BigTV English

Sukumar On Ram Charan : రామ్ చరణ్ కి ఖచ్చితంగా నేషనల్ అవార్డు వస్తుంది

Sukumar On Ram Charan : రామ్ చరణ్ కి ఖచ్చితంగా నేషనల్ అవార్డు వస్తుంది

Sukumar On Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చరణ్ కి ఎంత గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సింది అవసరం లేదు. చిరుత సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు రామ్ చరణ్. అయితే మొదటి సినిమా తోనే తనలోని టాలెంట్ ని బయటికి తీసి చిరు తనయుడు అనిపించుకున్నాడు. కేవలం నటనలోనే కాకుండా డాన్సుల్లో కూడా ఇరగదీసాడు అని చాలామంది ప్రశంసలను అందించారు. చిరుత సినిమా తర్వాత రామ్ చరణ్ చేసిన సినిమా మగధీర. ఈ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఆల్ టైం రికార్డ్ ను సృష్టించాడు చరణ్. అయితే ఈ సినిమా తర్వాత చరణ్ ఏకంగా స్టార్ హీరో అయిపోయాడు అని చెప్పొచ్చు. తన రెండవ సినిమాతోనే మంచి రికార్డులను తన సొంతం చేసుకున్నాడు. ఈ సినిమా తర్వాత ఆరెంజ్ సినిమా రిలీజ్ అయింది.


అయితే ఆరెంజ్ సినిమాకు ఉన్న క్రేజ్ గురించి ఇప్పుడు ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మగధీర సినిమా తర్వాత వస్తున్న సినిమా కావడం. అప్పటికే ఈ సినిమా పాటలు మారుమోగిపోవడం. చరణ్ లుక్స్ కూడా ఈ సినిమాలో అద్భుతంగా అనిపించడం. ఇవన్నీ కూడా ఈ సినిమా పైన మంచి ఎక్స్పెక్టేషన్స్ని పెంచాయి. అయితే థియేటర్ కి వెళ్లిన ప్రేక్షకులకి ఈ సినిమాతో నిరాశ ఎదురయిందని చెప్పొచ్చు. ఇకపోతే చరణ్ తర్వాత చాలా సినిమాలు చేశాడు. ఎవడు, రచ్చ, నాయక్, జంజీర్, గోవిందుడు అందరివాడే వంటి సినిమాలు చరణ్ కి ఒక మోస్తరుగా ఆడాయి అని చెప్పొచ్చు. అయితే తమిళ్ తనివరున్ కి రీమేక్ గా వచ్చిన ధ్రువ సినిమా అద్భుతమైన ఘనవిజయాన్ని సాధించింది. చరణ్ లోని మరో కోణాన్ని బయటకు తీసింది ఆ సినిమా.

Also Read : Sankranthiki Vasthunnam: రమణ గోగుల రీ ఎంట్రీ బ్లాక్ బస్టర్


అయితే ప్రతి హీరో కెరియర్ లో తన దిశను మార్చే సినిమా ఒకటి ఉంటుంది. అలా చరణ్ విషయానికి వస్తే రంగస్థలం అని చెప్పొచ్చు. రామ్ చరణ్ లోని పరిపూర్ణమైన నటుడును బయటకు తీసిన సినిమా రంగస్థలం. కేవలం రామ్ చరణ్ లోనే కాకుండా, సుకుమార్ ఇలాంటి సినిమాలు కూడా తీయగలడు అని నిరూపించిన సినిమా రంగస్థలం. రంగస్థలంలో ప్రతి ఎలిమెంట్ కూడా అద్భుతంగా వర్కౌట్ అయింది. చరణ్ లోని ఇంత టాలెంట్ ఉందా అని చాలామందికి ఆ సినిమాలోని రుజువైంది. రీసెంట్ గా చరణ్ నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్. ఈ సినిమా జనవరి 10న రిలీజ్ కానుంది ఈ తరుణంలో ఈ సినిమా ఈవెంట్ ను అమెరికాలో జరిపించారు. ఈవెంట్ లో సుకుమార్ మాట్లాడుతూ క్లైమాక్స్ చాలా బాగా చేశాడు. ఈ సినిమాతో చరణ్ కి నేషనల్ అవార్డు వస్తుంది అంటూ నమ్మకాన్ని తెలిపాడు సుకుమార్.ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత మళ్లీ సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ మరో సినిమా చేయనున్నాడు.

Also Read : Mohan Babu : ప్రభాస్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఆనందం

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×