Allari Naresh ‘Aa Okkati Adakku’ Trailer Out Now: అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా మల్లి అంకం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆ ఒక్కటి అడక్కు. చిలక ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజీవ్ చిలక ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చాలా గ్యాప్ తరువాత నరేష్.. తన కామెడీ పంథాలో ఈ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ కు మంచి ప్రేక్షకాదరణ దక్కింది. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను న్యాచురల్ స్టార్ నాని రిలీజ్ చేసి చిత్రబృందానికి బెస్ట్ విషెస్ తెలిపాడు. ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తుంది. పెళ్లి కోసం ఆరాటపడి యువకుడిగా అల్లరి నరేష్ కనిపిస్తున్నాడు.
గణ ఒక మిడిల్ క్లాస్ కుర్రాడు. 30 ఏళ్లు దాటినా అతనికి పెళ్లి కాదు. దాదాపు 49 పెళ్లి సంబంధాలు చూస్తాడు. ఏది సెట్ అవ్వదు. పంతుళ్ళను, మ్యారేజ్ బ్యూరోల చుట్టూ తిరుగుతూనే ఉంటాడు. చివరికి విడాకుల అయిన వారిని, ఇద్దరు పిల్లల తల్లిని కూడా చేసుకోవడానికి రెడీ అవుతాడు. వారు కూడా గణను రిజెక్ట్ చేస్తారు. ఇక ఇలాంటి కరువులో ఉన్న గణకు సిద్ది(ఫరియా) పరిచయమవుతుంది. ఎలాగైనా ఆమెను పెళ్లి చేసుకోవాలని గణ ఫిక్స్ అవుతాడు. ఈ ప్రేమ కథ అలా నడుస్తున్న నేపథ్యంలో సడెన్ గా గణ చుట్టూ సమస్యల సుడిగుండాలు ఎదురవుతాయి.
Also Read: Pawan Kalyan: పవన్ ఆమెకు కడుపు చేసి వదిలేశాడు.. మళ్లీ పాత పాట మొదలెట్టిన పోసాని
మరి వాటన్నింటిని దాటుకొని సిద్దిని గణ వివాహమాడాడా.. ? పెళ్లి ఎప్పుడు.. ? పెళ్లి ఎప్పుడు.. ? అని అడుగుతున్న వారికి గణ సమాధానం చెప్పాడా..? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఈ ట్రైలర్ చూస్తే.. బయట పెళ్లి కానీ అబ్బాయిల పరిస్థితి కూడా ఇలాగే ఉందనిపిస్తుంది. చివర్లో నరేష్.. కోర్టులో పెళ్ళెప్పుడు అన్నవారిని జైల్లో పెట్టాలి అని చట్టం తీసుకురండి అని చెప్పే డైలాగ్ అయితే హైలైట్. ఇక ఈ సినిమా మే 3 న రిలీజ్ కానుంది. మరి ఈ సినిమాతో నరేష్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.