BigTV English

Thandel: ‘తండేల్’ లో ఆ ఒక్కటే మైనస్.. లేకుంటే బొమ్మ సూపర్ హిట్టే..?

Thandel: ‘తండేల్’ లో ఆ ఒక్కటే మైనస్.. లేకుంటే బొమ్మ సూపర్ హిట్టే..?

Thandel : అక్కినేని యంగ్ హీరో యువ సామ్రాట్ నాగచైతన్య హిట్ సినిమా కోసం గత కొన్ని ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. బంగార్రాజు తర్వాత వచ్చిన సినిమాలు యావరేజ్ టాక్ ని అందుకోవడంతో చైతు ఖాతాలో హిట్ సినిమా పడలేదు. ఇప్పుడు సినిమాలకు కాస్త గ్యాప్ తీసుకొని అదిరిపోయే కథతో ప్రేక్షకులు ముందుకు వచ్చేసాడు. కార్తికేయ 2 తో బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని అందుకున్న డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ మూవీని చేశాడు. నాచురల్ బ్యూటీ సాయి పల్లవి ఈ సినిమాలో నాగచైతన్య సరసన జోడిగా నటించింది.. వీరిద్దరి కాంబోలో ఇది రెండో సినిమా గతంలో వచ్చిన లవ్ స్టోరీ సినిమా పర్వాలేదనిపించింది. ఇక ఈ మూవీ ఎలాంటి టాక్ని సొంతం చేసుకుందో? ప్రేక్షకులు ఏమంటున్నారో? ఇప్పుడు మనం తెలుసుకుందాం..


తండేల్ మూవీ స్టోరీ.. 

నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ తండేల్.. ఇవాళ ఈ సినిమా థియేటర్లలోకి వచ్చేసింది.. మొదటి షో నుంచే మంచి టాక్ ని సొంతం చేసుకున్న మూవీ ప్రస్తుతం థియేటర్లలో పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ సినిమా కథ విషయానికొస్తే శ్రీకాకుళంలో జీవించే మత్స్యకారుల పరిస్థితిని ఆధారంగా చేసుకొని చాలా రియలెస్టిక్ గా సినిమా తీశారు.. చేపలు పడుతూ కొంతమంది మత్స్యకారులు పాకిస్తాన్ బార్డర్ దాకా వెళ్లి అక్కడి కోస్ట్ గార్డుకు చిక్కి శిక్ష అనుభవించారు.. దీన్ని ఆధారంగా చేసుకుని చందు మొండేటి అద్భుతంగా సినిమాను ప్రేక్షకులకు చూపించాడు. ఈ మూవీ కోసం నాగచైతన్య కూడా చాలా కష్టపడ్డాడు. మత్స్యకారుల జీవితం ఎలా ఉంటుంది అనే అంశం ఆధారంగా ఈ సినిమాని డైరెక్టర్ ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చారు. స్టోరీ లైన్ అయితే కొత్తగా ఉంది దాంతో ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఏ సినిమాలో అయినా ప్లస్ పాయింట్లతో పాటు మైనస్ పాయింట్ల కూడా ఉంటాయి. తండేల్ మూవీలో డైరెక్టర్ చేసిన అతి పెద్ద మిస్టేక్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..


డైరెక్టర్ చేసిన మిస్టేక్..? 

ఈ మూవీ మొత్తం చూస్తుంటే రియల్ గా మత్స్యకారులను చూసినట్టే అనిపిస్తుంది. ఆ పాత్రలో నాగచైతన్య నటించడమే కాదు జీవించేశారు. అంతేకాకుండా ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ మరో కలిసి వచ్చే అంశమని చెప్పవచ్చు. ఇక ఎంతో ఎనర్జీటిక్ గా నటిస్తూ డాన్స్ చేసే సాయి పల్లవి హీరోయిన్ గా తీసుకొని డైరెక్టర్ మంచి పని చేశాడు. ఇందులో నాగచైతన్య పాకిస్తాన్ వాళ్లకు తిట్టిన తర్వాత ఆయన ఇండియాపై చూపించే ప్రేమను అద్భుతంగా చూపించారు. మొత్తానికి సముద్రంపై తీసే సీన్లు చాలా రియల్ గా ఉంటాయి.. మొత్తానికి సినిమా మొదటి భాగం కంటే రెండో భాగం క్లైమాక్స్ వేరే లెవెల్ అని చెప్పవచ్చు… అయితే ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ తో పాటు మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయని ప్రేక్షకులు అంటున్నారు. నాగచైతన్య క్యారెక్టర్ ని పెద్దగా చూపించలేదు సాయి పల్లవి హైలైట్ అయినట్టుగా హీరో హైలెట్ కాలేదని అక్కినేని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.. మైనస్ పాయింట్స్ విషయానికొస్తే.. సాయి పల్లవి నాగచైతన్య మధ్య సాయి లవ్ స్టోరీ బాగా లాగి చూపించారని చెప్పవచ్చు. అంతేకాకుండా సినిమా స్టార్ట్ అయిన మొదటి కొన్ని నిమిషాల పాటు చాలా బోరింగ్ అనిపిస్తుంది.. పాకిస్తాన్ వాళ్ళు పట్టుకున్న ఎపిసోడ్ ను ఇంకాస్త బాగా తీసింటే బాగుండేది అని ఆడియన్స్ రివ్యూ ఇస్తున్నారు. ప్రస్తుతానికైతే ఈ మూవీ పర్వాలేదనిపిస్తుంది. ఇక ఈ మూవీ బిజినెస్ కూడా బాగా జరిగింది. కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి..

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×