BigTV English

The Lady Killer: స్టార్ హీరో సినిమా.. రూ. 45 కోట్లు పెట్టి తీస్తే..

The Lady Killer: స్టార్ హీరో సినిమా.. రూ. 45 కోట్లు పెట్టి తీస్తే..

The Lady Killer: ఇండస్ట్రీలో హీరోలకు విజయాపజయాలు లేకుండా ఉండవు. కొన్నిసార్లు హిట్ అందుకోవడం.. ఇంకొన్నిసార్లు ప్లాప్ లను రుచిచూడడం వారికి అలవాటే. అయితే ఎంత ప్లాప్ అయినా కానీ, స్టార్ హీరోస్ కి కలక్షన్స్ విషయంలో మాత్రం రికార్డులు సృష్టిస్తారు. డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న సినిమా కూడా కోట్లు రాబడుతుంది. కానీ, ఒక స్టార్ హీరో సినిమా మాత్రం కోట్లు కాదు కదా లక్ష కూడా రాబట్టలేకపోయింది. ఆ హీరో ఎవరు అంటే.. అర్జున్ కపూర్.


బోనీ కపూర్ వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన అర్జున్ కపూర్ ఖాతాలో సరైన హిట్ ఒక్కటి కూడా పడింది లేదు. అయినా సినిమాల మీద సినిమాలు చేస్తూ విజయం కోసం పరితపిస్తూనే ఉన్నాడు. ఇక ఈ నేపథ్యంలోనే అతడు నటించిన చిత్రం ది లేడీ కిల్లర్. గత ఏడాది రిలీజ్ అయిన ఈ సినిమాకు అజయ్ బేహల్ దర్శకత్వం వహించగా.. అర్జున్ కపూర్ సరసన భూమి పెడ్నేకర్ నటించింది.

నిజం చెప్పాలంటే అసలు ఈ సినిమా ఎప్పుడు వచ్చిందో కూడా ఎవరికి తెలియదు. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని రూ. 45 కోట్లు పెట్టి నిర్మించారు. ఇక ప్రమోషన్స్ కూడా బాగానే చేశారు. అవి కూడా కలుపుకొని మొత్తం రూ 2 కోట్ల వరకు ఖర్చు చేశారట. ఇది గతేడాది నవంబర్ 3 న థియేటర్లలో రిలీజ్ అయ్యింది. మొదటి డే నుంచి లెక్కేసుకున్నా ఈ సినిమా టోటల్ గా కేవలం రూ.70 వేల కలెక్షన్లు మాత్రమే అందుకుంది.


ఇప్పటివరకు బాలీవుడ్ లో ఇలాంటి పరమ చెత్త సినిమా లేదని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. అసలు విషయం ఏంటంటే.. ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి కాకుండా రిలీజ్ చేశారట. సినిమా పాజిటివ్ టాక్ వస్తే ఇంకొన్ని సీన్స్ యాడ్ చేద్దామనుకున్నారట. ఈ కళాఖండం రిలీజ్ అయ్యిన రోజే డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో మేకర్స్ సైతం సైలెంట్ అయ్యిపోయారట. స్టార్ హీరో అయినా అర్జున్ కపూర్ కెరీర్ లోనే కాదు ఇండియా మొత్తంలో ఇలాంటి డిజాస్టర్ సినిమా రాలేదని తెలుస్తోంది.

Tags

Related News

Alekhya Chitti pickles: పిక్‌నిక్‌కి వెళ్లి పికిల్స్ తినడం ఏంట్రా… మీ ప్రమోషన్స్ పాడుగాను!

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

Big Stories

×