E-Paper
Advertisement

‘Love Me’ Trailer: ఆమెను ఎవరు రెండుసార్లు చూసింది లేదు.. భయపెడుతున్న లవ్ మీ ట్రైలర్

‘Love Me’ Trailer: ఆమెను ఎవరు రెండుసార్లు చూసింది లేదు.. భయపెడుతున్న లవ్ మీ ట్రైలర్
Advertisement

“Love me If You Dare” Movie Trailer Released: కుర్ర హీరో ఆశిష్, బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య జంటగా అరుణ్ భీమవరపు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం లవ్ మీ.. ఇఫ్ యూ డేర్ అనేది ట్యాగ్ లైన్. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై హర్షిత్ రెడ్డి, హన్సితారెడ్డి, నాగ మల్లిడి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈపాటికే ఈ చిత్రం రిలీజ్ కావాల్సి ఉండగా కొన్ని కారణాల వలన వాయిదా పడింది. ఇక ఈ చిత్రం మే 25 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ అందులో భాగంగా నేడు ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

ట్రైలర్ ఆద్యంతం భయపెడుతుంది. మొదటి నుంచి దెయ్యంతో ప్రేమకథ అని చెప్పుకుంటూ రావడంతో సినిమాపై హైప్ పెరుగుతూ వచ్చింది. ఈ ట్రైలర్ ఆ హైప్ ను ఇంకా పెంచింది. “ఆరోజు రాత్రి సరిగ్గా 8 గంటలకు ఒక అలారం మోగుతుంది” అని ఒక అమ్మాయి బేస్ వాయిస్ తో ట్రైలర్ మొదలయ్యింది. అర్జున్ కు ప్రతిదీ తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువ. ఎవరైనా అది చేయోద్దు అని చెప్తే అది చేసేదాకా వదిలిపెట్టడు. డేంజర్ అనే పదం వినిపిస్తే చాలు అసలు అక్కడ డేంజర్ ఏముంది అని తెలుసుకోవడానికి అక్కడికే వెళ్తాడు.

Advertisement

అలాంటి అర్జున్ కు.. దివ్యావతి అనే దెయ్యం గురించి తెలుస్తుంది. ఆమెను ఎవరైనా పిలిస్తే చంపకుండా వదిలిపెట్టదు అనేది ఆ ఊరి నమ్మకం. ఇది విన్న అర్జున్.. దివ్యావతి ఉన్న బంగ్లాకు వెళ్లి.. ఆమెను పిలుస్తాడు. ఆమెను ప్రేమించమని కోరతాడు. అలా దెయ్యంతో ప్రేమకథ మొదలవుతున్నట్లు చూపించారు. దెయ్యం చంపడానికి వచ్చినా అర్జున్ ప్రేమతో ఆమెను మారుస్తాడు. మరి చివరికి దివ్యావతిని అర్జున్ ప్రేమలోకి దించుతాడా.. ? అసలు దివ్యావతి ఎందుకు దెయ్యంగా మారింది.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

Also Read: Nagababu: నాగబాబు వర్సెస్ అల్లు అర్జున్.. ఇప్పట్లో ఆగేలా లేదే.. ?

Advertisement

ఇప్పటివరకు ఈ సినిమాలో వైష్ణవి చైతన్యనే దెయ్యంగా మారుతుంది అనుకున్నారు. కానీ ట్రైలర్ లో మరో హీరోయిన్ సిమ్రాన్ చౌదరిని చూపించడంతో దెయ్యం ఆమెనే అని తెలుస్తోంది. ఇక ట్రైలర్ అంతా ఒక ఎత్తు అయితే.. కీరవాణి సంగీతం మరో ఎత్తు అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ ట్రైలర్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో ఆశిష్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×