Nagababu Vs Allu Arjun: మెగా- అల్లు కుటుంబాల మధ్య వైరం ఉందన్న వార్తలు ఇప్పుడు కాదు ఎన్నో ఏళ్లుగా వినిపిస్తున్న మాట. చిరంజీవి లేకపోతే అల్లు అర్జున్ ఎక్కడ అని అంటే.. అసలు అల్లు రామలింగయ్య లేకపోతే చిరంజీవి ఎక్కడ అనే ప్రశ్న ఎదురవుతుంది. ఇలా ఈ రెండు కుటుంబాల మధ్య ఒకరు ఎక్కువ అంటే ఇంకొకరు ఎక్కువ అనే పోటీ ఎప్పటినుంచో ఉంది. అయితే బయటపడడంలేదు కానీ ఆ రెండు కుటుంబాల మధ్య కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది. ఇక ఈ మధ్య ఈ కోల్డ్ వార్ ను మెగా బ్రదర్ నాగబాబు బట్టబయలు చేశాడు.
ఏపీ ఎలక్షన్స్ కు ముందు అల్లు అర్జున్ చేసిన ఒక పని మెగా ఫ్యాన్స్ ను దారుణంగా హర్ట్ చేసింది. జనసేనాని పవన్ కు సపోర్ట్ చేస్తున్నట్లు ట్వీట్ చేసిన బన్నీ.. ఆ తరువాత వైసీపీ క్యాండిడేట్ అయిన శిల్ప రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్లి ఆయన తరుపున ప్రచారం చేశాడు. అయితే అది కేవలం ఫ్రెండిష్ కోసం మాత్రమే అని.. వేరే ఉద్దేశ్యం లేదని బన్నీ చెప్పుకొచ్చాడు. అయితే మెగా ఫ్యాన్స్ మాత్రం.. పవన్ కు సపోర్ట్ గా ట్వీట్ చేసి .. ఆయనకు సపోర్ట్ గా ఇంటికి వెళ్లడం ఏంటి అని ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే నాగబాబు చేసిన ఒక ట్వీట్ మరింత హీట్ ను పెంచింది.
Also Read: Actor Chandu wife Shilpa : ఆమె వల్లే దూరమయ్యాం.. సంచలన విషయాలు బయటపెట్టిన నటుడు చందు భార్య
“మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే.. మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే ” అంటూ రాసుకొచ్చాడు. ఈ ట్వీట్ అల్లు అర్జున్ ను ఉద్దేశించే నాగబాబు ఆ ట్వీట్ చేశాడని బన్నీ ఫ్యాన్స్ అనుకోని.. నాగబాబుకు సోషల్ మీడియాలో చుక్కలు చూపించినట్లు తెలుస్తోంది. దీంతో చేసేదేమి లేక నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నే డిలీట్ చేశాడు. బయట విషయం పక్కన పెడితే.. మెగా ఇంట్లో కూడా ఈ ట్వీట్ గురించి పెద్ద గొడవే అయ్యినట్లు తెలుస్తోంది. అందుకే నాగబాబు సైలెంట్ గా ఈ పని చేసినట్లు సమాచారం. ఏదిఏమైనా మెగా ఇంట అల్లు రచ్చ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉందని తెలుస్తోంది. మరి ఈ వివాదానికి ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతుంది అనేది చూడాలి.