BigTV English

Naga Chaitanya: అప్పుడు సమంత.. ఇప్పుడు శోభిత.. అదే తంతు..!

Naga Chaitanya: అప్పుడు సమంత.. ఇప్పుడు శోభిత.. అదే తంతు..!

Naga Chaitanya..పెళ్ళై రెండు మూడు నెలలు కాకముందే శోభిత ధూళిపాళ్ల (Shobhita dhulipala) నాగార్జున(Nagarjuna ) ఇంట్లో చిచ్చు పెట్టిందా..? భర్తకు ఆ పని చేయాల్సిందే అంటూ కండిషన్ పెట్టిందా..? ఇంతకీ అక్కినేని ఫ్యామిలీలో శోభిత పెట్టిన చిచ్చు ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం.. ‘గూఢచారి’ మూవీతో టాలీవుడ్ లోకి వచ్చిన శోభిత ధూళిపాళ్ల మొదటి మూవీ తోనే హిట్ కొట్టింది. ఆ తర్వాత వచ్చిన ‘మేజర్’ సినిమాతో రెండోసారి కూడా అడివి శేష్(Adivi shesh) తో జత కట్టింది. అలా రెండో సినిమా కూడా బ్లాక్ బస్టర్.. ఆ తర్వాత ఏకంగా మణిరత్నం(Maniratnam ) డైరెక్షన్లో వచ్చిన ‘పొన్నియన్ సెల్వన్ 1’, ‘పొన్నియన్ సెల్వన్ 2’ రెండు సినిమాల్లో అవకాశం అందుకుంది. దాంతో శోభిత పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. ఇక శోభిత తెలుగమ్మాయి అయినప్పటికీ బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల్లో కూడా నటించి తన సత్తా నిరూపించుకుంది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ సినిమాల ద్వారా ఎక్కువ ఫేమస్ అవ్వలేదు కానీ అక్కినేని నాగచైతన్య(Akkineni Naga Chaitanya)తో డేటింగ్ చేస్తున్న విషయంలో మాత్రం తెగ ఫేమస్ అయిపోయింది. నాగ చైతన్య , సమంత(Samantha)కు విడాకులు ఇచ్చాక శోభితతో పలుమార్లు రెస్టారెంట్లలో కనిపించారు.


అప్పుడే ఇంట్లో పంచాయతీ పెట్టిన కొత్త కోడలు..

కానీ అందులో ఎలాంటి నిజం లేదు అని ఈ ఇద్దరు కొట్టి పారేశారు. అంతేకాదు తమ మధ్య ఎలాంటి బంధం లేదు అంటూ శోభిత కూడా కామెంట్ చేసింది. కానీ ఇద్దరి మధ్య రిలేషన్ ఉంది అంటే అదేమీ లేదు అంటూ సోషల్ మీడియాలో కాస్త హద్దు మీరీ ప్రవర్తించింది. ఈ విషయంపై అప్పట్లో భారీ ట్రోల్స్ కూడా ఎదుర్కొంది. ఇకపోతే ఈ విషయం కాస్త పక్కన పెడితే.. శోభిత , నాగచైతన్య గత ఏడాది ఆగస్టు 8వ తేదీన నిశ్చితార్థం చేసుకున్నారు. ఆ ఫోటోలను నాగార్జున తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేయడంతో.. అప్పటివరకు వచ్చిన రూమర్స్ కాస్త నిజమయ్యాయి. శోభిత, నాగచైతన్య పెళ్లి డిసెంబర్ 4 న జరిగింది. అయితే పెళ్ళై కనీసం రెండు నెలలు కూడా కావడం లేదు అప్పుడే అక్కినేని ఫ్యామిలీలో పంచాయతీ పెట్టేసిందట కొత్త కోడలు..


పంతం నెగ్గించుకుంటున్న కొత్త కోడలు..

అదేంటంటే నాగచైతన్యతో శోభిత సపరేట్ గా ఉండాలనుకుంటుందట.అందుకే నాగార్జున ఇంట్లో నుండి వెళ్లిపోయి వేరే ఫ్లాట్ తీసుకుందామని చైతూని పదేపదే అడుగుతోందట. కానీ నాగచైతన్య మాత్రం ఇప్పుడప్పుడే వేరు కాపురం వద్దు. మరికొద్ది రోజులయ్యాక చూద్దాంలే అని చెప్పినా కూడా వినకుండా శోభిత నాగచైతన్యను విసిగిస్తుందట. దీంతో ఈ విషయం కాస్తా నాగార్జున దృష్టికి వెళ్లడంతో పిల్లలు హ్యాపీగా ఉండడమే నాకు కావాలి అని చెప్పి నాగార్జున శోభిత మాటలను ఏకీభవించారట. నాగార్జున కూడా శోభిత నాగచైతన్యతో కలిసి వేరు కాపురం పెట్టడానికి ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ విషయం మీడియాలో వైరల్ గా మారడంతో చాలామంది నెటిజన్లు కొత్తకోడలు పెళ్లయి రెండు నెలలు కాకముందే కొత్త చిచ్చు పెట్టిందిగా.. కనీసం సంవత్సరం కూడా అత్తమామలతో కలిసి ఉండక.. ముందే వేరే కాపురం పెట్టాలని నిర్ణయించుకుంది అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

అప్పుడు సమంత.. ఇప్పుడు శోభిత..

ఇక గతంలో సమంతను పెళ్లి చేసుకున్న సమయంలో కూడా నాగచైతన్యని ఇలాగే విసిగించిందని, అలా సమంత టార్చర్ తట్టుకోలేని నాగచైతన్య వెంటనే మురళీమోహన్ ఫ్లాట్ చూసి, బాగుండడంతో నాగార్జునని తీసుకువెళ్ళి మరీ ఒప్పించి ఆ ఫ్లాట్ కొనుగోలు చేశారు. ఇప్పుడు అచ్చం సమంత లాగే శోభిత కూడా భర్తతో వేరు కాపురం పెట్టాలని ఇంట్లో రచ్చ చేసి చివరికి అనుకుంది సాధించింది అంటూ సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. అంతేకాదు గతంలో సమంత గ్లామర్ షో చేసింది. దీనికి నాగచైతన్య ఫ్యామిలీ అభ్యంతరాలు చెప్పిందని సమాచారం అయితే ఇప్పుడు శోభిత కూడా అదే గ్లామర్ షో చేస్తూ మళ్లీ వారికి తలనొప్పిగా మారిందని వార్తలు నటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు ఏది ఏమైనా నాగచైతన్యకు ఇద్దరు భార్యలు వస్తే ఇద్దరూ కూడా ఆయన మాట వినకపోవడం పైగా ఆయనను విసిగించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ విషయం తెలిసి అభిమానులు మళ్లీ ఇండస్ట్రీ వాళ్ళనే ఎందుకు చేసుకున్నావ్ గురూ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×