E-Paper
Advertisement

Thandel Collections : దూకుడు తగ్గని తండేల్.. బాక్సాఫీస్ వద్ద జాతర.. ఎన్ని కోట్లంటే..?

Thandel Collections : దూకుడు తగ్గని తండేల్.. బాక్సాఫీస్ వద్ద జాతర.. ఎన్ని కోట్లంటే..?
Advertisement

Thandel Collections :  యువ సామ్రాట్అక్కినేని నాగ చైతన్య తాజాగా నటించిన మూవీ తండేల్.. సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి స్టార్ డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహించారు. రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన ‘తండేల్ ‘ మూవీకి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. ప్రేమ కోసం బ్రతికే జంట లవ్ స్టోరీతో పాటుగా దేశభక్తి ని కూడా యాడ్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్, ప్రొడక్షన్ వ్యాల్యూస్ సినిమాకు హైలెట్ అయ్యాయి.. సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది. ఇక కలెక్షన్స్ కు భారీగా వసూల్ చేసింది. ఈ మూవీ తొలి రోజు నుంచి 11 రోజుల వరకు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది.. థియేటర్లలోకి వచ్చిన 5 రోజులకే 100 కోట్ల క్లబ్ లోకి చేరడం మామూలు విషయం కాదు.. ఇక ఆరు రోజులకు ఎన్ని కోట్ల గ్రాస్ ను వసూల్ చేసిందో ఒకసారి చూద్దాం..

శ్రీకాకుళం జిల్లా సముద్ర తీర ప్రాంతాల్లో నివసించే జాలర్ల పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఈ స్టోరీగా తీసుకున్నారు. ముఖ్యంగా  శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్న కొన్ని పరిణామాలతో కూడిన స్టోరీ లైన్ఆధారంగా తెరకెక్కిన తండేల్ సినిమాను దాదాపు రూ. 75 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. చందూ మొండేటి, నాగ చైతన్య కాంబో రావడంతో మూవీపై భారీ అంచనాలు నెలకున్నాయి.. ఈ మూవీ ప్రీరిలీజ్ బిజినెస్ కూడా ఎక్కువగానే జరిగింది. తండేల్ సినిమా వరల్డ్ వైడ్ రూ.52 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని సమాచారం. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను 105 కోట్ల గ్రాస్ కలెక్షన్లు, 54 కోట్ల షేర్ వసూలు చేయాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.. షో పడినప్పటి నుంచి ఐదు రోజుల వరకు 70 కోట్లకు పైగానే వసూల్ చేసింది. ఇక పదకొండు రోజులకు గాను 125 కోట్లకు పైగా వసూల్ చేసిందని మేకర్స్ పోస్టర్ ద్వారా అనౌన్స్ చేశారు. మరి ఈ మూవీ ఆరు రోజులకు గాను ఎన్ని కోట్ల కలెక్షన్లను అందుకుందో ఒకసారి చూద్దాం..

Advertisement

Also Read :నాకు శ్రీదేవి కన్నా ఆమె ఎక్కువ.. సడెన్ గా ఈ షాకేంటి..?

తండేల్‌ మూవీ 11 రోజుల కలెక్షన్ల వివరాల్లోకెళ్తే.. ఈ సినిమా ఫస్ట్ డే పాజిటివ్ టాక్‌ సొంతం చేసుకోవడంతో కాసుల వర్షం కురుస్తుంది. బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ వసూళ్లు రాబట్టింది. ఇలా తండేల్ తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.21.27 కోట్ల గ్రాస్ చేసి, హీరో నాగ చైతన్య కెరీర్‌లో తొలి రోజు అత్యధిక వసూలు రాబట్టిన మూవీగా నిలించింది.. అదే జోరు రెండో రోజు కూడా కొనసాగింది. రూ.20 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇక మూడో రోజు రూ. 22 కోట్లు. ఇక నాలుగవ రోజు రూ. 10 కోట్లకు పైగా వసూల్ చేసింది. ఐదో రోజు కలెక్షన్స్ చూస్తే తెలుగు రాష్ట్రాలు, కన్నడలో కలిపి రూ. 5 కోట్లు, ఓవర్సీస్‌తో కలిపి తండేల్ మూవీ 5 డే రూ. 6.5 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసే అవకాశముందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అంటే 80 కోట్లకు పైగా వసూల్ చేసిందనేకొనసాగజులకు 100 కోట్ల కు పైగా వసూల్ చేసిందని వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. కేవలం ఐదు రోజుల్లో బాక్సాఫీస్ రికార్డులు బ్రేక్ చేసేలా కలెక్షన్స్ రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.. 10 రోజులకు వందకోట్లను క్రాస్ చేసింది. అలాగే 11 రోజులకు 125 కోట్లు వసూల్ చేసిందని తెలుస్తుంది. ప్రస్తుతం థియేటర్లలో పెద్దగా చెప్పుకొదగ్గ సినిమాలు లేవు. కలెక్షన్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీలో టాక్.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×