E-Paper
Advertisement

Rajinikanth’s Coolie Teaser Out Now: తలైవర్ 171 టైటిల్ టీజర్ వచ్చేసింది.. రజినీ మాస్ అవతార్.. కాదు.. కాదు.. ఊర మాస్!!

Rajinikanth’s Coolie Teaser Out Now: తలైవర్ 171 టైటిల్ టీజర్ వచ్చేసింది.. రజినీ మాస్ అవతార్.. కాదు.. కాదు.. ఊర మాస్!!
Advertisement

Lokesh Kanagaraj – Rajinikanth’s Movie Coolie Teaser Released: సూపర్ స్టార్ రజినీకాంత్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ప్రస్తుతం రజినీ.. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. తలైవర్ 171 గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది. ఇక ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమా టైటిల్ కు సంబంధించిన అప్డేట్ మేకర్స్ నేడు రివీల్ చేస్తామని ముందు నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తలైవర్ 171 టైటిల్ తంగం అని సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తూ వస్తున్నాయి. అయితే ఆ పుకార్లలో నిజం లేదని మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు.

కొద్దిసేపటి క్రితమే తలైవర్ 171 టైటిల్ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. కూలీ అనే టైటిల్ తో తలైవర్ 171 రాబోతుందని మేకర్స్ తెలిపారు. ఇక ఈ టీజర్ లో రజినీ ఊర మాస్ లుక్ లో కనిపించాడు. మూడు నిమిషాల పాటు సాగిన ఈ టీజర్ లో రజినీ తన స్టైల్ తో ఫ్యాన్స్ ను ఫిదా చేశాడు. బంగారం తయారుచేస్తున్న కొంతమంది రౌడీలను చితక్కొట్టి డైలాగ్ చెప్పిన విధానం అదిరిపోయింది. ఇక చివర్లో రజినీ నవ్వు.. ఆ షాట్ నెక్ట్ లెవెల్ అని చెప్పాలి. టీజర్ మొత్తాన్ని బ్లాక్ అండ్ వైట్ లో చూపించగా.. గోల్డ్ ను మాత్రం హైలైట్ చేశారు.

Advertisement

Also Read: Pawan Kalyan: ‘ఎక్స్’ ను షేక్ చేస్తున్న పవన్ కళ్యాణ్.. ఇదెక్కడి మాస్ రా మావా

టైటిల్ టీజర్ తోనే సినిమాపై హైప్ క్రియేట్ చేశారు. ఇక అనిరుధ్ మ్యూజిక్ అయితే అస్సలు చెప్పాల్సిన అవసరం లేదు. చేతికి కూలీ బిళ్ల కట్టుకొని.. గాగుల్స్ పెట్టుకొని రజినీ స్టైల్ గా కనిపించాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని మేకర్స్ తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో రజినీ ఎలాంటి విజయాన్నీ అందుకుంటాడో చూడాలి.

Advertisement

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×