Delhi Election Results 2025 Live Updates: ఇండియా క్యాపిటల్ ఢిల్లీలో జెండా పాతేసింది బీజేపీ పార్టీ. ఇన్నాళ్లు ఢిల్లీలో ఏక చక్రాధిపత్యాన్ని కొనసాగిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీకి .. కమలం పార్టీఫుల్‌స్టాప్ పెట్టింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ పార్టీ ఓటమి చెందింది. ఢిల్లీలో అధికారిన్ని కోల్పోయింది ఆమ్ ఆద్మీ సర్కార్. మూడు సార్లు ఢిల్లీ ఎన్నికల్లో గెలిచిన ఆమ్ ఆద్మీకి..ఈ సారి ఢిల్లీ ఓటర్లు రెస్ట్ ఇచ్చారు. ఇక పాలించింది చాలు అంటూ సెలవిచ్చారు. దీంతో ఢిల్లీ పీఠం బీజేపీ సొంతమైంది.
మునుపటి కంటే.. ఈ సారి ఎన్నికలు చాలా హోరాహోరీగా జరిగాయి. గెలుపు కోసం ఆప్, బీజేపీ గట్టిగా తలపడ్డాయి. ఎలాగైనా ఢిల్లీ పీఠాన్ని సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో..బీజేపీ అగ్రనాయకత్వం అంతా ఢిల్లీని చుట్టేశారు. మరోవైపు ఆప్ నుంచి కూడా కేజ్రీవాల్ తన శక్తినంతా ఒడ్డి..గెలుపు కోసం ప్రయత్నించారు. చివరి వరకు గట్టి పోటీయే ఇచ్చిన ఆప్.. చెప్పుకోదగ్గ సీట్లు సాధించి ప్రతిపక్షానికి పరిమితమైంది. తమకు డబల్ ఇంజిన్ సర్కారే కావాలంటూ.. ఢిల్లీ ప్రజలు కమలానికే అధికార పీఠం కట్ట పెట్టారు. దీంతో 27 ఏళ్ల తర్వాత.. ఢిల్లీలో బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంది.
ఈసారి ఎన్నికలు ఆప్‌కి చాలా కష్టతరంగానే మారాయనే చెప్పుకోవాలి. ఎందుకంటే కేజ్రీవాల్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలు..ఆయన సీఎం పదవికి రాజీనామా చేయడం వంటి కీలక పరిణాల మధ్య.. ఆ పార్టీ ఎన్నికలకు వెళ్లింది. దీంతో ప్రభావం ఎన్నికల ఫలితాలపై స్పష్టంగా కనిపించింది. కేజ్రీవాల్ జైలు కెళ్లడం.. అవినీతి ముద్ర పడటంతో ఆ ప్రభావం పార్టీపై పడింది. దీంతో ఆప్ నేతలు, క్యాడర్ సైతం అధినేత అరెస్టుతో ఢీలా పడ్డారు. ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో కీలక ఆప్ నేతలు అరెస్టులు.. ఆ పార్టీని కుదిపేశాయి. దీంతో కష్టతరమైన పరిస్థితుల మధ్య ఎన్నికలుక వెళ్లిన ఆప్.. బీజేపీ హవా ముందు నిలవలేకపోయింది.
దాదాపు ఆప్ కీలక నేతలు ఓడిపోయారు. ముఖ్యంగా కేజ్రీవాల్‌ను బాగా టార్గెట్ చేసింది బీజేపీ. న్యూఢిల్లీలో ఆయన పోటీచేసే స్థానంపై గురిపెట్టింది. కేజ్రీవాల్‌కు పోటీగా మాజీ సీఎం కొడుకు సాహిబ్ సింగ్ కుమారుడు పర్వేశ్ వర్మను పోటీలోకి దింపింది బీజేపీ. మరోవైపు ఢిల్లీ ఎన్నికల్లో ఎక్కడా ఖాతా తెరవలేకపోయింది కాంగ్రెస్. అయితే కాంగ్రెస్, ఆప్ వేరుగా పోటీ చేయడం బీజేపీకి కలిసొచ్చింది. కాంగ్రెస్ ఓట్లు చీల్చడంతో బీజేపీ గెలుపు సులభతరమయింది.
ఢిల్లీ ఎన్నికల ఫలితాలు: బీజేపీ – ఆప్ మధ్య హోరా హోరీ
43 స్థానాల్లో బీజేపీ ఆధిక్యం
27 స్థానాల్లో కొనసాగుతున్న ఆప్
తొలి రౌండ్లలో ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్న కాంగ్రెస్, ఇప్పుడు వెనుకంజ
⦿ ఆప్ 27
⦿ బీజేపీ 43
⦿ కాంగ్రెస్ 00
⦿మళ్లీ వెనుకంజలో కేజ్రీవాల్
⦿ ఆధిక్యంలో ఉన్న బీజేపీ అభ్యర్ధి రమేశ్ బిధూరి
⦿ షాకూర్ బస్తీలో 6,524 ఓట్ల వెనుకంజలో ఆప్ అభ్యర్ధి సత్యేంద్ర జైన్
⦿ గాంధీనగర్ లో బీజేపీ అర్విందర్ సింగ్ లవ్లీపై ఆప్ అభ్యర్ధి నవీన్ చైదరి 5,085 ఆధిక్యం
⦿ ఒక్క చోట కూడా ఆధిక్యంలోని కాంగ్రెస్
⦿ జంగ్‌పురలో సిసోడియా ఓటమి
⦿ బల్లిమరాన్‌లో ఆప్ అభ్యర్ధి ఇమ్రాన్ హుస్సేన్ ముందంజ
⦿ అమానుతుల్లా ఖాన్ ముందంజ
ఓక్లా స్థానంలో ఆప్ అభ్యర్థి అమానుతుల్లా ఖాన్ ముందంజ
⦿ సత్యేంద్ర కుమార్ జైన్ ముందంజ
షాకూర్ బస్తీలో ఆప్ అభ్యర్ధి సత్యేంద్ర కుమార్ జైన్ ముందంజ
⦿ కాల్‌కాజీలో ముందంజలో ఢిల్లీ అతిశీ
⦿ కార్వాన్‌నగర్‌లో బీజేపీ అభ్యర్ధి కపిల్ మిశ్రా ఆధిక్యం