Nidhi Agarwal : టాలీవుడ్ యంగ్ హీరోయిన్ నిధి అగర్వాల్ గురించి ప్రత్యేకంగా అవసరం లేదు. నాగచైతన్య సరసన సవ్యసాచి అనే మూవీతో తెలుగు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది. ఇస్మార్ట్ శంకర్ సినిమాకు వచ్చినంత క్రేజ్ అంతకుముందు చేసిన సినిమాలకు రాలేదని చెప్పాలి. ఆ తర్వాత తెలుగు కన్నా తమిళ సినిమాల్లో బిజీ అవ్వాలని ప్రయత్నించింది. అక్కడ కూడా కొన్ని సినిమాలు చేసి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈమె తెలుగులో రెండు సినిమాలు చేస్తుంది ప్రభాస్ సరసన రాజా సాబ్, పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తుంది. తాజాగా ఈ అమ్మడు ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో పవన్ కళ్యాణ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ వీడియో నెట్టింట వైరల్ అవడంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
హీరోయిన్ నిధి అగర్వాల్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ‘హరి హర వీరమల్లు సినిమాలో నా పాత్ర ఇప్పటివరకు నేను చేసిన వాటిల్లో అత్యుత్తమమైనది. ఆ పాత్ర కోసం గుర్రపు స్వారీ, క్లాసికల్ డ్యాన్స్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నా. కథక్ నేర్చుకున్నాను.. సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన అప్పటినుంచి ఇప్పటివరకు నా కళ్ళను నెరవేర్చుకోలేకపోయాను ఈ సినిమాతో నా కల నెరవేరిందని నిధి అన్నారు. హరిహర వీరమల్లు సినిమాతో నేను చాలా సంతోషంగా ఉన్నాను అని ఆమె సినిమా పై ప్రశంసలు కురిపించింది. అలాగే నాకు హారర్ సినిమాలు అంటే కాస్త భయం ఉండేది ఇప్పుడు ఆ భయం లేదు అందుకే నేను ప్రభాస్ రాజా సాబ్ మూవీలో నటిస్తున్నాను. ఆ మూవీ టీమ్ అంతా ఎంతో ఫన్నీగా ఉంటుంది. సెట్‌లో స్క్రిప్ట్ చదువుతున్నప్పుడు కూడా అందరం నవ్వుతూనే ఉన్నామని అంది..
ఇక హరి హర వీరమల్లు సినిమా షూటింగ్ సమయంలో నేను చాలా నేర్చుకున్నాను. సెట్స్‌లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఎంతో ఏకాగ్రతతో ఉంటారు. యాక్షన్ చెప్పగానే పూర్తిగా లీనమవుతారు. చుట్టూ ఏం జరుగుతున్న పట్టించుకోరు. తన సన్నివేశంపై మాత్రమే దృష్టి పెడతారు. ఈ హ్యాబిట్ పవన్ సార్ నుంచి నేను అలవాటు చేసుకోవాలి అని నిధి చెప్పుకొచ్చింది.. ప్రస్తుతం ఆమె కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. ఈ వీడియోని చూసిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. అలాంటి మంచి అలవాటు ఇండస్ట్రీలో ఒక్క పవన్ కళ్యాణ్ కే ఉంటుంది. నువ్వు చిన్న పిల్లవు ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది అలాంటి ఆశలు ఇప్పటికైతే మానుకో అని కామెంట్లతో రచ్చ చేస్తున్నారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇక ఈ కామెంట్స్ పై నిధి అగర్వాల్ ఎలా స్పందిస్తుందో చూడాలి.. ఈమె సినిమాలు కన్నా వార్తల్లోనే ఈమధ్య ఎక్కువగా వినిపిస్తుంది. మొన్న మధ్య తమిళ హీరో శింబు తో ప్రేమాయణం నడిపిస్తుందని వార్తలు వినిపించాయి. అది నిజమా కాదా అన్న విషయాలపై నిధి అగర్వాల్ ఇప్పటికీ క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడిప్పుడే సినిమాలతో బిజీ అవ్వాలని ప్రయత్నం చేస్తుంది.. మరి పెళ్లి చేసుకుంటుందా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది..