BigTV English

Laila Twitter Review: ‘లైలా’ ట్విట్టర్ రివ్యూ..విశ్వక్ హిట్ కొట్టాడా..?

Laila Twitter Review: ‘లైలా’ ట్విట్టర్ రివ్యూ..విశ్వక్ హిట్ కొట్టాడా..?

Laila Twitter Review: టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రస్తుతం లైలా మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీ నేడు వాలంటైన్స్ డే సందర్బంగా థియేటర్లలో రిలీజ్ అయ్యింది. సినీ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై యువ నిర్మాత సాహు గారపాటి నిర్మించిన చిత్రం లైలా.. ఇందులో హీరోయిన్ ఆకాంక్ష శర్మ నటించగా, కామాక్షి భాస్కర్ల, వెన్నెల కిషోర్, హర్షవర్ధన్, బ్రహ్మాజీ, బబ్లూ పృథ్వీ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాకు రామ్ నారాయణ్ దర్శకత్వం వహించారు.. నేడు రిలీజ్ అయ్యిన ఈ మూవీ పై పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉంది. నెటిజన్లు ఎలా రియాక్ట్ అయ్యారు. ట్విట్టర్ లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..


లైలా సినిమా విశ్వక్ సేన్‌కు సాయి ధరమ్ తేజ్ విషెస్ తెలిపాడు. లైలా సినిమా చాలా ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేసింది. విశ్వక్ సేన్‌కు లైలా చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించాలని కోరుకొంటున్నాను. గ్రాండ్‌గా ఈ మూవీ రిలీజ్ అవుతున్నది. చిత్ర యూనిట్ సభ్యులందరికీ ఆల్ ది బెస్ట్ అని సాయిధరమ్ తేజ్ ట్వీట్ చేశారు..

ఈ మూవీ ఫస్ట్ ఆఫ్ పెద్దగా ఆకట్టుకోలేదు. టైం వేస్ట్ మూవీ.. కామెడీ అంతా ఆర్టిఫిషియల్ గా ఉంది.. దీనికన్నా వరుణ్ తేజ్ మట్కా నే బాగుంది. సెకండ్ ఆఫ్ అన్నా మంచిగా వచ్చింట్లే బాగుండు అని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు..

 

లేడీ గెటప్ రోల్‌లో క్లాస్ యాక్టింగ్‌ని చూపించడానికి ప్యూర్ గట్స్, విశ్వక్ సేన్ యాక్టర్ క్యారెక్టర్‌ని వర్ణిస్తూ పూర్తి మార్కులు కొట్టేసారు. ఒక్క మాటలో చెప్పాలంటే వన్ మ్యాన్ షో అని మరొకరు రాసుకొచ్చారు.

 

లైలా సినిమా విశ్వక్ సేన్‌ నుంచి వస్తున్న మరో ఎంటర్‌టైనర్. ట్రైలర్ చూసిన తర్వాత సూపర్ ఫన్ కలిగించింది. ఈ సినిమా ఫిబ్రవరి 14వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. థియేటర్లలో ఫుల్లుగా ఎంజాయ్ చేయండి అని హీరో సుధీర్ బాబు ట్వీట్ చేశారు.

 

మరో డిజాస్టర్ లోడ్ అవుతోంది, తెలుగు సినిమా ‘లైలా.’. YSRCP గురించి వివాదాస్పద డైలాగ్‌లతో కూడిన జనసేన పార్టీ నాయకుడికి తెలుగు సినిమా పరిశ్రమ అనుకూలంగా ఉంది. హీరో విశ్వక్సేన్ మితిమీరిన ఆత్మవిశ్వాసం మరియు TFI మెగా మాఫియా నిర్మాతలకు డబ్బు వృధా చేస్తున్నాయి. BookMyShow యొక్క గ్రీన్ స్టేటస్ నుండి రుజువు ఇక్కడ ఉంది.. యావరేజ్ టాక్ కు అందుకోలేదు అని మరొకరు ట్వీట్ చేశారు..

 

Also Read:  రాజ్ తరుణ్‌కు క్షమాపణలు.. తన కాళ్లు పట్టుకుంటా: లావణ్య

మొత్తానికి ఈ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ అయితే రాలేదు.. లేడీ గెటప్ తో కొత్తగా అయితే ట్రై చేశాడు. కానీ స్టోరీలో పస లేదు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొదటి షో టాక్ ఇలా ఉంది. రెండో షోకు టాక్ మారుతుందేమో చూడాలి..

 

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×