Anna Beatriz Pereira : ఓన్లీ ఫ్యాన్స్ స్టార్ అన్నా బీట్రిజ్ పెరీరా అల్వెస్ (Anna Beatriz Pereira Alves) ప్రమాదవశాత్తూ బాల్కనీ నుండి పడి, చనిపోయిందన్న వార్త తాజాగా బయటకు వచ్చింది. అయితే నిజంగానే ఆమె పొరపాటున కాలు జారి బాల్కనీ నుంచి పడిపోయిందా, లేదంటే ఇది హత్యా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
చిన్న వయసులోనే తిరిగాని లోకాలకు…
బ్రెజిల్ కు చెందిన పో*ర్న్ స్టార్ అన్నా బీట్రిజ్ పెరీరా అల్వెస్ (Anna Beatriz Pereira Alves) హోటల్ రూమ్లో షూటింగ్ కు వెళ్లినట్టుగా తెలుస్తోంది. అయితే షూటింగ్ అనంతరం ఆమె భవనంపై నుంచి కాలు జారి, కింద పడి మృతి చెందింది అని అంటున్నారు. ఆమె వయసు కేవలం 27 ఏళ్లు మాత్రమే. ప్రస్తుతానికి ఈ కేసును పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు.
హత్యా ? ప్రమాదమా ?
ఈనెల 23న నోవా ఇగాకులోని ఓ హోటల్ గదిలో అన్నా బీట్రిజ్ (Anna Beatriz Pereira Alves) షూటింగ్ కు వెళ్ళింది. అక్కడ మరో ఇద్దరు పురుషులతో పాటు ఈ అమ్మాయిపై ఓ సీన్ ను షూట్ చేసినట్టు తెలుస్తోంది. అయితే షూటింగ్ పూర్తి కాగానే బాల్కనీలోకి వచ్చిన అన్నా బీట్రిజ్, అక్కడి నుంచి ప్రమాదవశాత్తూ కిందపడి చనిపోయిందని చెబుతున్నారు. ఇక ఈ విషయాన్ని ఆమె ఫ్యామిలీ మెంబర్స్ కు తెలియజేయడానికి ఏకంగా వారం రోజుల టైం పట్టిందట. మరోవైపు కేసు దర్యాప్తు చేస్తున్న బ్రెజిల్ పోలీసులు అన్నా బీట్రిజ్ తో పాటు షూటింగ్లో పాల్గొన్న మరో ఇద్దరు నటులను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. విచారణ అనంతరం వాళ్లను వదిలేసిన పోలీసులు… వాళ్ల నుంచి అసలు ఏం జరిగిందనే సమాచారాన్ని రాబట్టినట్టుగా తెలుస్తోంది.
అనుమానాస్పద మృతిగా…
ఇక పోలీసులు ఈ అన్నా బీట్రిజ్ (Anna Beatriz Pereira Alves) మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, దీన్ని ఒక అనుమానాస్పద మృతిగా చూస్తున్నామని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఇందులో ఏదైనా కుట్ర దాగి ఉందా? అనే విషయాన్ని పరిశీలిస్తున్నామని వెల్లడించారు. మరోవైపు ఆమె స్నేహితులు, సన్నిహితులు అన్నా బీట్రిజ్ ఫ్యూచర్ గురించి ఎన్నో కలలు కన్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బాయ్ ఫ్రెండ్ రియాక్షన్…
అన్నా బీట్రిజ్ (Anna Beatriz Pereira Alves) కి బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు. అతని పేరు పెడ్రో హెన్రిక్. అతను తన గర్ల్ ఫ్రెండ్ అన్నా బీట్రిజ్ మరణం గురించి మాట్లాడుతూ ఇది తనకు తీరని లోటని ఆవేదనను వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఇది ప్రమాదమా ? లేకపోతే ఏదైనా కుట్ర దాగి ఉందా ? అనే విషయం దర్యాప్తులో తేలుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇక అన్నా చనిపోయింది అని తెలిసిన ఆమె అభిమానులు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. ఆన్‌లైన్ లో ఓన్లీ ఫ్యాన్స్ స్టార్ అన్నా బీట్రిజ్ పెరీరా అల్వెస్ ‘అన్నా పాలీ’ అనే పేరుతో పాపులర్ అయ్యింది.