E-Paper
Advertisement

Thandel: నితిన్ కు పోటీగా నాగ చైతన్య.. ఈసారి తగ్గేదేలే

Thandel: నితిన్ కు పోటీగా నాగ చైతన్య.. ఈసారి తగ్గేదేలే
Advertisement

Thandel: ప్రస్తుతం టాలీవుడ్ కుర్ర హీరోలు కొంతమంది హిట్ కోసం ఎదురుచూస్తుండగా.. ఇంకొందరు పాన్ ఇండియా గుర్తింపు కోసం కష్టపడుతున్నారు. ఇక ఇందులో చెప్పుకోవాల్సిన హీరోల్లో నాగ చైతన్య ఒకడు. లవ్ స్టోరీ సినిమా తరువాత చై కు హిట్ పడిందే లేదు. ఇక ఇవన్నీ పక్కన పెడితే ఇప్పటివరకు అక్కినేని కుటుంబంలో ఏ ఒక్క హీరో పాన్ ఇండియా లెవెల్లో సినిమా చేయలేదు. ఇక మొట్టమొదటి సారి చై.. తండేల్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో రాబోతున్నాడు.

గీత ఆర్ట్స్ బ్యానర్ లో చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కతున్న చిత్రం తండేల్. ఈ చిత్రంలో చై సరసన సాయిపల్లవి నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా ఎప్పటినుంచో డిసెంబర్ 20 న వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుందని టాక్. ఈ నేపథ్యంలోనే ఈ డేట్ ను నితిన్ కొట్టేశాడు. ప్రస్తుతం నితిన్ చేతిలో వరుస సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి రాబిన్ హుడ్. వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.

Advertisement

నేడు శ్రీరామనవమి పండగ సందర్భంగా రాబిన్ హుడ్ రిలీజ్ డేట్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. డిసెంబర్ 20 న తమ సినిమా కానుందని మేకర్స్ తెలిపారు. అయితే అదే రోజు కనుక చై తండేల్ కూడా రిలీజ్ కానుందని తెలుస్తోంది. ఈ లెక్కన నితిన్ కు చై గట్టి పోటీ ఇస్తాడు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి ఈ కుర్ర హీరోలు పోటీకి సై అని నిలబడతారా.. ? లేక గొడవ ఎందుకు అనుకోని తప్పుకుంటారా.. ? అనేది తెలియాల్సి ఉంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×