OTT Movie : సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమాలు మూవీ లవర్స్ ని ఒక రేంజ్ లో ఎంటర్టైన్ చేస్తాయి. రీసెంట్ గా థియేటర్లలో ఒక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఈ మూవీలో ప్రతి సన్నివేశం ఎంగేజింగ్ గా ఉంటుంది. మొదటినుంచి చివరి వరకు ప్రేక్షకులు ఈ మూవీని చూస్తూ బాగా థ్రిల్ అవుతారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు మూడు వేల కోట్లకు పైగా వసూలు చేసిన ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ, ప్రస్తుతం ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ పేరేమిటి? ఎందులో? స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
డిస్నీ + హాట్స్టార్ (Disney +hotstar) లో
ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ పేరు ‘ఏలియన్ రోములస్’ (Alien rumulas). ఈ మూవీ ఫ్యూచర్లో జరుగుతూ ఉంటుంది. కొంతమంది మనుషులు ఒక గ్రహం నుంచి మరొక గ్రహానికి వెళ్లే క్రమంలో, ఏలియన్స్ దాడి చేయడంతో స్టోరీ నడుస్తూ ఉంటుంది. 2024లో విడుదలైన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీకి ఫెడే అల్వారెజ్ దర్శకత్వం వహించారు. ఏలియన్ రోములస్ ఆగష్టు 12, 2024న లాస్ ఏంజిల్స్‌లో ప్రదర్శించబడింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా $350 మిలియన్లు వసూలు చేసి సానుకూల ప్రశంసలు అందుకుంది. ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ డిస్నీ + హాట్స్టార్ (Disney +hotstar) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
హీరోయిన్ ఒక స్పేస్ షిప్ లో వర్క్ చేస్తూ ఉంటుంది. అక్కడినుంచి వేరే గ్రహానికి వెళ్లి హ్యాపీగా బ్రతకాలనుకుంటుంది. అయితే అక్కడ ఉన్న వాళ్ళు ఆమెకు పర్మిషన్ ఇవ్వరు. హీరోయిన్ దగ్గర ఒక రోబో కూడా ఉంటుంది. దానిని ఆమెకు సెక్యూరిటీగా తన తండ్రి చేసి పెట్టి ఉంటాడు. రోబోతో హీరోయిన్ ఫ్రెండ్ లాగా ట్రీట్ చేస్తుంది. అక్కడ నుంచి వెళ్లడానికి పర్మిషన్ రాకపోవడంతో ఫ్రెండ్స్ తో మీటింగ్ పెడుతుంది హీరోయిన్. వాళ్లంతా కలిసి ఒక ఉపాయం ఆలోచిస్తారు. పాడుబడ్డ ఒక స్పేస్ షిప్ లో ఉన్న ఇంధనం తో వేరొక గ్రహానికి వెళ్ళొచ్చని అనుకుంటారు. ఈ క్రమంలో వీళ్ళందరూ పాడుబడ్డ స్పేస్ షిప్ లోకి వెళ్తారు. అక్కడ హీరోయిన్ తో ఉన్న రోబో, వీళ్లందరికీ చాలా సహాయం చేస్తుంది. అందులో ఒక మనిషి శవం వీళ్ళకు కనిపిస్తుంది.
అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలని ఆ బాడి మెమరీని రోబోలోకి పంపిస్తారు. రోబో రీబూట్ అవుతుండగా అక్కడ ఏలియన్స్ వీళ్ళందర్నీ అటాక్ చేస్తాయి. ఒక అమ్మాయి మొహానికి ఏలియన్ అతుక్కుపోతుంది. ఆ ఏలియన్ డిఎన్ఏ ఆమె గర్భంలోకి వెళుతుంది. కాసేపటికి ఆమె నుంచి ఒక ఏలియన్ పుట్టుకొస్తుంది. అది చాలా భయంకరంగా ఉంటుంది. రోబో కూడా చిప్ పెట్టగానే వింతగా ప్రవర్తిస్తుంది. చివరికి వీళ్లంతా ఆ స్పేస్ షిప్ నుంచి తప్పించుకుంటారా? ఏలియన్ వీళ్ళందర్నీ చంపేస్తుందా? రోబో వీళ్లకు చివరికి ఏ సహాయం చేస్తుంది? వీళ్లంతా వేరే గ్రహానికి వెళ్తారా? ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఈ సైన్స్ ఫిక్షన్ మూవీని చూడాల్సిందే.