BigTV English
Advertisement

Samantha : సమంతను వెంటాడుతున్న అక్టోబర్ బ్యాడ్ లక్… డివోర్స్ నుంచి నేటి వరకు వరుస వివాదాలు

Samantha : సమంతను వెంటాడుతున్న అక్టోబర్ బ్యాడ్ లక్… డివోర్స్ నుంచి నేటి వరకు వరుస వివాదాలు

Samantha : సౌత్ క్వీన్ సమంత ఏ ముహూర్తాన విడాకులు తీసుకుందో తెలియదు గానీ వరుస వివాదాలు ఆమెను చుట్టుముడుతున్నాయి. డీవోర్స్ ట్రోలింగ్ మొదలు పెడితే ఇప్పుడు కొండా సురేఖ కామెంట్స్ దాకా వరుసగా ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూనే ఉంది సమంత. మరి ఇప్పటిదాకా ఆమె చిక్కుకున్న వివాదాలు ఏంటో తెలుసుకుందాం పదండి.


డివోర్స్ ట్రోలింగ్

2017 అక్టోబర్లో సమంత అక్కినేని నాగచైతన్యను పెళ్లి చేసుకోగా, 2022 అక్టోబర్ నెలలో విడాకులు తీసుకుంటున్నట్టుగా ప్రకటించి షాక్ ఇచ్చారు. ఇద్దరూ కలిసి మ్యూచువల్ గా విడాకులు తీసుకున్నామంటూ సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేసినప్పటికీ, అక్కినేని ఫ్యాన్స్ ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు.. అక్కినేని నాగచైతన్య మంచివాడని, అలాంటి వ్యక్తిని కాదని సినిమాలు, డబ్బు కోసం పాకులాడుతోంది అంటూ మండిపడ్డారు.


మయోసైటిస్ అనౌన్స్మెంట్

2022 అక్టోబర్ నెలలోనే సమంత తాను మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడ్డానని ప్రకటించి షాక్ ఇచ్చింది. అదికూడా ఆమె హీరోయిన్ గా నటించిన యశోద సినిమా ప్రమోషన్స్ లో. కన్నీళ్లు పెట్టుకుంటూ తాను ఈ వ్యాధి నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకుంది.. కానీ సినిమా ప్రమోషన్స్ కోసమే ఆమె అనారోగ్యం పేరుతో నాటకం ఆడుతోంది అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వినిపించాయి. అంతేకాకుండా మయోసైటిస్ అనేది పెద్ద వ్యాధి ఏం కాదని, గోరంత విషయాన్ని సమంత కొండంత చేసి చూపిస్తోంది అంటూ పలువురు కామెంట్స్ చేశారు. ఆ తర్వాత కొన్నాళ్లపాటు సినిమాలు చేసి బ్రేక్ తీసుకుంది. ఏడాది పాటు కనిపించకుండా పోయింది సమంత.

పుష్ప సాంగ్ కాంట్రవర్సీ…

అలాగే విడాకుల తర్వాత సమంత ‘ఊ అంటావా మావా’ అనే ఐటమ్ సాంగ్ చేయడం అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది. గతంలో ఎన్నడూ లేని విధంగా విడాకుల తర్వాత సమంత ‘పుష్ప’ సాంగ్ లో రెచ్చిపోయిన నటించడంతో ఆమె ఇలా బోల్డ్ రోల్స్ చేయడానికి అక్కినేని ఫ్యామిలీ అంగీకరించడకపోవడం వల్లే విడాకులు తీసుకుంది అంటూ టాక్ నడిచింది.

భరణం రూమర్స్

ఇక డీవోర్స్ తీసుకున్నాక సమంత ఏకంగా 250 కోట్ల భరణం డిమాండ్ చేసిందని పుకార్లు వినిపించాయి. ఈ విషయంపై ‘కాఫీ విత్ కరణ్’ షోలో ఆమెకు ప్రశ్నలు ఎదురుకాగా, సమంత ఆ వార్తలను కొట్టి పారేసింది.

స్టార్ హీరో దగ్గర 25 కోట్లు

అలాగే సమంత మయోసైటిస్ చికిత్స కోసం ఒక తెలుగు స్టార్ నుంచి ఏకంగా 25 కోట్ల రూపాయలు తీసుకుందని రూమర్లు వినిపించాయి. ఈ విషయాన్ని కూడా సమంత సోషల్ మీడియా వేదికగా కొట్టిపారేసింది.

డిటాక్స్ వివాదం…

ఒక పాడ్ కాస్ట్ లో సమంత ఇచ్చిన హెల్త్ టిప్ తో ఆమెకు ఎదురు దెబ్బ తగిలింది. ఇలాంటి ఆరోగ్యాన్ని కరాబ్ చేసే చిట్కాలు చెప్పి అమాయక ప్రజల ప్రాణాలు బలి తీసుకుంటున్నారు అంటూ ఓ డాక్టర్ సమంతపై విరుచుకుపడ్డ విషయం తెలిసిందే.

ఇప్పుడు కొండా సురేఖ వివాదం

ఇక ఇప్పుడు కొండా సురేఖ ఏకంగా సమంతకు మాజీ మంత్రి కేటీఆర్ తో ముడి పెడుతూ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. ఇలా విడాకుల నుంచి మొదలుకొని ఇప్పటిదాకా సమంత వరుస వివాదాల్లో చిక్కుకోవడం గమనార్హం.

వీటితో పాటు… రీసెంట్ గా శోభితతో నాగ చైతన్య ఎంగేజ్మెంట్ తరువాత కూడా సమంతను టార్గెట్ చేశారు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×