Brahmamudi serial today Episode: రాహుల్, రుద్రాణిలను ఇంట్లోంచి వెళ్లిపోమ్మని సీతారామయ్య చెప్పగానే.. రుద్రాణి బాధపడుతూ సీతారామయ్య కాళ్ల మీద పడి ఇన్నాళ్లు మా వల్లే ఇంట్లో గొడవలు అవుతున్నాయంటే.. ఏమో అనుకున్నాను కానీ ఇవాళ అర్తం అయింది. మేము బయటకు వెళ్లి బతకలేము అంటూ ఏడుస్తుంది. కనీసం నా కోడలు, దానికి పుట్టిన బిడ్డ ముఖం చూసైనా ఈ ఒక్కసారికి మమ్మల్ని క్షమించు నాన్నా అంటూ ప్రాధేయపడుతుంది. దీంతో స్వప్న మా గురించి నువ్వేం కంగారుపడొద్దు అత్త.. తాతయ్య గెట్ అవుట్ అంది మిమ్మల్ని మీ కొడుకును నన్ను కాదు. నేను నా బిడ్డ తాతయ్య ఇచ్చిన ఆస్థితో ప్రశాంతంగా జీవితాంతం బతుకుతాం. నేను నా చెల్లెల్లతో కలిసి ఈ ఇంట్లోనే ఉంటాను. తాతయ్య ఇది నటన నమ్మకండి మళ్లీ మోసపోకండి అంటూ మాట్లాడుతుంది.
రుద్రాణి ఏడుస్తూ.. నాన్నా అందరూ ఒకటయ్యారు. నేను, నా కొడుకే మీకు బరువు అనుకుంటే చెప్పండి ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటాము అంటుంది. గోతులు తవ్వే మీకు నూతులు ఎక్కడ దొరుకుతాయి అత్తయ్యా ఇప్పుడు అన్ని బోర్‌వెల్స్ కదా..? మీకు ఆ అవకాశం లేదు అంటుంది స్వప్న. దీంతో రుద్రాణి ఏడుస్తూ.. నాన్నా ఇక నుంచి ఈ ఇంట్లో జరిగే వాటితో మాకు సంబంధం లేనట్టే ఉంటాం.. దయచేసి ఈ ఒక్క అవకాశం ఇవ్వండి నాన్నా లేకపోతే దిక్కులేని పక్షులం అయిపోతాం నాన్నా అంటూ ఏడుస్తుంది. ఏటత్తా ఇందాక జన్మలో ఏడ్వను అన్నాను ఇప్పుడేమో అలా ఏడుస్తున్నావు అంటుంది స్వప్న.
ఇంతలో కావ్య కలగజేసుకుని అక్కా నువ్వు ఉండు నీకు రాహుల్‌తో ఎలాంటి సుఖం, సంతోషం లేకపోయినా.. నీ బిడ్డకు తండ్రి కావాలి. అందుకే నువ్వు రాహుల్‌తో కలిసి ఉండాలి అని చెప్తుంది. అయితే మా అత్తను పంపించేయండి.. మా అత్త లేకపోతే రాహుల్ బుద్దిగానే ఉంటాడు. అంటుంది. దీంతో కావ్య తాతయ్య మీ ఈ నిర్ణయం అందరం ప్రశాంతంగా ఉంటావేమో కానీ ఆ బిడ్డకు అన్యాయం జరుగుతుంది. ఆ తర్వాత నిర్ణయం మీదే తాతయ్య అని చెప్తుంది కావ్య. దీంతో సీతారామయ్య, ఇందిరాదేవి ఆలోచించుకుని ఆఖరి అవకాశం ఇస్తున్నాం జాగ్రత్తగా ఉండు అని చెప్పి వెళ్లిపోతారు.
రుద్రాణి కోపంగా రూంలో వస్తువులు పగులగొడుతుంటే.. రాహుల్ వచ్చి ఆపేస్తాడు. ఎందుకు పగులగొడుతున్నావు అని అడుగుతాడు. ఇద్దరూ కలిసి ఇరిటేటింగ్‌గా ఫీలవుతారు. ఇంతకీ మీ నాన్న గురించి తాతయ్య అంత గొప్పగా ఫీలవుతున్నాడు కదా..? మీ వెనక ఏదైనా గొప్ప ఫ్లాష్‌బ్యాక్ ఉందా అని అడుగుతాడు. ఉందని బాషా లాంటి గొప్ప ప్లాష్‌బ్యాక్ ఉందని వస్తుంది. చెప్పుకోవడానికి సిగ్గు పడేంత చెండాలమైన స్టోరీ. జనాలు చీ కొట్టేంత దరిద్రమైన స్టోరీ అంటుంది. దీంతో రుద్రాణి ఎక్కు వ మాట్లాడావంటే చెంప పగులుద్ది అంటూ తిడుతుంది. దీంతో స్వప్న చాల్లే ఊరుకో అత్తా నీ ప్రతాపం నాలుగు గోడల మధ్యే అని తెలుసు. నాకో నిజం చెప్పు అత్తా.. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు నీ నాన్న పేరు చెప్పుకుని ఇక్కడ సెటిల్ అయిపోతున్నావు.. కానీ ఆయన లక్షణం నీకు ఒక్కటీ రాలేదు కదా… బహుశా నీది మీ అమ్మ పోలిక అనుకుంటా.. మీ అమ్మ నిన్ను మించిన కంచు అనుకుంటా..? తరానికో దరిద్రం అన్నట్టు మీరు మీ దరిద్రాన్ని కంటిన్యూ చేసుకుంటూ పోతున్నారు అనుకుంటా.. అనగానే..
రుద్రాణి కోపంగా ఏయ్ ఎంత ధైర్యం ఉంటే మా అమ్మ గురించి మాట్లాడుతున్నావు అంటుంది. నువ్వు ఇలాగే ఉంటే మీ అమ్మ ఏంటి వాళ్ల అమ్మ గురించి కూడా ఇలాగే మాట్లాడుకుంటారు జనాలు.. నువ్వేంటి అలా చూస్తున్నావు.. నువ్వు ఇలాగే ఉంటే ఇవాళ మీ అమ్మ కాళ్లు పట్టుకున్నట్టు.. రేపో మాపో నీ చేత అందరి కాళ్లు పట్టిస్తుంది. అని చెప్పి వెళ్లిపోతుంది. దీని సంగతి పక్కకు పెట్టు మమ్మీ.. అసలు మన సంగతి ఏంటి అని అడుగుతాడు. ఇన్ని రోజులు ఈ ఆస్థిలో వాటా కోసమే ట్రై చేశాను. కానీ ఇప్పుడు ఆస్థి మొత్తం నా పేరు మీదకు వచ్చేలా చేస్తాను చూడు అంటుంది రుద్రాణి.
కళ్యాణ్, రాజ్, కావ్య మాట్లాడుతుంటే.. ధాన్యలక్ష్మీ వచ్చి కళ్యాణ్ పాటలు రాయడాన్ని తప్పు పడుతుంది. ఒకరి దగ్గర పని చేస్తే ఎప్పటికైనా బంటు అంటారు. రాజు అనరు తప్పో ఒప్పో సొంతంగా గెలవాలి అనుకున్నావు. ముందు అలా గెలిచి చూపించు తల్లిగా సంతోషిస్తాను. అంతేకానీ ఇలా పెళ్లాన్ని గెలిపించాను. అత్తగారిని అందంలం ఎక్కించాను అంటూ సంబరపడిపోతూ కూర్చుంటే దాని వల్ల ఏ ప్రయోజనం లేదు అంటూ తిట్టి వెళ్లిపోతుంది. రూంలోంచి రాజ్ మాటలు విన్న అప్పు బాధపడుతుంది. రాత్రికి బయట ఒక్కతే కూర్చుని బాధపడుతుంది. ఇంతలో కావ్య వస్తుంది. అప్పును ఓదారుస్తుంది. ఈ సిచ్యుయేషన్‌లో ఏడవాల్సింది కాదు చేయాల్సింది. ఆ రైటర్ దగ్గర కళ్యాణ్ అగ్రిమెంట్ లేకుండా చేయాలి అని చెప్తుంది. దీంతో అప్పు ఇప్పుడు అర్థమైంది అని చెప్తుంది.
సామంత్ కోపంగా అనామికను కొడతాడు. ఎందుకు కొట్టావు నన్ను అనామిక అడగ్గానే.. నువ్వేదో తోపు అనుకుని నువ్వేం చెప్పినా విన్నాను. గొర్రెలా తోక ఊపుతూ తిరిగినందుకు క్లయింట్స్ ముందు నా గౌరవం పోయింది. ఇంత జరిగినా కూడా ఇంకా నీతో కలిసి ఉంటానని ఎలా అనుకున్నావు.. నాకు నీ మీద నమ్మకం పోయింది. నిన్ను నమ్మి కోట్లు ఖర్చు చేశాను. డబ్బు పోయింది కానీ నువ్వు చెప్పిన ఒక్క పని జరగలేదు అంటూ తిడతాడు. నీ పగ కోసం నా జీవితాన్ని సర్వనాశనం చేశావు అని వెళ్లిపోతాడు. నన్నే అవమానిస్తావా..? నిన్ను ఊరికే వదలను సామంత్.. నీ లెక్కలు ఆ రాజ్ ఫ్యామిలీ లెక్కలు తేలుస్తాను అనుకుంటుంది అనామిక. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?