Central Bank Jobs: నిరుద్యోగులకు ఇది గుడ్ న్యూస్. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ (రిక్రూట్‌మెంట్ అండ్ ప్రమోషన్), సెంట్రల్ ఆఫీస్ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ ద్వారా రెగ్యులర్ ప్రాతిపదికన సీబీఐ శాఖల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఉద్యోగాల సంఖ్య: 62
ఇందులో పలు రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
విద్యార్హత: బీఈ, బీటెక్ (కంప్యూటర్ సైన్స్/ కంప్యూటర్ అప్లికేషన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్/ డేటా సైన్స్) ఎంసీఏ/ ఎంఎస్సీ (కంప్యూటర్) ఉత్తీర్ణతతో పాటు కనీసం ఆరేళ్ల పని అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: ఎలాంటి రాత పరీక్ష లేదు. అర్హులైన అభ్యర్థులను ఇంటర్వ్యూ ప్రక్రియ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు: రూ.750( ఎస్సీ, ఎస్టీ,దివ్యాంగ అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది)
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేది: జనవరి 12
Also Read:Jobs Notifications: గుడ్ న్యూస్.. బీటెక్ అర్హతతో ఉద్యోగాలు..
ఇంటర్వ్యూ తేదీలు: 2025, జనవరి చివరి వారంలో జరగనున్నాయి.
ఆసక్తి గల అభ్యర్థులు ఇంటర్వూకి హాజరవ్వండి.