

Balayya :  బాలయ్య ఇలాంటి పనిచేస్తాడని అనుకోలేదు.. షాక్ అవుతున్న ఫ్యాన్స్..?

Balayya : నందమూరి నట సింహం బాలయ్య గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక ఆయన సినిమాల సంగతి తెలిసిందే. అదిరిపోయే యాక్షన్ తో పాటుగా భారీ డైలాగులు ఉంటాయి. మాస్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా సినిమాలు చేస్తున్నాడు.. గతంలో కన్నా ఎక్కువ మాస్ సినిమాలను చేస్తున్నారు. ఇప్పటికి కూడా హీరోగా సినిమాలు చేస్తూ కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నాడు. ఈయన ఇప్పటివరకు ఒక్క రీమేక్ మూవీ కూడా చెయ్యలేదని అందరు అనుకున్నారు. కానీ ఈ హీరో కూడా రీమేక్ మూవీ చేశాడు.. ఒక్కటి కాదు చాలా సినిమాలు చేశాడని ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. బాలయ్య చేసిన రీమేక్ మూవీస్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం..


ఒకప్పుడు టాలీవుడ్ కే పరిమితమైన తెలుగు హీరోలు ఇప్పుడు పర భాషల్లోకి కూడా అడుగుపెట్టి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అలాగే ఒక భాషలో హిట్ అయిన సినిమాలను మరో భాషలోకి రీమేక్ చేయడం సాధారణ విషయం అయ్యింది.. సినిమాలకు భాషతో పని లేదని ఈ మధ్య హీరోలు రీమేక్ ల బాట పట్టారు. రీమేక్ గా వచ్చిన సినిమాల తో హిట్ కొడుతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఇదే ట్రెండ్ నడుస్తుంది. ఇతర భాషల్లో హిట్ అయితే ఇక్కడ కూడా హిట్ అవుతుందనే భావనలో ఉన్నారు. ఓ సినిమాని రీమేక్ చేస్తున్నారు అంటే అది యాజ్- ఇట్- ఈజ్ గా చేయకుండా మన నేటివిటీకి దగ్గరగా ఉండేలా జాగ్రత్త పడుతున్నారు.. బాలయ్య కూడా వేరే సినిమాలను తెలుగులో రీమేక్ చేశాడు.. ఆయన ఏ భాషలో సినిమాను రీమేక్ చేసాడో చూద్దాం..

హాలీవుడ్ లో తెరకెక్కిన టోటల్ రీకాల్ సినిమా తెలుగు లో బాలయ్య హీరోగా లయన్ గా తెరకెక్కింది. తమిళ హీరో కమల్ హాసన్ హీరోగా వచ్చిన భారతీయుడు సినిమాను ఒక్కమగాడుగా, హాలీవుడ్ సినిమా బౌర్నె ఐడెంటిటి, ది లాంగ్ కిస్ గుడ్ నైట్ సినిమాలను తీసుకుని విజయేంద్ర వర్మగా రూపొందించారు.. అలాగే తమిళ మూవీ సామిని ఈయన లక్ష్మి నరసింహ మూవీగా రిమేక్ చేశారు. అలాగే కన్నడ లో వచ్చిన రాజనర్సింహ సినిమాను పలనాటి బ్రహ్మనాయుడుగా తెలుగులో రీమేక్ చేశారు. తమిళంలో సూపర్ హిట్ అయిన ఎన్ తంగాచ్చి పడిచావా సినిమాను తెలుగులో ముద్దుల మావయ్య గా చేశారు. అదే విధంగా తంగమన రాసా సినిమాను తెలుగులో ముద్దుల మేనల్లుడిగా రీమేక్ చేశారు. ఎన్టీఆర్ నటించిన సత్యహరిచంద్ర, శకుంతల సినిమాలను తీసుకుని బ్రహ్మర్షి విశ్వాసమిత్ర అనే మూవీని రూపొందించారు. అప్పటిలో బాలయ్య హ్యాట్రిక్ విజయాల ను అందుకున్న ఈ మూవీస్ రీమేక్ సినిమాలు. ఇప్పుడు రీమేక్ సినిమాలు చెయ్యలేదు. ప్రస్తుతం డాకు మహారాజ్, అఖండ 2 సినిమాల ను చేస్తున్నాడు. ఈ సంక్రాంతికి డాకు మహారాజ్ మూవీ రిలీజ్ కాబోతుంది.. ఈ మూవీ ప్రమోషన్స్ లో బాలయ్య బిజీగా ఉన్నాడు. రీసెంట్ గా వచ్చిన దబిడి దిబిడే సాంగ్ విమర్శలను అందుకుంటుంది.


Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×