Pumpkin Leaves: గుమ్మడి ఆకుల్లో అనేక పోషకాలు ఉంటాయి. గుమ్మడికాయ ఆకులు మహిళల ఆరోగ్యానికి ఒక వరం. గుమ్మడికాయలే కాదు వీటి ఆకులు కూడా చాలా రుచికరమైనవి. ఇవి ముఖ్యంగా మహిళల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి. గుమ్మడి ఆకులు మానసిక కల్లోలం నుండి రక్తహీనతతో పాటు అనేక సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తాయి. గుమ్మడి ఆకులను తినడం వల్ల మహిళలకు కలిగే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
గుమ్మడికాయ ఆకుల్లో ఫ్లేవనాయిడ్స్, ఫినాలిక్ సమ్మేళనాలతో పాటు బీటా కెరోటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి దీనితో పాటు, కాల్షియం, మాంగనీస్, విటమిన్ B6 , ఫాస్పరస్ కూడా ఇందులో ఉంటాయి. ఈ పోషకాలన్నీ శారీరక , మానసిక అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.
ప్రీమెన్‌స్ట్రువల్ సిండ్రోమ్:
ఈ రోజుల్లో చాలా మంది మహిళలకు ప్రీమెన్‌స్ట్రల్ సిండ్రోమ్ పెద్ద సమస్యగా మారిపోయింది. ఈ సమస్యతో బాధపడుతున్న స్త్రీలు మూడ్ స్వింగ్స్, తలనొప్పి, డిప్రెషన్ , చిరాకు మొదలైన సమస్యలతో బాధపడుతున్నారు. దీని నుండి ఉపశమనం పొందడానికి మహిళలు మాంగనీస్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలని సూచించారు. గుమ్మడి ఆకులలో మాంగనీస్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఈ సమస్యలో ఉన్న మహిళలకు ఉపశమనం ఇస్తుంది.
మలబద్ధకం:
మలబద్ధకంతో బాధపడుతుంటే గుమ్మడికాయ ఆకులు ప్రయోజనం చేకూరుస్తాయి. ఫైబర్ అధికంగా ఉండే గుమ్మడి ఆకులను తీసుకోవడం వల్ల మలబద్ధకం నుండి ఉపశమనం పొందవచ్చు. మలాన్ని మృదువుగా చేయడంతో పాటు, ప్రేగు కదలిక ప్రక్రియను ఇవి సులభతరం చేస్తుంది. మలబద్దకం సమస్యతో ఇబ్బంది పడే వారు గుమ్మడి ఆకులను తినడం వల్ల అద్భుత ప్రయోజనాలు ఉంటాయి.
బలమైన ఎముకలు:
గుమ్మడి ఆకులలో కాల్షియం, ఫాస్పరస్ పుష్కలంగా ఉండటం వల్ల, ఇది మీ ఎముకలను బలపరుస్తుంది. అంతే కాకుండా దంతాల అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల కీళ్ల, ఎముకల నొప్పుల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు. ఎముకలు బలంగా ఉండటానికి తరచుగా గుమ్మడి ఆకులను తినడం చాలా మంచిది.
రక్తహీనత:
గుమ్మడి ఆకులలో మంచి మొత్తంలో ఐరన్ ఉండటం వల్ల రక్తహీనత నయమవుతుంది. పీరియడ్స్ నొప్పి నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది. రక్త హీనతో బాధపడుతున్న వారు గుమ్మడి ఆకులను తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. గుమ్మడి ఆకుల్లోని పోషకాలు రక్త హీనత నుండి బయటపడటానికి ఎంతగానో ఉపయోగపడతాయి. అంతే కాకుండా కొత్త రక్త కణాల పెరుగుదలకు ఉపయోగపడతాయి.
Also Read: జలుబుతో ఇబ్బంది పడుతున్నారా ? ఈ టిప్స్ మీ కోసమే !
కొలెస్ట్రాల్:
గుమ్మడి ఆకులలో ఉండే కరిగే ఫైబర్ చిన్న ప్రేగుల నుండి కొలెస్ట్రాల్ , బైల్ యాసిడ్స్ శోషణను తగ్గిస్తుంది. తద్వారా రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. రక్తంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించడం ద్వారా, ఫైబర్ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుదలతో ఇబ్బంది పడుతున్న వారు గుమ్మడి ఆకులను తరుచుగా తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఆహార పదార్థాల తయారీలో కూడా గుమ్మడి ఆకులను వాడటం కూడా ప్రభావవంతగా ఉంటుంది.