BigTV English

Chandrababu: సీఎంపై రాయి దాడి..‘ బీ కేర్ ఫుల్ ఆఫీసర్స్’.. చంద్రబాబు మాస్ వార్నింగ్

Chandrababu: సీఎంపై రాయి దాడి..‘ బీ కేర్ ఫుల్ ఆఫీసర్స్’.. చంద్రబాబు మాస్ వార్నింగ్

Chandrababu naidu news today(Latest news in Andhra Pradesh): సీఎం జగన్ రాయి దాడి ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి ఘాటుగా స్పందించారు. వైసీపీ ప్రభుత్వం నీచమైన డ్రామాలు చేస్తోందన్నారు. ఓటమి భయంతోనే వైసీపీ ఇలాంటి కుట్రలకు పాల్పడుతుందని ఫైర్ అయ్యారు. ఈ దాడి ఘటన కేసులో మాజీ ఎమ్మెల్యే బోండా ఉమాను ఇరికించే కుట్రలు జరుగుతున్నాయని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.


సీఎం జగన్ కుట్రలు చేస్తూ.. దాడి ఘటనలో విజయవాడకు చెందిన మాజీ ఎమ్మెల్యే బోండా ఉమాను ఇరికించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీనే ఈ దాడి చేసిందనేలా వైసీపీ డ్రామాలకు పాల్పడుతుందన్నారు. టీడీపీపై బురద జల్లేందుకు వైసీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.

వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ప్రజలు గమనిస్తున్నారని.. వాటిని చీదరించుకుంటున్నారని తెలిపారు. ఈ కేసులో వైసీపీ ప్రభుత్వం పోలీసు శాఖతో తప్పులు చేయిస్తోందని చంద్రబాబు అన్నారు. విజయవాడలో బోండా ఉమా చేస్తున్న ప్రచారాన్ని తప్పుడు కేసులు పెట్టి వైసీపీ అడ్డుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తోందన్నారు.


Chandrababu naidu news today
Chandrababu

ఈ దాడి కేసులో నిందితులంటూ వడ్డెర కాలనీకి చెందిన కొందరు యువకులను పోలీసులు తీసుకుపోయారని చంద్రబాబు తెలిపారు. నిజానికి వారంతా అమాయకులని చంద్రబాబు వెల్లడించారు. బలవంతంగా వారి చేత టీపీడీనే ఈ దాడి చేయించిందని చెప్పేలా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. సీఎంకు భద్రత కల్పించడంలో విఫలమైన వారిని ఈ కేసు విచారణ నుంచి తప్పించి.. ఆ బాధ్యతలను వేరే వాళ్లకి అప్పగించాలని డిమాండ్ చేశారు.

Also Read: అప్పుడు కత్తి.. ఇప్పుడు రాయి.. కథేం మారలేదా?

అధికారులు వైసీపీ ప్రభుత్వం ప్రలోభాలకు లొంగొద్దని, ఒత్తిళ్లకు లొంగకుండా జాగ్రత్తగా ఉండాలని చంద్రబాబు సూచించారు. అలా వైసీపీకి సహకరించిన వారిని, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పుకుండా శిక్షిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఈ కేసుపై ఈసీ ప్రత్యేకంగా దృష్టి పెట్టిందని.. వేరే అధికారులతో ఈ దాడి ఘటనలో సమగ్ర విచారణ జరిపించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

Tags

Related News

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Big Stories

×