E-Paper
Advertisement

Thalapathy 69: విజయ్ ఫ్యాన్స్‌కు పజిల్.. ‘దళపతి 69’ నుండి స్పెషల్ సర్‌ప్రైజ్ రివీల్

Thalapathy 69: విజయ్ ఫ్యాన్స్‌కు పజిల్.. ‘దళపతి 69’ నుండి స్పెషల్ సర్‌ప్రైజ్ రివీల్
Advertisement

Thalapathy 69 Cast Reveal: కోలీవుడ్‌లో సెన్సేషనల్ స్టార్‌గా, దళపతిగా ఎదిగారు విజయ్. అలాంటి హీరో మరికొన్ని రోజుల్లో సినిమాలకు దూరమయ్యి పొలిటికల్ పార్టీపై ఫోకస్ చేయనున్నారని ఫ్యాన్స్ ఆందోళన పడుతున్నారు. ఒకవేళ అదే నిజమయితే చివరిసారిగా దళపతి 69తో ఆయనను స్క్రీన్స్‌పై చూసుకోవచ్చని ఆశగా ఎదురుచూస్తున్నారు. హెచ్ వినోథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకే వారిలో మరింత హైప్ క్రియేట్ చేయడం కోసం ‘దళపతి 69’ క్యాస్ట్ రివీల్ అంటూ ఈ మూవీలో కీలక పాత్రలు పోషిస్తున్న నటీనటులను ఒక్కొక్కరిగా రివీల్ చేస్తున్నారు.

గెస్ చేసేస్తున్నారు

Advertisement

ముందుగా దళపతి 69లో ‘యానిమల్’ ఫేమ్ బాబీ డియోల్ విలన్‌గా నటించనున్నారని రివీల్ చేశారు. ఆ తర్వాత ఇందులో విజయ్‌కు జోడీగా పూజా హెగ్డే నటించనున్నారని ప్రకటించారు. ఇప్పుడు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్న మరో ముగ్గురు నటీనటుల గురించి రివీల్ చేశారు మేకర్స్. వారి నుండి ప్రకటన రాకముందే ఇందులో విలన్ బాబీ డియోల్ అని, హీరోయిన్ పూజా హెగ్డే అని ప్రేక్షకులు గెస్ చేసేశారు. వీరితో పాటు లేటెస్ట్ మలయాళం సెన్సేషన్, ‘ప్రేమలు’ ఫేమ్ మమితా బైజూ కూడా ప్రకటించక ముందే సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అయ్యింది. దీంతో ఆడియన్స్ అందరు నటీనటుల గురించి గెస్ చేసేస్తున్నారని, వారిని ఒక ఊహించని సర్‌ప్రైజ్ ప్లాన్ చేశారు మేకర్స్.

Also Read: సనాతన ధర్మం వల్ల సమంత – నాగ చైతన్య ఇష్యూ కనిపించలేదా… ?

Advertisement

ఇదే సర్‌ప్రైజ్

ముందుగా ‘అందరినీ కరెక్ట్‌గా గెస్ చేసేశామనే సంతోషంలో ఉన్నారు కదా. అందుకే లిస్ట్‌లోని ఒక సర్‌ప్రైజ్ మీకోసం వెయిట్ చేస్తోంది’ అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేసింది దళపతి 69 టీమ్. దీంతో విజయ్ ఫ్యాన్స్‌కు ఇదొక పజిల్‌లాగా మారింది. అసలు ఆ యాక్టర్ ఎవరు అని గెస్ చేయడం మొదలుపెట్టారు. కాసేటికి దళపతి 69లో కీలక పాత్ర పోషిస్తున్న యాక్టర్ మరెవరో కాదు.. గౌతమ్ మీనన్ అని రివీల్ చేశారు. చాలావరకు ఈ సినిమాలో గౌతమ్ మీనన్ ఉండబోతున్నారనే వార్త బయటికి రాలేదు. ఈ స్థానంలో ప్రకాశ్ రాజ్ ఉండనున్నారనే చాలామంది గెస్ చేశారు. కానీ ఇప్పుడు ఆ స్థానంలో గౌతమ్ మీనన్ కనిపించనున్నారని కన్ఫర్మ్ అయ్యింది.

ముగ్గురు భామల హంగామా

గౌతమ్ మీనన్‌తో పాటు దళపతి 69లో కీలక పాత్ర పోషిస్తున్న మరొక నటి గురించి కూడా మేకర్స్ రివీల్ చేశారు. తనే ప్రియమణి. సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత సౌత్, నార్త్ అని తేడా లేకుండా బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లతో దూసుకుపోతోంది ప్రియమణి. ఇదే సమయంలో దళపతి 69లో కీలక పాత్రలో నటించే అవకాశం కొట్టేసింది. తన పాత్ర ఏంటి అనే విషయం క్లారిటీ లేకపోయినా.. ఒకే స్క్రీన్‌పై పూజా హెగ్డే, ప్రియమణి, మమితా బైజును చూడబోతున్నామని చాలామంది ప్రేక్షకులు ఎగ్జైటింగ్‌గా ఫీలవుతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న దళపతి 69ను వచ్చే ఏడాది అక్టోబర్‌లో దీపావళి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×