Rain Effect to Sunrisers Hyderabad – Gujarat Titans Match: ఐపీఎల్ సీజన్ 2024 లో ఇన్నాళ్లూ ప్రశాంతంగా జరిగిన మ్యాచ్ ల మధ్యలోకి వరుణుడు నెమ్మదిగా ఎంటర్ అవుతున్నాడు. ఐపీఎల్ మొదట్లో వర్షాలు పడినా బాగుండేది, అన్ని జట్లు సర్దుకుని, లెక్కలు చూసుకుని జాగ్రత్త పడుతూ ఆడేవి. ఇప్పుడు కీలక దశలో ఉండగా పడుతుండటంతో గుజరాత్ టైటాన్స్ ఇలాగే ఇంటి దారి పట్టింది.
ఇప్పుడు కూడా హైదరాబాద్ లో జరగనున్న సన్ రైజర్స్ వర్సెస్ గుజరాత్ మధ్య మ్యాచ్ కి వరుణుడు అడ్డం పడేలా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఉప్పల్ మైదానంలో ఉరుములతో కూడిన మెరుపులు మెరుస్తున్నాయి. నగరమంతా ఒక్కసారిగా చల్లబడిపోయింది.
అయితే ఇక్కడ చిన్న ట్విస్ట్ ఉంది. మ్యాచ్ జరిగితే హైదరాబాద్ గెలవాల్సి ఉంటుంది. అప్పుడు 16 పాయింట్లతో ప్లే ఆఫ్ కి వెళుతుంది. ఒకవేళ రద్దయినా 15 పాయింట్లతో వెళుతుంది. ఎటొచ్చి ఓడిపోతే మాత్రం 14 పాయింట్లతో అలాగే ఉండిపోతుంది.
Also Read: IPL 2024 Playoffs Schedule: ఐపీఎల్ ప్లే ఆఫ్ మ్యాచ్‌లు.. ఎక్కడెక్కడంటే..?
అప్పుడు పంజాబ్ తో మిగిలిన ఆఖరి మ్యాచ్ లో గెలవక తప్పని పరిస్థితి నెలకొంటుంది. అందుకే ప్రస్తుతం వరుణుడు పడి మ్యాచ్ రద్దయిపోవాలని, ఆ ఒక్క పాయింట్ తో గొడవ లేకుండా ప్లే ఆఫ్ కి హైదరాబాద్ వెళ్లిపోవాలని అభిమానులందరూ ఆశపడుతున్నారు.