Allu Arjun – Charan : గత ఏడాది ఎన్నికల తర్వాత నుంచి మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న సంగతి. అప్పటి నుంచి ఇప్పటివరకు ఏదొక విషయం లో మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య గొడవలు జరుగుతున్నాయి. అని ఓ వార్త నెట్టింట ప్రచారంలో ఉంది. ఇక ఈ హీరోల ఫ్యాన్స్ కూడా తమ హీరో గొప్పంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇప్పుడిప్పుడే ఆ మంటలు చల్లారుతున్నాయి అనుకునే సమయానికి ఇప్పుడు మరో కొత్త రచ్చ వినిపిస్తుంది. మళ్లీ రెండు కుటుంబాల మధ్య వార్ ముదురుతుంది అనేలా వార్తలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా చరణ్‌లో లేనిది అల్లు అర్జున్‌లో ఉన్న ఆ స్పెషల్ క్వాలిటీ ఇదే అంటూ మరో వార్త చర్చనీయాంశంగా మారింది. అల్లు అర్జున్ ఎందులో ఎక్కువ? రాంచరణ్ ఎందులో తక్కువ? ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..
అల్లు అర్జున్ లో ఉన్న స్పెషల్ క్వాలిటి ఇదే అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రామ్ చరణ్ ఆ ఒక్కటి లేకపోవడంతోనే గ్లోబల్ స్టార్ అయిన క్రేజ్ ను అందుకోలేక పోయడానికి అల్లు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈమధ్య అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. బాక్స్ ఆఫీస్ వద్ద భారీ ప్రభంజనాన్ని సృష్టించింది. అలాగే రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చింది. ఆ మూవీ భారీ ఫ్లాప్ ఎదుర్కొన్న చరణ్, పుష్ప 2 సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్న అల్లు అర్జున్ ఇద్దరినీ కంపేర్ చేస్తూ.. మెగా ఫ్యాన్స్ ను మరింత కోపానికి గురి చేస్తున్నారు.. అల్లు అర్జున్తో పోలిస్తే రామ్ చరణ్ కాస్త భయస్తుడు అని తెలుస్తుంది. సినిమాల విషయంలో రిస్క్ చేయడానికి.. సేఫ్‌గా ముందుకు వెళ్ళిపోవాలని ఆలోచిస్తాడంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు..
ఇక బన్నీ అలా కాదు చాలా ధైర్యంగా ఉంటాడు అందుకే పుష్ప 2 లాంటి సినిమాని అలవాహక చేశాడు లాంటి సినిమాని అలవొక గా చేశాడు. ఇక పార్ట్ 2 కోసమైతే లేడీ గెటప్ చేసే సాహసం చేశాడని.. రామ్ చరణ్‌కు అలాంటి ధైర్యం లేదంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక రాంచరణ్ నటించిన రంగస్థలం మూవీ ని మొదటగా ఫ్యాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేద్దామని అనుకున్నారు కాకపోతే చరణ్ అంత ధైర్యం చేయలేకపోవడంతో ఆ సినిమాని మామూలుగానే రిలీజ్ చేశారు. ఇక పుష్ప సినిమా విషయంలో సుకుమార్ తడబడుతున్న బన్నీ ముందుకు తెగించి సినిమా చేద్దామని సపోర్ట్ చేశాడట. మొత్తానికి అయితే రామ్ చరణ్తో పోలిస్తే అల్లు అర్జున్కి ధైర్యం ఎక్కువ అని ఓ వార్త అయితే ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తుంది. ఇక మెగా ఫాన్స్ అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ఈ విషయం పై వార్ మొదలుపెట్టినట్లు తెలుస్తుంది. ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికొస్తే త్రివిక్రంతో ఓ సినిమా చేస్తున్నాడు.. ఆ తర్వాత మళ్లీ పుష్ప 2 సీక్వెల్ గా పుష్ప 3 సినిమాలో నటిస్తున్నాడు. రామ్ చరణ్ సినిమాలు విషయానికొస్తే ప్రస్తుతం బుచ్చిబాబుతో తన 16వ సినిమాను చేస్తున్నాడు. ఆ తర్వాత సుకుమార్ తో ఓ సినిమా చేస్తున్నాడు.