E-Paper
Advertisement

Thandel Movie Launch : పాన్ ఇండియా మూవీ .. ముహూర్తం ఫిక్స్ .. ఈసారైనా లక్ కలిసి వచ్చేనా..

Thandel Movie Launch : పాన్ ఇండియా మూవీ .. ముహూర్తం ఫిక్స్ .. ఈసారైనా లక్ కలిసి వచ్చేనా..
Advertisement

Thandel Movie Launch : అక్కినేని నాగ చైతన్య ,చందు మొండేటి కాంబోలో రాబోతున్న సరికొత్త చిత్రం తండేల్. ఇందులో నాగచైతన్య ఓ మత్స్యకారుడి గెటప్ లో వెరైటీగా కనిపించనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఇందులో నాగచైతన్య ,సాయి పల్లవి హిట్ కాంబోలో నటించనున్నారు. ఇంతకుముందు వీరిద్దరూ నటించినా.. లవ్ స్టోరీ మూవీ నాగచైతన్య కెరీర్ కు మంచి బూస్ట్ ఇచ్చింది. ప్రస్తుతం సాలిడ్ హిట్ కోసం ప్రయత్నిస్తున్న నాగచైతన్యకు తిరిగి సాయి పల్లవి లక్కీ హీరోయిన్ అవుతుంది అని అక్కినేని అభిమానులు ఆశిస్తున్నారు.

ఇక మొన్నటి వరకు ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ లో బిజీగా ఉన్న ఈ సినిమాకి సంబంధించి ముహూర్తం మేకర్స్ ఈ రోజు ఖరారు చేశారు. ఇక ఈ ముహూర్తానికి.. నాగచైతన్య మేనమామ విక్టరీ వెంకటేష్ తో పాటు కింగ్ నాగార్జున అతిథులుగా వచ్చారు. కార్తికేయ 2 చిత్రంతో ఎవరు ఊహించని విధంగా పాన్ ఇండియా ఆడియన్సును మెప్పించడమే కాకుండా.. సినీ ఇండస్ట్రీలో తన సత్తా చాటాడు చందు మొండేటి. ఇక అతని డైరెక్షన్లో వస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం హిట్ కోసం ఎదురుచూస్తున్న నాగచైతన్య కెరియర్ కి మంచి సక్సెస్ అందిస్తుంది అని అందరూ ఆశిస్తున్నారు.

Advertisement

ఇంతకుముందు వీరిద్దరి కాంబోలో వచ్చిన ప్రేమమ్, సవ్యసాచి సినిమాలు.. చైతు కెరీర్ కి మంచి పుష్ ఇచ్చాయి. ఇక ఈ కాంపౌండ్ రాబోతున్న మూడవ చిత్రం కావడంతో ఇది హ్యాట్రిక్ సాధిస్తుందని అందరూ భావిస్తున్నారు. ఈ మూవీ కోసం నాగచైతన్య ఫిషర్ మాన్ గెటప్ లో కంప్లీట్ మేకోవర్ తో ఉన్నాడు. చైతు గెటప్ చూస్తే ఈ మూవీ కోసం ఎంత డెడికేటెడ్ గా వర్క్ చేస్తున్నాడో అర్థమవుతుంది. యాంగ్రీ యంగ్ మ్యాన్ లుక్స్ తో ..గుబురు గడ్డంతో.. మంచి మాస్ లుక్ తో అందరిని సర్ప్రైజ్ చేస్తున్నాడు ఈ అక్కినేని అందగాడు.

నాగచైతన్య గీతా ఆర్ట్స్ బ్యానర్ పై 100% లవ్ సినిమా చేసి మంచి సక్సెస్ అందుకున్నాడు. ఇప్పుడు అతను చేస్తున్న ఈ తండేల్ మూవీ కూడా అంతకుమించి బ్లాక్ బస్టర్ ఇవ్వడానికి రెడీ అవుతోంది. రీసెంట్గా నాగచైతన్య నటించిన దూత అనే వెబ్ సిరీస్ తో.. అతనికి క్రేజ్ బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ఎంతవరకు సక్సెస్ సాధిస్తుందో చూడాలి. నెక్స్ట్ ఇయర్ సెకండ్ హాఫ్ లో సినిమా రిలీజ్ అయ్యేవిధంగా మేకర్స్ షెడ్యూల్ ని ప్లాన్ చేస్తున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×