BigTV English
Advertisement

2025 Summer Movies : వచ్చే ఏడాది సమ్మర్ బాక్సాఫీస్ ఎలా ఉండబోతుందంటే?

2025 Summer Movies : వచ్చే ఏడాది సమ్మర్ బాక్సాఫీస్ ఎలా ఉండబోతుందంటే?

2025 Summer Movies : గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది సినిమాల సందడి కాస్త తక్కువగా ఉంది. ఇక వచ్చే ఏడాది ప్రారంభం నుంచే థియేటర్లలోకి ఎక్కువగా విడుదల అవుతున్నాయి. 2025 సంక్రాంతికి రిలీజ్ అవుతున్న లిస్ట్ ఆలో్మోస్ట్ కన్ఫర్మ్ అయ్యింది.. ఇక సమ్మర్ సినిమాల లిస్ట్ గురించి సినిమా అభిమానులు కన్ఫ్యుజన్ లో ఉన్నారు. ఇక తర్వాత సమ్మర్ బాక్సాఫీస్ వద్ద బిగ్ ఫైట్ ఉండబోతోంది. బ్యాక్ టూ బ్యాక్ ఆరు పాన్ ఇండియా మూవీస్ తెలుగులో రిలీజ్ కాబోతున్నాయి. ఈ సినిమాలు అన్ని కూడా భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నవే కావడం విశేషం.. ఇక సమ్మర్ లో బాక్సాఫీస్ ను షేక్ చెయ్యడానికి థియేటర్లలోకి రాబోతున్న సినిమాలు ఏవో ఒక లుక్ వేద్దాం పదండీ..


‘హరిహర వీరమల్లు’..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ ‘ హరి హర వీరమల్లు’.. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కాబోతుంది. నిర్మాత ఏఎం రత్నం అండ్ కో ‘హరిహర వీరమల్లు’ పోస్టర్స్ రిలీజ్ చేస్తూ మూవీ పైన అంచనాలు పెంచే ప్రయత్నం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఫస్ట్ టైం కంప్లీట్ పీరియాడికల్ జోనర్ లో విప్లవయోధుడి క్యారక్టర్ లో కనిపిస్తున్నాడు. అందుకే ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పవన్ ఇన్నేళ్లకు ఇలా కనిపిస్తున్నారు. దాంతో ఈ సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ హై రేంజ్ లో ఉన్నాయి..


‘ది రాజాసాబ్’..

పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘ది రాజా సాబ్ ‘.. మారుతి దర్శకత్వం ఈ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఈ సినిమా సంచలనాలు క్రియేట్ చేయడం గ్యారెంటీ అని డార్లింగ్ ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. ఇక ఈ మూవీని ఏప్రిల్ 10 విడుదల చెయ్యనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.

‘మిరాయ్’..

హనుమాన్ హీరో తేజా సజ్జా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మిరాయ్ ‘.. సూపర్ హీరో కాన్సెప్ట్ తోనే ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ మూవీలో మంచు మనోజ్ పవర్ ఫుల్ విలన్ గా నటిస్తున్నాడు.. ఈ సినిమా ఏప్రిల్ 18న రిలీజ్ కాబోతుంది.

‘Hit 3 ‘..

నేచురల్ స్టార్ నాని నుంచి ‘హిట్ 3’ మూవీ థియేటర్స్ లోకి రాబోతోంది. సక్సెస్ ఫుల్ సినిమా హిట్ 2 కు సీక్వెల్ గా ఈ మూవీ తెరకెక్కుతుంది. ఈ సినిమాపైన అంచనాలు భారీగానే ఉన్నాయి. ఏకంగా 100 కోట్ల బడ్జెట్ తో క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ ని అందుకుంటాననే నమ్మకంతో నాని ఉన్నారు. మే 1 న మేడే సందర్బంగా ఈ మూవీ రాబోతుంది.

‘విశ్వంభర’..

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభరా మూవీ పై చిరంజీవి ఆశలు పెట్టుకున్నాడు. తాజాగా వచ్చిన టీజర్ తో ఈ సినిమాపై హైప్ పెరిగింది. ఈ సినిమాను మే 9 నా రిలీజ్ చెయ్యనున్నారని తెలుస్తుంది..

ఇవే కాదు.. మే నెలలో విజయ్ దేవరకొండ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘VD12’ థియేటర్స్ లోకి రాబోతోంది. పాన్ ఇండియా రేంజ్ లోనే ఈ సినిమా రిలీజ్ కానుంది. మూవీలో విజయ్ దేవరకొండ రెండు భిన్నమైన లుక్స్ లో కనిపించబోతున్నాడు. మొత్తంగా ఈ సమ్మర్ కు 6 సినిమాలు విడుదల కాబోతున్నాయి.

 

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×