BigTV English

Crime Thriller OTT : ఆన్‍లైన్ మోసాలు చేసే గ్యాంగ్‍ ఆట కట్.. మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్..

Crime Thriller OTT : ఆన్‍లైన్ మోసాలు చేసే గ్యాంగ్‍ ఆట కట్.. మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్..

Crime Thriller OTT : ఈ మధ్య కాలంలో థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాల కన్నా ఓటీటీలో కొత్త కొత్త కథలతో వస్తున్న సినిమాలు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నాయి. థియేటర్లలో మిస్ అయ్యిన సినిమాలను ఓటీటీలోకి చూడాలని ఫ్యాన్స్ అనుకుంటారు. అదే విధంగా ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చిన సినిమాలను మిస్ అవ్వకుండా చూస్తారు.. ఎప్పుడు సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. అందులో ఎక్కువగా మూవీ లవర్స్ హారర్, క్రైమ్, థ్రిల్లర్ మూవీలను ఎక్కువగా ఇష్ట పడతారు. పలు ఓటీటి సంస్థలు కూడా క్రైమ్ థ్రిల్లర్ మూవీలను ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇండియన్ సినిమాలను మాత్రమే కాదు కొరియన్ సినిమాలు కూడా తెలుగులో డబ్ అయ్యి ఓటీటి రిలీజ్ అవుతున్నాయి. తాజాగా మరో మూవీ ఓటీటిలోకి వచ్చేస్తుంది. ఆ హారర్ క్రైమ్ మూవీ పేరేంటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూద్దాం..


కొరియన్ మూవీలకు ఇంగ్లీష్ టైటిల్స్ వస్తుంటాయి. ఆ మూవీలు చాలా ఆసక్తిగా ఉంటాయి. ఇక ఓటీటీల్లో ఈ సినిమాలకు డిమాండ్ ఏ రేంజులో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. స్ట్రీమింగ్‍కు కొత్త కొరియన్ సినిమాలు ఏవి వస్తాయా అని చాలా మంది ఎదురుచూస్తుంటారు. తాజాగా ఓ కొరియన్ క్రైమ్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది.. ఆ మూవీ నేమ్ ది రౌండప్: పనిష్మెంట్ చిత్రం స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. మా డాంగ్ సియోక్ ప్రధాన పాత్ర పోషించిన ఈ మూవీకి హియో మ్యుంగ్ హయెంగ్ దర్శకత్వం వహించారు. అక్కడ సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ లవర్స్ కు తెగ నచ్చేసిందని తెలుస్తుంది..

ఈ క్రైమ్ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. కొరియన్‍తో పాటు ఇంగ్లిష్, తెలుగు, హిందీ, తమిళంలోనూ ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది.. ఈ మూవీని ముందుగా బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్‍లో ప్రదర్శించారు. ఆ తర్వాత ఈ ఏడాది ఏప్రిల్ 24వ తేదీన కొరియన్‍లో థియేటర్లలో రిలీజ్ అయింది.. అక్కడ మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇక దాదాపుగా 83.5 మిలియన్ డాలర్ల కలెక్షన్లతో దుమ్మురేపింది. ఈ ఏడాదిలో అత్యధిక వసూళ్లు సాధించిన కొరియన్ మూవీగా నిలిచింది. బ్లాక్‍బస్టర్ కొట్టింది. ఈ మూవీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. ఇక్కడ పాజిటివ్ టాక్ ను అందుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి.


ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే.. ఆన్‍లైన్ గ్యాంబ్లింగ్, క్రిప్టో కరెన్సీ మోసాలు చేసే గ్యాంగ్‍ ఆట కట్టించేందుకు ఓ డిటెక్టివ్ చేసే ప్రయత్నాల చుట్టూ ది రౌండప్: పనిష్మెంట్ సినిమా సాగుతుంది. 2015లో థాయ్‍ల్యాండ్‍లో జరిగిన పట్టాయా మర్డర్ కేసు ఆధారంగా ఈ మూవీని తెరకేక్కించారు. దక్షిణ కొరియా, ఫిలిప్పీన్స్ చుట్టూ ఈ మూవీ సాగుతుంది. యాక్షన్, క్రైమ్, థ్రిలింగ్ సీన్లతో, మైండ్ బ్లాక్ చేసే క్లైమాక్స్ తో మూవీ స్టోరీ సాగుతుందని తెలుస్తుంది. అక్కడ సక్సెస్ అయిన ఈ మూవీ ఇక్కడ ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి..

Tags

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×