E-Paper
Advertisement

Thandel collections : జోరు తగ్గిన తండేల్ కలెక్షన్స్.. 100 కోట్లు కష్టమేనా..?

Thandel collections : జోరు తగ్గిన తండేల్ కలెక్షన్స్.. 100 కోట్లు కష్టమేనా..?

Thandel collections : అక్కినేని హీరో నాగచైతన్య, న్యాచురల్ బ్యూటి సాయి పల్లవి జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం తండేల్.. కార్తికేయ 2 ఫేమ్ డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ పతాకం పై బన్నీ వాసు నిర్మించారు. రియల్ స్టోరీ బేస్ గా తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. మొదటి రోజు మంచి టాక్ ను సొంతం చేసుకున్న ఈ మూవీ రెండు రోజు మంచి టాక్ ను అందుకోవడంతో పాటుగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. మూడు రోజుల్లో మంచి కలెక్షన్స్ను వసూల్ చేసిన ఈ తండేల్ మూవీ, ఏడురోజులకు ఎన్ని కోట్లు రాబట్టిందో ఒకసారి తెలుసుకుందాం..

ఇటీవల నాగ చైతన్య ఖాతాలో ఒక్క హిట్ మూవీ పడటలేదు. సరైన హిట్ లేక సతమతవుతున్న హీరో, స క్సెస్ పుల్ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వంలో తండేల్ మూవీలో నటించారు. భారీ బడ్జెడ్ తో తెరకేక్కడంతో భారీ అంచనాలే క్రియేట్ అయ్యాయి.. రియల్ స్టోరీ ఆధారంగా రూపొందిన సినిమాలో లేడీ సూపర్ స్టార్ సాయి పల్లవి హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాకి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. ఈ మూవీ సాంగ్స్ బాగా హైలెట్ అయ్యాయని చెప్పాలి. పుష్ప 2 మూవీతో మంచి హిట్ ను అందుకున్న దేవీకి దీంతో మరో హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మూవీ ఉత్తరాంధ్రలోని జాలర్ల జీవితంలో జరిగిన యదార్థ గాథ ఆధారంగా తెరకెక్కించారు. ఈ సినిమా సముద్రం, పాకిస్థాన్ బ్యాక్ డ్రాప్‌తో కథ కొనసాగుతుంది.. కథ కాస్త కొత్తగా ఉండడంతో ప్రేక్షకులు సినిమా చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.. మొదటి రోజు 20 కోట్లకుపైగా వచ్చినా కూడా వీకెండ్ కావడంతో రెండు మూడు రోజులు బాగా పెరిగినట్లు తెలుస్తున్నాయి. రెండో రోజు 30 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసిన తండేల్ మూవీ తండేల్ మూవీ మూడో రోజు బాగానే వసూలు చేసింది. 41.2 కోట్ల గ్రాస్ ను రాబట్టిన ఈ మూవీ ఏడురోజులకు ఎన్ని కోట్లు వసూల్ చేసిందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం…

Also Read : పవన్ కళ్యాణ్ లోని ఆ ఒక్కటి నాకు కావాలి.. ఫ్యాన్స్ వింటే రచ్చే..

ఏడు రోజుల కలెక్షన్స్ విషయానికొస్తే.. ఈ సినిమాను సుమారు 1500 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.. ఈ మూవీ మొదటి రోజు ఊహించని విధంగా 21 కోట్లను వసూల్ చేసింది.. రెండో రోజు కూడా తండేల్‌ అదే జోరును కొనసాగించింది. రెండో రోజు దగ్గర దగ్గర రూ.20 కోట్ల గ్రాస్ వచ్చినట్లు తెలుస్తోంది. దాంతో తండేల్ మూవీ 2 రోజుల్లో రూ.41.20కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్టు మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు.. ఇక మూడో రోజు కూడా కలెక్షన్స్ భారీగానే వచ్చినట్లు తెలుస్తుంది. ఏపీ, నైజాంలో రూ. 9 కోట్ల గ్రాస్, ఓవర్సీస్‌ లో రూ. 2.5 కోట్లు, కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో రూ. 2.5 కోట్ల గ్రాస్ తో వర్డల్ వైడ్ గా డే 3 నాడు దాదాపు రూ. 14 కోట్ల వరకూ వసూళ్లు నమోదు చేసినట్టు తెలుస్తోంది. దీంతో తండేల్ మూవీ రూ.50 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టింది.. 4వ రోజు రూ. 10.4 కోట్లు, 5 రోజు రూ.7 కోట్లు, ఆరవ రోజు రూ. రోజు రూ.5 కోట్లు వసూలు చేసింది. దీంతో తండేల్ మూవీ 6 రోజుల్లో సుమారు గా రూ. 86 కోట్ల గ్రాస్ వచ్చిందని మూవీ మేకర్స్ ప్రకటించారు.. బుధవారం తో పోలిస్తే.. గురువారం వసూలు కాస్త తగ్గినట్టు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలు, కన్నడలో కలిపి రూ. 3 కోట్లు, ఓవర్సీస్‌తో కలిపి తండేల్ మూవీ ఆ రోజు రూ. 4.5 కోట్ల గ్రాస్ నమోదు చేసే అవకాశముందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. మొత్తానికి 92 కోట్లు వసూల్ చేసిందని తెలుస్తుంది.. కలెక్షన్స్ తగ్గుతున్న నేపథ్యంలో 100 కోట్ల క్లబ్ లోకి చేరుతుందా అని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు…

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×