BigTV English

#PawanKalyanWinningPithapuram: ‘ఎక్స్’ ను షేక్ చేస్తున్న పవన్ కళ్యాణ్.. ఇదెక్కడి మాస్ రా మావా..!

#PawanKalyanWinningPithapuram: ‘ఎక్స్’ ను షేక్ చేస్తున్న పవన్ కళ్యాణ్.. ఇదెక్కడి మాస్ రా మావా..!

#PawanKalyanWinningPithapuram Trending in ‘X’: పవన్ కళ్యాణ్.. జనసేన.. గాజు గ్లాస్.. పిఠాపురం.. పవన్.. సీఎం ప్రస్తుతం సోషల్ మీడియా ఓపెన్ చేయడం ఆలస్యం ఇవి తప్ప ఇంకేమైనా కనిపిస్తే ఒట్టు. అంతలా పవన్ కళ్యాణ్ నామజపం ఎందుకు చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎందుకు ట్రెండ్ చేస్తున్నారు. నేడు ఆయన పుట్టినరోజు కాదు కదా అంటే.. నేడు పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. పిఠాపురం MLA అభ్యర్థిగా జనసేనాని పవన్ కళ్యాణ్ పెద్ద ర్యాలీతో నామినేషన్ వేశారు.


కొణిదెల పవన్ కళ్యాణ్ అనగా నేను అంటూ.. ఆయన భగవంతుని మీద ప్రమాణం చేసి నామినేషన్ దాఖలు చేశారు. ఇక నేటి ఉదయం నుంచి పవన్ కళ్యాణ్ ర్యాలీలు, ఆయన పేరుతో సోషల్ మీడియా షారుక్ అవుతుంది. ర్యాలీ మొదలుపెట్టిన దగ్గరనుంచి నామినేషన్ వేసి వచ్చేవరకు అభిమానులు కారు వెనుక పరుగులు తీస్తూనే ఉన్నారు. అసలు ఇది నామినేషన్ వేసే రోజులా లేదు పవన్ సీఎంగా గెలిచి బయటకు వచ్చినప్పుడు చేస్తున్న ఆనందహోలా ఉందని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. అభిమానులు మాత్రమేకాదు పవన్ ను నమ్మి నడుస్తున్న సెలబ్రిటీలు సైతం ఈ ప్రచారంలో పాల్గొన్నారు. హైపర్ ఆది, మెహర్ రమేష్, SKN, బన్నీ వాసు, నాగబాబు, జబర్దస్త్ గ్యాంగ్, గబ్బర్ సింగ్ గ్యాంగ్.. ఇలా ప్రతి ఒక్కరు పవన్ సపోర్ట్ గా నామినేషన్ వేయడానికి పవన్ ను తీసుకెళ్లారు.

Also Read: Pawan Nomination Filed: నామినేషన్ దాఖలు చేసిన పవన్ కల్యాణ్.. జనసేనాని ఆస్తుల వివరాలివే..!


సాధారణంగా ఏ రాజకీయ నాయకుడు నామినేషన్ వేసినా.. అది ఎంత పెద్ద స్టార్ అయినా కూడా మహా అయితే కొద్దిసేపు మాత్రమే ట్రెండింగ్ లో ఉంటారు. కానీ, ఉదయం నుంచి ఎక్స్ లో PawanKalyanWinningPithapuram టాప్ ట్రెండింగ్ లో ఉంది. పిఠాపురంలో పవన్ గెలవాలని కోరుకుంటున్నాం.. జనసేనకు ఓటు వేయండి.. ఇక ఇవే నినాదాలు మారుమ్రోగిపోతున్నాయి. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. నామినేషన్ కే ఇలా ఉంటే పవన్ గెలిస్తే ఏ రేంజ్ లో ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాం అని ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు. మరి ఈ ఎన్నికల్లో పవన్ గెలుస్తాడో లేదో చూడాలి.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×